Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: ‘ఇదీ..నీ మైండ్‌ సెట్‌’ అంటూ భర్త వైపు చూస్తూ భార్య ఆత్మహత్య.. ఆద్యాంతం వీడియో తీసిన భర్త!

కట్టుకున్న భార్య కళ్ల ముందే ఆత్మహత్య చేసుకుంటుంటే సాధారణంగా ఏ భర్త అయిన అడ్డుపడి, కాపాడుతాడు. ఐతే ఈ భర్తగారు చేసిన నిర్వాకం చూస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. భార్య ఆత్మహత్య సన్నివేశాలను ఫోన్‌లో వీడియో తీసి, ఆ తర్వాత కుటుంబ సభ్యులకు..

Crime News: 'ఇదీ..నీ మైండ్‌ సెట్‌' అంటూ భర్త వైపు చూస్తూ భార్య ఆత్మహత్య.. ఆద్యాంతం వీడియో తీసిన భర్త!
Wife attempts suicide, husband records the incident
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 27, 2022 | 11:24 AM

కట్టుకున్న భార్య కళ్ల ముందే ఆత్మహత్య చేసుకుంటుంటే సాధారణంగా ఏ భర్త అయిన అడ్డుపడి, కాపాడుతాడు. ఐతే ఈ భర్తగారు చేసిన నిర్వాకం చూస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. భార్య ఆత్మహత్య సన్నివేశాలను ఫోన్‌లో వీడియో తీసి, ఆమె మృతి చెందిన తర్వాత కుటుంబ సభ్యులకు చూపాడు. ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. వివరాల్లోకెళ్తే..

ఉత్తరప్రదేశ్‌కు చెందిన సంజయ్, శోబితా గుప్తా దంపతులకు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. ఏంజరిగిందో తెలియదుగానీ మంగళవారం (అక్టోబర్‌ 25) శోబితా తండ్రి రాజ్ కిషోర్ గుప్తా ఫోన్‌ చేసి తన భార్య ఆత్మహత్య చేసుకుని మృతి చెందినట్లు తెలిపాడు. దీంతో అల్లుడింటికి చేరుకున్న కిషోర్ గుప్తా, ఇతర కుటుంబ సభ్యులకు.. మంచంపై విగత జీవిగా పడి ఉన్న శోభితను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అమె అప్పటికే మృతి చెందినట్లు పరీక్షించిన వైద్యులు దృవీకరించారు. దీంతో కూతురు మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు.

ఇంతలో అల్లుడు సంజయ్ గుప్తా తన మొబైల్ ఫోన్‌తో తీసిన వీడియోను అత్తమామలకు చూపించడంతో అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ వీడియోలో శోబిత మెడకు తాడు బిగించుకుని, ‘నీ మైండ్‌ సెట్‌ ఇదే’నని అంటూ భర్త వైపు చూస్తూ మంచంపై ఉన్న ఫ్యాన్‌కు ఉరివేసుకోవడానికి ప్రయత్నించడం కన్పిస్తుంది. ఐతే భార్య కళ్ల ముందు ఆత్మహత్య చేసుకుంటుంటే సంజయ్ ఆపేందుకు ప్రయత్నించకపోవడం ఆందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పైగా శోబితా గతంలో కూడా ఆత్మహత్యకు ఏవిధంగా పాల్పడిందో చెబుతూ మరో వీడియోను చూపాడు. ఐతే మొదటి సారి సూసైడ్‌కు ప్రయత్నించినప్పుడు ఆమెను కాపాడగలిగానని తెలిపాడు. అల్లుడు వ్యవహారంపై అనుమానం కలిగిన మామ రాజ్ కిషోర్ గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు భార్య మృతిలో సంజయ్ పాత్రపై విచారణ చేపట్టినట్లు ఓ పోలీస్‌ అధికారి తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైం వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.