UK PM Rishi: దీపావళి వేడుకల్లో పాల్గొన్న బ్రిటన్ ప్రధాని .. భావితరాల్లో దీపాల వెలుగులు నిండేలా ప్రయత్నిస్తానన్న రిషి
10 డౌనింగ్ స్ట్రీట్ లో జరిగిన దీపావళి వేడుకల్లో పాల్గొన్న సునక్.. మాజీ ప్రధాని తప్పులను సరిదిద్దడానికి తనను ఎన్నుకున్నట్లు చెప్పారు. అయితే లిజ్ ట్రేస్ ను ప్రశంసించారు.
బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్ రిజైన్ చేసిన అనంతరం.. రిషి సునక్ ప్రధాన మంత్రి పదవిని చేపట్టారు. ప్రధాని రిషి బుధవారం రాత్రి 10 డౌనింగ్ స్ట్రీట్‌లో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ.. బ్రిటన్ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. దీపావళి వేడుకల్లో పాల్గొన్న ఓ ఫోటోను కూడా షేర్ చేశారు. మంగళవారం సునక్ UK కొత్త ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో కింగ్ చార్లెస్ IIIని కలిసిన తర్వాత ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో బ్రిటన్‌లో తొలిసారిగా భారత సంతతికి చెందిన వ్యక్తి బాధ్యతలు చేపట్టారు.
10 డౌనింగ్ స్ట్రీట్ లో జరిగిన దీపావళి వేడుకల్లో పాల్గొన్న సునక్.. మాజీ ప్రధాని తప్పులను సరిదిద్దడానికి తనను ఎన్నుకున్నట్లు చెప్పారు. అయితే లిజ్ ట్రేస్ ను ప్రశంసించారు. తాను ఆమెకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నానని.. లీజ్ బ్రిటన్‌ను సంస్కరించాలని కోరుకున్నారని తెలిపారు. దేశంలో మార్పు తీసుకురావడానికి ఆమె చేసిన ప్రయత్నాన్ని మెచ్చుకుంటూనే.. అయితే కొన్ని తప్పులు చెడు ఉద్దేశాల వల్ల దేశంలో మార్పులు జరగలేదని సునక్ అన్నారు. తమ ప్రభుత్వం బ్రిటన్ ప్రజల విశ్వాసాన్ని చూరగొంటుందని.. తమ ప్రభుత్వంలో అన్ని స్థాయిల్లో నిజాయితీ, వృత్తి నైపుణ్యం, జవాబుదారీతనం ఉంటుందని ఆయన ప్రతిజ్ఞ చేశారు.
దీపావళి వేడుకల్లో బ్రిటన్ ప్రధాని
Brilliant to drop into tonight’s Diwali reception in No10.
I will do everything I can in this job to build a Britain where our children and our grandchildren can light their Diyas and look to the future with hope.
Happy #Diwali everyone! pic.twitter.com/g4yhAGhToz
— Rishi Sunak (@RishiSunak) October 26, 2022
దీపావళిని పురస్కరించుకుని సునక్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈరోజు 10 డౌనింగ్ స్ట్రీట్‌లో జరిగిన దీపావళి వేడుకల్లో పాల్గొనడం తనకు చాలా సంతోషంగా ఉందని ఫోటోని షేర్ చేస్తూ ఓ క్యాప్షన్‌లో రాశారు. మన పిల్లలు, మనవరాళ్లు దీపాలను వెలిగించి మంచి భవిష్యత్తు ఇచ్చే బ్రిటన్‌ను సృష్టించడానికి తాను చేయగలిగినదంతా చేస్తానని అన్నారు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. తన అధికారిక నివాసంలో సునక్ మాట్లాడుతూ భవిష్యత్తులో బ్రిటన్ దేశాన్ని నడిపించడానికి, రాజకీయాలకు అతీతంగా మీ అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నామని పేర్కొన్నారు. ఉత్తమ సంప్రదాయాలకు ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తాను మీ ముందు ఉన్నానని .. అందరం కలిసి కట్టుగా నిలబడి పనిచేస్తే అద్భుతమైన ఫలితాలను సాధించగలమని అన్నారు.
కఠిన నిర్ణయాలు తీసుకోవాలి – సునక్ బ్రిటన్ కొత్తగా నియమితులైన ప్రధానమంత్రి రిషి సునక్ బుధవారం మాట్లాడుతూ, తమ ప్రభుత్వం కొన్ని “చాలా కష్టమైన నిర్ణయాలు” తీసుకోవలసి ఉంటుందని, అయితే దేశంలోని ఆర్థిక సంక్షోభాన్ని” పరిష్కరించాల్సి ఉందని.. అయితే ప్రజలను ఇబ్బంది పెట్టని విధంగా నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. బ్రిటన్ ప్రధానిగా భారతీయ సంతతికి చెందిన సునాక్ మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..