Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharastra: అంత్యక్రియలకు తీసుకెళ్తుండగా ఊహించని షాక్.. లేచి కూర్చున్న యువకుడు.. దెబ్బకు జనం భయంతో పరార్

గుడి మెట్ల దగ్గర ఆ యువకుడి పాడెను ఉంచారు. కొద్దిసేపటికి  పాడే మీద ఉన్న వ్యక్తి నిద్ర నుంచి లేచి నట్లు నిద్ర లేచాడు. ఈ విచిత్ర ఘటన మహారాష్ట్రలోని అకోలాలో చోటుచేసుకుంది .

Maharastra: అంత్యక్రియలకు తీసుకెళ్తుండగా ఊహించని షాక్.. లేచి కూర్చున్న యువకుడు.. దెబ్బకు జనం భయంతో పరార్
Akola Man Alive After Death
Follow us
Surya Kala

|

Updated on: Oct 27, 2022 | 1:40 PM

ఓ యువకుడు గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో ఉన్నాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించారు. అతని ఆరోగ్యం క్షీణిస్తూనే ఉంది. డాక్టర్ అతని పల్స్  చూసి..  ఆ యువకుడు చనిపోయినట్లు ప్రకటించాడు. దీంతో ఆ యువకుడిని అంతిమ యాత్రకు తీసుకుని వెళ్తున్నారు. శ్మశాన వాటికకు వెళ్లే దారిలో ‘రామ్‌ నామ్‌ సత్య హై…’ అంటూ నినాదాలు చేశారు. అప్పుడు ఒక్కసారిగా భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురై సమీపంలోని గ్రామంలోని ఆలయానికి చేరుకున్నారు. గుడి మెట్లపై  ఆ యువకుడి పాడెను ఉంచారు. కొద్దిసేపటికి  పాడే మీద ఉన్న వ్యక్తి నిద్ర నుంచి లేచి నట్లు నిద్ర లేచాడు. ఈ విచిత్ర ఘటన మహారాష్ట్రలోని అకోలాలో చోటుచేసుకుంది .

ఈ ఘటన అకోలా జిల్లా పాటూర్ తాలూకా వివ్రా గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ఆ యువకుడి పేరు ప్రశాంత్ మేష్రే. ప్రశాంత్ మేష్రే హోంగార్డు. కొద్ది రోజులుగా అనారోగ్య కారణాలతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. బుధవారం ప్రశాంత్ ఆరోగ్యం మరింత విషమించడంతో మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

ప్రశాంత్ మేష్రే నాడి కొట్టుకోవడం ఆగిపోయింది. దీంతో వైద్యులు అతను చనిపోయినట్లు ప్రకటించారు. ప్రశాంత్ మేష్రే వయసు కేవలం 25 ఏళ్లు. చిన్న వయసులో మరణించడంతో అతని కుటుంబసభ్యులు కన్నీరుమునీరుగా విలపించారు. అంత్యక్రియలకు సన్నాహాలు ప్రారంభించారు. ప్రశాంత్ ను శ్మశానికి తీసుకుని వెళ్తుండగా.. శరీరంలో ఒక్కసారిగా కదలికలు ఏర్పడ్డాయి. ముందుగా గ్రామస్థులకు ఏమీ అర్థం కాలేదు. తర్వాత భయాందోళనకు గురైన వారు సమీపంలోని గ్రామంలోని ఆలయానికి చేరుకున్నారు.  ప్రశాంత్ నిద్ర లేచినట్లు పాడే మీద నుంచి లేచాడు.

ఇవి కూడా చదవండి

గ్రామస్తులు ఇంతకు ముందెన్నడూ ఇలాంటి అద్భుతాన్ని చూడలేదు. ప్రశాంత్ బతికి ఉన్నాడన్న వార్త కొద్దిసేపటికే ఊరంతా వ్యాపించింది. ఈ దృశ్యాన్ని చూసేందుకు ఊరంతా గుడి దగ్గర గుమిగూడారు. జనాన్ని అదుపు చేసేందుకు పోలీసులను పిలిపించాల్సి వచ్చేలా జనం గుమిగూడారు. ఇలా ప్రశాంత్ బతకడానికి కారణం.. అతని శరీరంలోకి దేవత వచ్చిందని ఊరంతా చర్చ మొదలైంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..