Vijay Devarakonda: అప్పుడే సమంతతో ప్రేమలో పడిపోయా.. టాలీవుడ్‌ రౌడీ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

సందర్భమొచ్చినప్పుడల్లా సమంతపై తన అభిమానాన్ని చాటుకుంటున్నాడు టాలీవుడ్‌ రౌడీ విజయ్‌. తాజాగా యశోద ట్రైలర్‌ రిలీజ్‌ సందర్భంగా మరోసారి సామ్‌పై ఇష్టాన్ని చాటుకున్నాడీ హీరో

Vijay Devarakonda: అప్పుడే సమంతతో ప్రేమలో పడిపోయా.. టాలీవుడ్‌ రౌడీ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌
Samantha, Vijay Devarakonda
Follow us
Basha Shek

|

Updated on: Oct 28, 2022 | 11:53 AM

టాలీవుడ్‌ హీరోయిన్‌ సమంత లీడ్‌రోల్‌లో నటించిన చిత్రం యశోద. కరోనా కారణంగా ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఎట్టకేలకు నవంబర్‌ 11న ఈ థ్రిల్లర్‌ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఇందులో భాగంగా తాజాగా సినిమా ట్రైలర్‌ విడుదల చేశారు మూవీ మేకర్స్‌. తెలుగులో విజయ్‌ దేవరకొండ, తమిళ్‌లో సూర్య, హిందీలో వరుణ్‌ధావన్‌, కన్నడలో రక్షిత్‌శెట్టి, మలయాళంలో దుల్కర్‌ సల్మాన్‌ యశోద ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. కాగా సందర్భమొచ్చినప్పుడల్లా సమంతపై తన అభిమానాన్ని చాటుకుంటున్నాడు టాలీవుడ్‌ రౌడీ విజయ్‌. తాజాగా యశోద ట్రైలర్‌ రిలీజ్‌ సందర్భంగా మరోసారి సామ్‌పై ఇష్టాన్ని చాటుకున్నాడీ హీరో. ‘కాలేజీ రోజుల్లో ఉన్నప్పుడు మొదటిసారి ఆమె (సమంత)ను సిల్వర్‌ స్క్రీన్‌పై చూసి ప్రేమలో పడిపోయాను. ఇక, ఇప్పటికీ అన్ని విధాలుగా ఆమెను ఆరాధిస్తున్నా’ అని అందులో రాసుకొచ్చాడు విజయ్‌.

ప్రస్తుతం విజయ్‌ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసిన అభిమానులు ‘మీ ఇద్దరినీ మరోసారి స్క్రీన్‌పై చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’, ‘ఖుషి సినిమా అప్‌డేట్‌లు ఇవ్వండి అన్నా’ అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఇదివరకే మహానటి సినిమాలో విజయ్‌, సామ్‌ జంటగా కనిపించి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. మరోసారి వీరి కాంబినేషన్‌లో ఓ ప్రేమకథా చిత్రం రానుంది. అదే ఖుషి. శివ నిర్వాణ దర్శకుడు. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌ టైటిల్‌ పోస్టర్‌, మేకింగ్‌ వీడియోలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక యశోద సినిమా విషయానికి వస్తే.. సరోగసి నేపథ్యంలో సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా హరి, హరీశ్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సరోగసీ పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న వారిపై సామ్ చేసే పోరాటాలను చూపిస్తూ విడుదలైన ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?