Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ukraine medical Students: ‘చావనైనా చస్తాంగానీ ఇండియాకు మళ్లీ రాం..!’ ఉక్రెయిన్‌కు తిరిగి వెళ్లిన 1500 భారతీయ వైద్య విద్యార్ధులు..

ఉక్రెయిన్‌పై రష్యా వరుస దాడుల నేపధ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో సుమారు 1500ల మంది భారతీయ వైద్య విద్యార్ధులు ఇండియాకు తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. ఐతే యుద్ధ పరిస్థితులు ఇంకా సర్ధుమనగనప్పటికీ ఈ విద్యార్ధులంతా..

Ukraine medical Students: 'చావనైనా చస్తాంగానీ ఇండియాకు మళ్లీ రాం..!' ఉక్రెయిన్‌కు తిరిగి వెళ్లిన 1500 భారతీయ వైద్య విద్యార్ధులు..
Indian students refuse to leave Ukraine
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 27, 2022 | 1:42 PM

ఉక్రెయిన్‌పై రష్యా వరుస దాడుల నేపధ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో సుమారు 1500ల మంది భారతీయ వైద్య విద్యార్ధులు ఇండియాకు తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. ఐతే యుద్ధ పరిస్థితులు ఇంకా సర్ధుమనగనప్పటికీ ఈ విద్యార్ధులంతా తమ చదువుల నిమిత్తం తిరిగి ఉక్రెయిన్‌కు తిరిగి వెళ్లారు. నెలల తరబడి నిరీక్షిస్తున్నప్పటికీ భారత్‌ ఎటువంటి పరిష్కార మార్గం చూపకపోవడంతో విసుగు చెందిన వైద్య విద్యార్ధులు తమ చదువులను కొనసాగించేందుకు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తిరిగి ఉక్రెయిన్‌కు పయనమయ్యారు. వీరంతా ఉక్రెయిన్‌లో వివిధ మెడికల్‌ కాలేజీల్లో చదువుతున్న భారతీయ విద్యార్ధులు. ఇండియాకు వస్తే వైద్యపట్టాతోనే వస్తాం.. లేదంటే చావైనా.. రేవైనా ఉక్రెయిన్‌లోనే అని తెగేసి చెప్పారు. కాగా ఉక్రెయిన్‌లో నెలకొన్న యుద్ధ పరిస్థితులు దృష్ట్యా.. అక్కడ మిగిలి ఉన్న భారతీయులందరినీ దేశం విడచి వెంటనే వెళ్లిపోవాలని అక్టోబర్‌ 19న ఇండియన్ ఎంబసీ ప్రకటించింది. తర్వాత భారతీయ వైద్య విద్యార్ధులందరూ అక్కడికి వెళ్లడం ప్రస్తుతం సర్వత్రా చర్యణీయాంశమైంది.

నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్ (NMCA)-2019 ప్రకారం ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థులకు భారతీయ యూనివర్సిటీల్లో ప్రవేశాలు కల్పించలేమని సెప్టెంబర్‌లో కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇటువంటి సడలింపులు ఇవ్వడం వల్ల దేశంలో వైద్య విద్య ప్రమాణాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. దీంతో స్వదేశానికి తిరిగి వచ్చిన వైద్యా విద్యార్ధుల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది. ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థులు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై కేంద్రం చేతులెత్తేయంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మెడికల్ కాలేజీ దగ్గర తన హాస్టల్‌ని చూపిస్తూ, రోజూ ఐదు నుంచి ఏడు ఎయిర్ సైరన్‌లు వినిపిస్తున్నాయని, స్టూడెంట్స్‌ అధిక ధరలకు ఆహారాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుందని, ఇటువంటి పరిస్థితుల్లో తమకు వేనే ఆప్షన్‌ లేదని ఉక్రెయిన్‌లోని వినిత్సియా మెడికల్ కాలేజీలో వైద్యనభ్యసిస్తున్న విద్యార్ధి బీహార్‌లోని గయా జిల్లా నివాసి రవి కుమార్ తెలిపాడు.

ఇవి కూడా చదవండి

‘కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ గంగా’ ప్రాజెక్టును ప్రారంభించడం చాలా గర్వించదగ్గ విషయం. ఐతే ఉక్రెయిన్ నుంచి వచ్చిన వైద్య విద్యార్ధులు నెలల తరబడి వేచిఉన్న మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలు కల్పించేందుకు మాత్రం ఇంత వరకు పరిష్కారమార్గం చూపలేదు. ఇప్పటికే దాదాపు 300 మంది విద్యార్థులు వినిత్సియా మెడికల్ కాలేజీకి చేరుకున్నారు. దేశ నలుమూలల నుంచి దాదాపు 1,500 మంది విద్యార్థులు ఉక్రెయిన్‌లో తిరిగి అడుగుపెట్టారు. మెడికల్ డిగ్రీ నా చేతిలోకి వచ్చేంత వరకు భారత్‌కు తిరిగి రానని’ మోహన్‌ అనే వైద్య విద్యార్ధి మీడియాకు తెలిపాడు.