జనగాం నగరంలో వాల్ పోస్టర్ల బెడదను అరికట్టేందుకు మున్సిపాలిటీ వినూత్న కార్యక్రమం చేపట్టింది. చెత్తగా మారిన గోడలను అందంగా మార్చేందుకు రీసైకిల్ ప్లాస్టిక్ బాటిళ్లతో చేసిన పూల కుండీలను ఏర్పాటు చేశారు. రైల్వే ఓవర్ బ్రిడ్జిపై ప్రారంభమైన ఈ గాంధేయ మార్గం ద్వారా నగరమంతా పరిశుభ్రంగా మార్చడమే లక్ష్యం.