అక్రమ వ్యాపారంలో ఆధిపత్యపోరు.. గుంటూరు జిల్లాలో కిడ్నాప్ కు గురైన బియ్యం వ్యాపారి దారుణ హత్య..

బాసు, వాసు వర్గాలు ఒకే ప్రాంతంలో బియాన్ని కొని విక్రయిస్తుండటంతో పోటీ మొదలైంది. ఈ క్రమంలోనే బర్న బాసు తన ప్రత్యర్ధులైన వాసు శ్రీనులు రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి రవాణా చేస్తున్న సమయంలో..

అక్రమ వ్యాపారంలో ఆధిపత్యపోరు.. గుంటూరు జిల్లాలో కిడ్నాప్ కు గురైన బియ్యం వ్యాపారి దారుణ హత్య..
Ration Rice Mafia
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 27, 2022 | 8:01 PM

రేషన్ బియ్యం కొనుగోళ్లలో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. తన ఏరియాలోకి ఇతరులు రావటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కొందరు దళారులు. విజిలెన్స్ అధికారుల సాయంతో ప్రత్యర్ధులను కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు…. వెరసి సుఫారీ హత్య .గుంటూరు జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. తమను వేధిస్తున్న పత్ర్యర్ధి వ్యాపారిని అత్యంత్య క్రూరంగా హత్య చేసిన తోటి వ్యాపారులు తమ ప్రతాపం ప్రదర్శించారు. ఎట్టకేలకు రేషన్ బియ్యం వ్యాపారి బర్న బాస్ హత్య కేసులో ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే ..

గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో బర్న బాసు రేషన్ బియ్యాన్ని డీలర్లు, లబ్ది దారుల వద్ద నుండి కొనుగోలు చేసి మిల్లు వ్యాపారులకు విక్రయించే వాడు. గత కొంతకాలంగా అధిక మొత్తంలో రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేస్తున్న బర్న బాసు ఏకంగా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నాడు. అయితే పొన్నూరు ప్రాంతానికే చెందిన వాసు, పోకల శ్రీను కూడా రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి విక్రయించే వారు. బాసు, వాసు వర్గాలు ఒకే ప్రాంతంలో బియాన్ని కొని విక్రయిస్తుండటంతో పోటీ మొదలైంది. ఈ క్రమంలోనే బర్న బాసు తన ప్రత్యర్ధులైన వాసు శ్రీనులు రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి రవాణా చేస్తున్న సమయంలో పోలీసులు, విజిలెన్స్ అధికారుల సాయంతో దాడులు చేయించే వాడు. దీంతో వీరిద్దరూ బర్న బాసుపై కక్ష పెంచుకున్నారు. ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని చూశారు. వెంటనే రేపల్లేకు చెందిన కూచిపూడి వెంకటేశ్వరావు అలియాస్ వెంకట్ ను సంప్రదించి బర్న బాసును హత్య చేస్తే డబ్బులిస్తామని చెప్పారు. దీంతో వెంకట్ రంగంలోకి దిగాడు.

ఈ నెల 16న కిడ్నాప్ చేసి హత్య చేసేందుకు ప్రయత్నించాడు. అయితే వర్క అవుట్ కాలేదు. దీంతో మరోసారి ఈ నెల 18న రాత్రి ఎనిమిది గంటల సమయంలో బండిపై ఇంటికి వెలుతున్న బర్న బాసును వెనుక నుండి కారుతో ఢీ కొట్టారు. కిందపడిన బర్న బాసును కారులోకి ఎక్కించుకొని మచిలీపట్నం వైపు వెళ్లారు. మధ్యలో కారులోనే బర్న బాసు ముఖానికి ప్లాస్టిక్ టేపు చుట్టారు. దీంతో గాలి ఆడక బర్న్ బాసు చనిపోయాడు. మృత దేహాన్ని పొలాటి తిప్ప వద్ద గుండేరు కాలువలో పడేసి వెళ్లిపోయారు.

ఇవి కూడా చదవండి

అయితే రంగంలోకి దిగిన పోలీసులు పట్టణంలోని సిసి కెమెరా విజువల్స్ సేకరించారు. వీటి ఆధారంగా వాసు అనుచరుడు గాలీబ్ ను అదుపులోకి తీసుకున్నారు. గాలీబ్ ఇచ్చిన సమాచారంతో సుఫారి హత్య వెలుగులోకి వచ్చింది. మొత్తం పదిమంది ఈ కేసులో ఉన్నట్లు ఏఎస్పీ అనిల్ కుమార్ తెలిపారు. వీరిలో ఇద్దరూ పరారీలో ఉన్నారని చెప్పారు. ప్రధాన నిందితులు వెంకట్,చక్ర ధర్ లను త్వరలోనే పట్టుకుంటామన్నారు. ఎనిమిది మందిని అరెస్ట్ చేసిన పోలీసులు వీరి వద్ద నుండి 4.35 లక్షల నగదు స్వాధీనం చేసుకుని ఒక కారు, మూడు బైక్ లను సీజ్ చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు