AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Government Hospital: ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం.. వార్మర్ అధిక వేడితో నవజాత శిశువుకు నూరేళ్లు నిండిపోయాయి..

చిన్నారి మంగళవారం రాత్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చికిత్స పొందుతూ.. బుధవారం తెల్లవారుజామున మృతి చెందింది. అధిక వేడి కారణంగా మరణించిందని.. దీనికి ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.

Government Hospital: ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం.. వార్మర్ అధిక వేడితో నవజాత శిశువుకు నూరేళ్లు నిండిపోయాయి..
Rajasthan Government Hospital
Surya Kala
|

Updated on: Oct 27, 2022 | 12:15 PM

Share

ప్రాణం పోసే దేవాలయం ఆసుపత్రి అని ఎంతో నమ్మకంతో వైద్యం చేయించుకోవడానికి ఎందరో వస్తారు. అటువంటి హాస్పటల్ లో కొందరి నిర్లక్ష్యంతో నిండు నూరేళ్లు జీవించాల్సిన పసికందు ప్రాణాలు పోగొట్టుకుంది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో అధిక వేడిని తట్టుకోలేని ఓ నవజాత శిశువు మరణించింది. ఈ విషాద ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్‌ఐసియు)లో వార్మర్ వేడెక్కడం వల్ల నవజాత శిశువు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మహాత్మాగాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలోని తల్లీబిడ్డల విభాగంలో జరిగిన ఈ దుర్ఘటనలో మరో పాప కూడా గాయపడింది.

ఈ ఘటనపై ఆసుపత్రి అధికారి స్పందిస్తూ.. ఎన్‌ఐసియులో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు కాంట్రాక్ట్ నర్సింగ్ సిబ్బందిని సస్పెండ్ చేశామని చెప్పారు. అంతేకాదు ఈ ఘటనపై విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు  తెలిపారు.

మృతి చెందిన పాప వయసు 21 రోజులు. బరువు తక్కువగా ఉన్న శిశువుని  అక్టోబర్ 5న NICUలో చేర్చారు. చిన్నారి మంగళవారం రాత్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చికిత్స పొందుతూ.. బుధవారం తెల్లవారుజామున మృతి చెందింది. అధిక వేడి కారణంగా మరణించిందని.. దీనికి ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాదు శిశువు మృతిపై కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. దీంతో ఆస్పత్రి అధికారులు స్పందించి కాంట్రాక్టు ఉద్యోగులపై చర్యలు తీసుకున్నారు. సమగ్ర దర్యాప్తు కోసం విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారి తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
కుజుడికి బలం..కీలక విషయాల్లో వారికి సక్సెస్ ఖాయం..!
కుజుడికి బలం..కీలక విషయాల్లో వారికి సక్సెస్ ఖాయం..!
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
కార్ల ప్రియులకు షాకివ్వనున్న మారుతి సుజుకీ.. పెరగనున్న ధరలు..
కార్ల ప్రియులకు షాకివ్వనున్న మారుతి సుజుకీ.. పెరగనున్న ధరలు..
మామగారి అంత్యక్రియలు అల్లుడు చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?
మామగారి అంత్యక్రియలు అల్లుడు చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?
ఏపీలో భూ రికార్డులకు చంద్రబాబు కొత్త భరోసా..!
ఏపీలో భూ రికార్డులకు చంద్రబాబు కొత్త భరోసా..!
ఓరీ దేవుడో.. ఈ బామ్మ క్షవర కళకు దండం పెట్టాల్సిందే! జనం బారులు
ఓరీ దేవుడో.. ఈ బామ్మ క్షవర కళకు దండం పెట్టాల్సిందే! జనం బారులు
జన నాయగన్ సినిమా విజయ్ దళపతికి గొప్ప ఫేర్‌వెల్‌..
జన నాయగన్ సినిమా విజయ్ దళపతికి గొప్ప ఫేర్‌వెల్‌..
క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేయడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా?
క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేయడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా?
పట్టపగలు ఇంట్లోకి చొరబడి దాడి.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా..?
పట్టపగలు ఇంట్లోకి చొరబడి దాడి.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా..?