NFC Hyderabad Jobs 2022: పదో తరగతి అర్హతతో.. హైదరాబాద్‌లోని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్‌లో 345 అప్రెంటిస్ ఖాళీలు..
డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ విభాగానికి చెందిన తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లోనున్న న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్.. 2022-23 సంవత్సరానికి గానూ 345 ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ..
డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ విభాగానికి చెందిన తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లోనున్న న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్.. 2022-23 సంవత్సరానికి గానూ 345 ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తుదారులు తప్పనిసరిగా పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికేట్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు 18 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నవంబర్ 5, 2022వ తేదీలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. అకడమిక్ మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ.7,700ల నుంచి రూ.8,050ల వరకు స్టైపెండ్ చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు..
- ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్
- అటెండెంట్ ఆపరేటర్ ఖాళీలు: 7
- ఎలక్ట్రీషియన్ ఖాళీలు: 26
- ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ఖాళీలు: 27
- ఫిట్టర్ ఖాళీలు: 119
- ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ఖాళీలు: 6
- లేబొరేటరీ అసిస్టెంట్ ఖాళీలు: 8
- మెషినిస్ట్ ఖాళీలు: 17
- కెమికల్ ప్లాంట్ ఆపరేటర్ ఖాళీలు: 5
- టర్నర్ ఖాళీలు: 27
- కార్పెంటర్ ఖాళీలు: 2
- కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA) ఖాళీలు: 74
- మెకానిక్ డీజిల్ ఖాళీలు: 2
- ప్లంబర్ ఖాళీలు: 4
- వెల్డర్ ఖాళీలు: 21
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.