AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Ali: మా కూతురు పెళ్లికి జగన్‌ ఇచ్చిన గిఫ్ట్‌గా భావిస్తున్నాం.. మీడియా సలహాదారు పదవి రావడంపై అలీ దంపతులు

2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అలీ పలు ప్రాంతాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీచేయకపోయినా వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం బాగానే కృషిచేశారు.

Actor Ali: మా కూతురు పెళ్లికి జగన్‌ ఇచ్చిన గిఫ్ట్‌గా భావిస్తున్నాం.. మీడియా సలహాదారు పదవి రావడంపై అలీ దంపతులు
Cm Jagan, Ali
Basha Shek
|

Updated on: Oct 28, 2022 | 9:23 AM

Share

అలీ.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. చైల్డ్‌ ఆర్టిస్టుగా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన కమెడియన్‌నగా, హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమా పరిశ్రమలో సుదీర్ఘకాలం పాటు కెరీర్‌ కొనసాగిస్తోన్న నటుల్లో అలీ కూడా ఒకరు. ప్రస్తుతం సిల్వర్‌స్ర్కీన్‌పై కనిపిస్తూనే టీవీ షోలతో బుల్లితెరపై సందడి చేస్తున్నారాయన. అలాగే రాజకీయాల్లోనూ సత్తా చాటుతున్నారు. 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అలీ పలు ప్రాంతాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీచేయకపోయినా వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం బాగానే కృషిచేశారు. దీనికి గుర్తింపుగా .. జగన్‌ సీఎం కాగానే అలీకి ఓ కీలకమైన పదవి ఇస్తారనే టాక్ వచ్చింది. రాజ్యసభ అని కొన్నాళ్లు.. వక్ఫ్‌బోర్డు ఛైర్మన్ పదవి అని మూడేళ్ల పాటు ప్రచారం జరిగిందే తప్ప పదవీ మాత్రం రాలేదు. అయితే ఎట్టకేలకు తాజాగా అలీని తన ప్రభుత్వంలో చోటు కల్పించారు సీఎం జగన్‌. ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా ఆయనను నియమించారు. రెండేళ్లపాటు ఈ పదవిలో ఉండనున్నారు అలీ. ఆయన జీతభత్యాలు, అలవెన్సులకు సంబంధించి మరోసారి ఉత్తర్వులు ఇస్తామని జీవోలో పేర్కొన్నారు. గవర్నమెంట్ అడ్వైజర్లకు రూ.3లక్షల వరకు వేతనం ఉంటుంది. అదనంగా కొన్ని అలవెన్సులు అందుతాయి.

పదవులు ఆశించలేదు..

కాగా ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహా దరుడిగా తనను నియమించినందుకు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు అలీ. వైఎస్ జగన్ గారు ఇచ్చిన ఈ పదవిని ఫుల్ ఫిల్ చేస్తానంటూ హర్షం వ్యక్తం చేశారు. ఇది తన కూతురు పెళ్లి సందర్భంగా వైఎస్ జగన్ ఇచ్చిన గిఫ్ట్ గా భావిస్తునన్నాడు. ‘నేను వైసీపీ కండువా కప్పుకున్నప్పుడే జగన్‌కు నా ఉద్దేశాన్ని స్పష్టం చేశాను. పదవుల కోసం పార్టీలోకి రాలేదన్న విషయాన్ని ఆయనకు తెలిపాను. అయితే నా పదవికి సంబంధించి గతంలో మీడియాల్లో పలు రకాల వార్తా కథనాలు వచ్చాయి. దీనిపై నేను కూడా క్లారిటీ ఇచ్చాను. అయితే నా గురించి జగన్‌కు తెలుసు. అందుకు నిదర్శనమే ఈ పదవి. ఇది నా కూతురి పెళ్లికి జగన్‌ ఇచ్చిన బహుమతిగా భావిస్తున్నాను’ అంటూ ఎమోషనల్‌ అయ్యాడు అలీ. కాగా అలీ సతీమణి జుబేదా కూడా జగన్‌కు కృతజ్ఞతలు తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..