Bangladesh: బంగ్లాదేశ్‌లో సిత్రాంగ్ తుఫాన్ బీభత్సం.. ఏడుగురు మృతి.. లక్షలాది మంది నిరాశ్రయులు!

నైరుతి బంగ్లాదేశ్‌లోని తీర ప్రాంతాలను తుపాను తాకే అవకాశం ఉండడంతో రెండున్నర లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలాగే, 6,925 తుపాను కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు

Bangladesh: బంగ్లాదేశ్‌లో సిత్రాంగ్ తుఫాన్ బీభత్సం.. ఏడుగురు మృతి.. లక్షలాది మంది నిరాశ్రయులు!
Bangladesh Cyclone
Follow us
Surya Kala

|

Updated on: Oct 25, 2022 | 10:51 AM

బంగాళాఖాతంలో ఏర్పడిన సిత్రాంగ్ తుఫాను బంగ్లాదేశ్ను అతలాకుతలం చేస్తోంది. తుఫాన్ బీభత్సానికి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. తీరాన్ని తాకిన తుపాను పలు చోట్ల విధ్వంసం సృష్టించింది. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లు దెబ్బతిన్నాయి. చెట్లు కూలిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు, మిగితా చోట్ల మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ తుఫానులో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా పేర్కొంది. బర్గునా, నరైల్, సిరాజ్‌గంజ్ జిల్లాలు, భోలా ద్వీప జిల్లాలు తుఫాను కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నాయని విపత్తు మంత్రిత్వ శాఖ కంట్రోల్ రూమ్ ప్రతినిధి తెలిపారు.

నైరుతి బంగ్లాదేశ్‌లోని తీర ప్రాంతాలను తుపాను తాకే అవకాశం ఉండడంతో రెండున్నర లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలాగే, 6,925 తుపాను కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. మరోవైపు ఉగ్రరూపం దాల్చుతున్న తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇదిలా ఉండగా.. సిత్రాంగ్ తుఫాన్ అత్యంత వేగంతో ఈశాన్య దిశగా కదులుతోంది. తీవ్ర అల్పపీడనం ఏర్పడటంతో రెండు రోజుల పాటు పశ్చిమ బెంగాల్, అసోం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలండ్, మిజోరాం రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సిత్రాంగ్ ముప్పు ఏపీపై లేనప్పటికీ చలి తీవ్రత మాత్రం పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
అమ్మో.. వెనక్కు వెళ్లిన సముద్రం.. ఆందోళనలో ప్రజలు.! వీడియో..
అమ్మో.. వెనక్కు వెళ్లిన సముద్రం.. ఆందోళనలో ప్రజలు.! వీడియో..
ఒకటో తరగతికీ 4.27 లక్షలు ఫీజు.. మధ్యతరగతి తండ్రి ఆవేదన
ఒకటో తరగతికీ 4.27 లక్షలు ఫీజు.. మధ్యతరగతి తండ్రి ఆవేదన
ఎలన్ మస్క్ కొత్త టెక్నాలజీతో.. అరగంటలో ఢిల్లీ టూ అమెరికా
ఎలన్ మస్క్ కొత్త టెక్నాలజీతో.. అరగంటలో ఢిల్లీ టూ అమెరికా
పుష్ప2 మళ్లీ వాయిదా అంటూ ప్రచారం.. ఇచ్చిపడేసిన బన్నీ టీం
పుష్ప2 మళ్లీ వాయిదా అంటూ ప్రచారం.. ఇచ్చిపడేసిన బన్నీ టీం
అలా మాట్లాడితే.. ఆ మనిషిని తప్పుబట్టినట్టు కాదు
అలా మాట్లాడితే.. ఆ మనిషిని తప్పుబట్టినట్టు కాదు
చిక్‌ బాబాయ్‌తో ఎలా ఉంటానో మీకెవరికీ తెలియదు !! బన్నీ ఎమోషనల్‌
చిక్‌ బాబాయ్‌తో ఎలా ఉంటానో మీకెవరికీ తెలియదు !! బన్నీ ఎమోషనల్‌