America: అమెరికాలో తెలుగు సాఫ్ట్ వేర్ మృతి.. ట్రెక్కింగ్ కి వెళ్లి ప్రమాదవశాత్తు లోయలో పడి..

ఆదివారం సెలవు కావడంతో ఆహ్లాదంగా గడిపేందుకు భార్యాభర్తలు అట్లాంటాలో ట్రెక్కింగ్ కు వెళ్లారు. క్లీవ్‌లెన్స్‌ మౌంటెన్‌ హిల్స్‌లో ఎత్తయిన ప్రదేశంలో ట్రెక్కింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు  అతను ప్రమాదవశాత్తు జారిపడి సుమారు 200 వందల అడుగుల కింద పడిపోయాడు

America: అమెరికాలో తెలుగు సాఫ్ట్ వేర్ మృతి.. ట్రెక్కింగ్ కి వెళ్లి ప్రమాదవశాత్తు లోయలో పడి..
Guntur Techie Dead
Follow us

|

Updated on: Oct 18, 2022 | 7:44 AM

అమెరికాలో ట్రెక్కింగ్ కు వెళ్లి ప్రమాదవ శాత్తు తెలుగు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతి చెందాడు. గుంటూరుకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ నిపుణుడు తన స్నేహితులతో ట్రెక్కింగ్‌కు వెళ్లి లోయలో పడి మరణించాడు. ఈ దారుణ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. మృతుడు గుంటూరుకు చెందిన గంగూరి శ్రీనాథ్(32) గా గుర్తించారు. గుంటూరు వికాస్‌ నగర్‌కు చెందిన సీనియర్ టీడీపీ నేత సుఖవాసి శ్రీనివాస్ రావు అల్లుడు. సుఖవాసి శ్రీనివాసరావు, రాజశ్రీ దంపతుల కుమార్తె సాయి చరణి, రాజేంద్రనగర్‌కు చెందిన శ్రీనాథ్‌కు అయిదేళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరూ అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. ఈ దంపతులకు మూడేళ్ల కూతురు ఉంది.

గత ఆరేళ్లుగా ఫ్లోరిడాలో పనిచేస్తున్న శ్రీనాథ్ సెలవుపై తన స్నేహితులతో కలిసి అట్లాంటా వెళ్లినట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి. ఆదివారం సెలవు కావడంతో ఆహ్లాదంగా గడిపేందుకు భార్యాభర్తలు అట్లాంటాలో ట్రెక్కింగ్ కు వెళ్లారు. క్లీవ్‌లెన్స్‌ మౌంటెన్‌ హిల్స్‌లో ఎత్తయిన ప్రదేశంలో ట్రెక్కింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు  అతను ప్రమాదవశాత్తు జారిపడి సుమారు 200 వందల అడుగుల కింద పడిపోయాడు. తలకు గాయాలు కావడంతో శ్రీనాథ్ అక్కడికక్కడే మృతి చెందాడు.

అంత్యక్రియల నిమిత్తం భౌతికకాయాన్ని గుంటూరుకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీనాథ్ అమెరికా వెళ్లి యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్‌లో మాస్టర్స్ చేశారు. అతను మిన్నెసోటాలోని ఒక ఫైనాన్షియల్ కంపెనీతో సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా తన వృత్తిని ప్రారంభించాడు.  కుమారుడు మృతి చెందిన వార్త విన్న శ్రీనాథ్ తల్లిదండ్రులు బాబూరావు, మల్లేశ్వరిలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని గ్లోబల్ భారత్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..