PS1: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి వచ్చేసిన ‘పొన్నియన్ సెల్వన్’.. వారికి మాత్రమే..
థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమైంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్..

డైరక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియన్ సెల్వన్’. కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా రూపొందిస్తోన్న ఈ సినిమాను ఆయన రెండు భాగాలుగా తీస్తున్నారు. ఇందులో మొదటి భాగం సెప్టెంబర్ 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైంది. బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ టాక్ అందుకోవడమే కాదు.. సుమారు రూ. 500 కోట్ల వసూళ్లు సాధించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉంటే.. థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమైంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకోగా.. అక్టోబర్ 28 మిడ్ నైట్ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అయితే అది కూడా కేవలం పే-పర్ వ్యూలోనే అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం యూజర్లు ‘పొన్నియన్ సెల్వన్’ సినిమా చూడాలంటే రూ. 199 చెల్లించాలి. అటు నవంబర్ 4వ తేదీ నుంచి ఈ సినిమాను ప్రైమ్ యూజర్లందరూ ఉచితంగా చూడొచ్చునని అమెజాన్ తెలిపింది. కాగా ఈ మూవీలో విక్రమ్, ఐశ్వర్యరాయ్, జయం రవి, త్రిష, కార్తి ప్రధాన పాత్రలు పోషించగా.. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి.
#PonniyinSelvan part 1 now available to rent on Amazon Prime Video for ₹199
The film will be available for prime customers from November 4th. pic.twitter.com/PeSTenaDue
— LetsCinema (@letscinema) October 27, 2022