Court Jobs: డిగ్రీ పాస్‌ అయితే చాలు, నెలకు రూ. 80 వేలు జీతం.. ఏపీ జిల్లా కోర్టుల్లో భారీగా ఖాళీలు..

ఆంధ్రప్రదేశ్‌లోని కోర్టుల్లో ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్‌లు విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే హైకోర్టుతో పాటు, జిల్లాల్లో ఉన్న కోర్టుల్లో ఉన్న పలు ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీ హైకోర్టు మరో నోటిఫికేషన్‌ను జారీ చేసింది...

Court Jobs: డిగ్రీ పాస్‌ అయితే చాలు, నెలకు రూ. 80 వేలు జీతం.. ఏపీ జిల్లా కోర్టుల్లో భారీగా ఖాళీలు..
Ap District Court Jobs
Follow us
Narender Vaitla

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 28, 2022 | 9:05 PM

ఆంధ్రప్రదేశ్‌లోని కోర్టుల్లో ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్‌లు విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే హైకోర్టుతో పాటు, జిల్లాల్లో ఉన్న కోర్టుల్లో ఉన్న పలు ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీ హైకోర్టు మరో నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఏపీలోని జిల్లా కోర్టుల్లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన 681 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే జిల్లాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు…

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 681 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* వీటిలో అనంతపురం (53), చిత్తూరు (67), తూర్పు గోదావరి (80), గుంటూరు (64), వైఎస్ఆర్ కడప (46), కృష్ణా (68), కర్నూలు (17), ఎస్‌పీఎస్ఆర్‌ నెల్లూరు (33), ప్రకాశం (41), శ్రీకాకుళం (62), విశాఖపట్నం (71), విజయనగరం (21), పశ్చిమ గోదావరి (58) ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్‌ పరిజ్ఞానం/ కంప్యూటర్‌ ఆపరేషన్‌ అర్హత తప్పనిసరిగా ఉండాలి.

* అభ్యర్థుల వయసు 01-07-2022 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను కంప్యూటర్‌ బేస్‌డ్‌ పరీక్ష, సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 25,220 నుంచి రూ. 80,910 వరకు చెల్లిస్తారు.

* 22-10-2022 తేదీన మొదలైన ఆన్‌లైన్‌ అప్లికేషన్స్‌ స్వీకరణ ప్రక్రియ, 11-11-2022 తేదీతో ముగియనుంది.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!