Allagadda: అతడికి 22.. ఆమెకు 33 ఏళ్లు.. ఫేస్‌బుక్‌ పరిచయం.. ప్రియుడి మోజులో తీసింది పతి ప్రాణం

అతను ఆమెకంటే చిన్నోడు. కానీ ఇల్లీగల్‌ కనెక్షన్‌కు వయోభేదం అడ్డురాలేదు. తాగి కొట్టే భర్త కన్నా ..తమ్ముడి వయసున్న వీడే తన జోడు అని ఫిక్సయింది. భార్య నడవడికలో మార్పు గమనించిన కరిముల్లా పద్దతి మార్చుకోమని మందలించాడు.

Allagadda: అతడికి 22.. ఆమెకు 33 ఏళ్లు.. ఫేస్‌బుక్‌ పరిచయం.. ప్రియుడి మోజులో తీసింది పతి ప్రాణం
Wife kills husband with help of lover
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 27, 2022 | 9:37 PM

అది నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ.   అతనూ..ఆమె… మేడ్‌ ఫర్‌ ఈచర్‌… పెళ్లయిన కొత్తలో ఆల్‌ఈజ్‌ వెల్‌. ఇలా అన్యోన్యంగానే ఉండేవాళ్లు.. కానీ రాను రాను సీను మారింది. పట్టపగలే చుక్క పడాల్సిందే… తూగే దాక తాగాల్సిందే.. ఆ తరువాత ఇంట్లో ఇదీ సీను… ఎంతైనా పెనిమిటి కదా.. తాగి తూలుతున్న అతన్ని కుర్చీలో కూర్చోపెట్టి.. నీళ్లచ్చి.. రోజు ఇంతేనా..ఇక మారవా.. అనే అభ్యర్థనలు..అడపాడపా గొడవలు… ఇది నిత్యం ఉండే సీనే.. తెల్లారితే మళ్లీ మాములు మనిషే.. ఎంతైనా పెనిమిటి..పైగా స్మార్ట్‌ ఫోన్‌ కొనిచ్చాడుగా అతని పక్కనే కూర్చుని ఫోన్‌లో మాట్లాడుతుంటే …ఆ మజానే వేరు.. ఓర్నీ ఫోన్‌ కొనిస్తే మద్యం సీన్లు మాఫినేనా…అట్లనుకున్నాడు కరీముల్లా. కానీ తను కొనిచ్చిన ఫోన్‌ తన కాపురానికి ..ప్రాణానికి ఎసరు తెస్తుందనే విషయం అతని ఊహాకు కూడా అందలేదు. కానీ ఆమె ఊహాలకు రెక్కలు లొచ్చాయి. పతి కొనిచ్చిన ఫోన్‌తో ఫేస్‌బుక్‌ అకౌంట్‌తో పాటు మరో ఖాతా ఓపెనయింది.

ఫోన్‌ సొమ్ము భర్తది. .ఫోన్‌లో సొల్లు షోకు మరో శాల్తీది. ఫేస్‌బుక్‌లో పరిచయం ఎక్కడికో దారి తీసింది. ఓవైపు భర్తతో టచ్‌ మీ నాట్‌ .. మరోవైపు అతనితో బాత్‌చీత్‌ అండ్ మెనీ మోర్‌ ఫండా.. పెనిమిటి మద్యం మైకంలో ఆమె ప్రియుడి సన్నిధిలో…. ఓ రోజు భర్తకు విషయం తెలిసింది. భార్యను నిలదీశాడు. పద్దతి మార్చుకోవాలని హెచ్చరించాడు. కట్‌ చేస్తే .. ఇదిగో ఇలా ఆ ఇద్దరి సవారీ.. బయట చల్లని వాతావరణం..కానీ వాళ్ల మొహాలకు మాత్రం చెమటలు.. ఎందుకని? ఆ ఇద్దరు అతన్నే ఏసేశారు. శవాన్ని తీసుకెళ్లి కెనాల్‌లో పడేశారు. కానీ నిజంతో పాటు దుప్పటి చాటు క్రైమ్‌ కథా చిత్రమ్‌ సీన్‌ టు సీన్‌ రివీలైంది దర్యాప్తులో.. ఇది కథ కాదు.. ఆళ్లగడ్డలో ఆంటీ స్కెచ్‌…మొగుడు కొనిచ్చిన స్మార్ట్‌ఫోన్‌తో ..ఫేస్‌బుక్‌లో కడప రెడ్డి ప్రేమలో పడింది.ప్రియుడి మోజులో భర్తను హత్య చేయడమే కాకుండా కన్పించుట లేదని ఖాకీలకే కహానీలు విన్పించింది. పోలీసులకు తేడా వచ్చి లోతుగా ఎంక్వైరీ చేయడంతో గుట్టు వీడింాది.

ఫేస్‌ బుక్‌లో ప్రేమాయణం..ఆపై వివాహేతర సంబంధం.. అడ్డుగా వున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన వైనం.. ఆళ్లగడ్డను షేక్‌ చేసింది. హబ్బీని కడతేర్చిన మాబూబి స్కెచ్‌ మాములుగా లేదని ఖాకీలే షాకయ్యారు. కరీముల్లాతో ఆమెది పెద్దలు కుదర్చిన నిఖా. వాళ్లకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. కరీముల్లా ఆటో డ్రైవర్‌. భార్యాబిడ్డలంటే ఎంతో ప్రేమ. కాకపోతే మద్యం వ్యసనం మూలంగా కాపురంలో గొడవలు పీక్స్‌కు వెళ్లాయి. ఆ టైమ్‌లోనే ఫేస్‌బుక్‌లో వంశీరెడ్డితో పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది.వాడు కడప టు ఆళ్లగడ్డ షటిల్‌ సర్వీస్‌ షురూ చేశాడు. నిజానికి అతను ఆమెకంటే చిన్నోడు. కానీ ఇల్లీగల్‌ కనెక్షన్‌కు వయోభేదం అడ్డురాలేదు. తాగి కొట్టే భర్త కన్నా ..తమ్ముడి వయసున్న వీడే తన జోడు అని ఫిక్సయింది. భార్య నడవడికలో మార్పు గమనించిన కరిముల్లా పద్దతి మార్చుకోమని మందలించాడు. అంతే ప్రియుడు వంశీతో ఈ మ్యాటర్‌ను చర్చించింది. కరీముల్లాను ఖతమ్‌చేయాలని డిసైడయ్యారు ఇద్దరు. ఈ నెల ఒకటో తారీఖున కరీముల్లాకు స్పాట్‌ పెట్టారు.అదెలాగో దర్యాప్తులో వెలుగులోకి వచ్చిందిలా చంపేశారు. శవాన్ని తీసుకెళ్లి కాలువలోపడేశారు. కరీముల్లా కన్పించుట లేదని పోలీసులను ఫిర్యాదు చేసింది భార్యామణి మాబీబీ. మిస్సింగ్‌ కేసుగా దర్యాప్తు చేస్తోన్న క్రమంలో గుర్తు తెలియని ఓ శవం పడివుందని పోలీసులకు సమాచారం వచ్చింది. కరీముల్లా కుటుంబసభ్యులను పిలిపించారు. ఆనవాళ్లనుబట్టీ ఆ డెడ్‌బాడీ కరీముల్లాదేనని తేలింది. అంతే ఠపీమని ప్లేటు ఫిరాయించింది మాబాబీ. తన భర్తను ఎవరో హత్య చేశారని గొల్లుమంది. కానీ ఆమె ఫోన్ డేటాతో గుట్టు వీడింది.

కరీముల్లాను హత్య చేశాక డెడ్‌బాడీని చద్దర్‌లో చుట్టి..గోనెసంచిలో కుక్కి కాల్వలో పడేశారు. డౌట్‌ రాకుండా కన్పించుట లేదని మిస్సింగ్‌ కంప్లేంట్ ఇచ్చారు. ఆ క్రమంలో గుర్తు తెలియని శవం తెరపైకి వచ్చింది. అప్పటికే డెడ్‌బాడీ డీకంపౌజయింది. కానీ శవానికి చుట్టిన చద్దర్‌ను చూసి కరీముల్లా పిల్లలు ఈ దుప్పటి తమ ఇంట్లోనిదేనన్నారు. అంతే ఖాకీలకు కతర్నాక్‌ క్లూ దొరికింది. మాబూబీని అదుపులోకి తీసుకుని విచారిస్తే కడపరెడ్డి వంశీతో ఫేస్‌ బుక్‌ పరిచయం..వివాహేతరం సంబంధం,, అతనితో కలిసి భర్తను హత్య చేసిన వైనం సీన్‌ టు సీన్‌ నిజాలు బయటపడ్డాయి. నిందితులకు ముసుగు పడింది. కానీ ఈ ఇద్దరు చేసిన నేరానికి ఓ నిండు ప్రాణం బలైపోయింది. ముగ్గురు చిన్నారులు భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..