AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan: వెంటాడిన మృత్యువు.. పరాయి దేశంలోనూ రక్షణ కరువు.. పాక్ జర్నలిస్ట్ దారుణహత్య!

సొంతం దేశంలో ప్రాణాపాయం ఉందని.. వేరే దేశానికి వెళ్లి తలదాచుకుంటున్న ఓ జర్నలిస్టు పోలీసుల కాల్పుల్లో మృతి చెందాడు. జరిగిన తప్పుకు చింతిస్తున్నామని ఆ దేశానికి చెందిన పోలీసులు  తెలిజేశారు.. 

Pakistan: వెంటాడిన మృత్యువు.. పరాయి దేశంలోనూ రక్షణ కరువు.. పాక్ జర్నలిస్ట్ దారుణహత్య!
Pakistani Journalist Arshad
Surya Kala
|

Updated on: Oct 25, 2022 | 10:05 AM

Share

తమ దేశం కెన్యాలో తలదాచుకుంటున్న పాకిస్థానీ జర్నలిస్టు హత్యకు చింతిస్తున్నట్లు కెన్యా జాతీయ పోలీసు సర్వీస్ తెలిపింది.  నైరోబీలో చోటు చేసుకున్న ఈ సంఘటనను తప్పుగా గుర్తించినట్లు పేర్కొంది.  పాకిస్థాన్ కు చెందిన ప్రముఖ సీనియర్‌ జర్నలిస్టు అర్షద్‌ షరీఫ్‌(50) కెన్యా పోలీసుల కాల్పుల్లో మరణించాడు. కెన్యా రాజధాని వెలుపల పోలీసులు రోడ్డు బ్లాక్ చేసిన సమయంలో అర్షద్ ప్రయాణిస్తున్న కారు ఆపకుండా వెళ్ళిపోయింది. ఆ కారు పిల్లల కిడ్నాప్ కేసుతో సంబంధం నున్న కారుని పోలి ఉండడంతో.. బ్లాక్ చేసి ఉన్న రోడ్డు మీద కారు ఆగకుండా వెళ్లడంతో ఆపకుండా వేగంగా వెళ్లడంతో అర్షద్ షరీఫ్ , అతని సోదరుడి పై కాల్పులు జరిపినట్లు నైరోబి పోలీసులు  చెప్పారు. అయినప్పటికీ కారు ఆపకుండా ప్రయాణించడంతో అర్షద్ కారుని వెంబరించినట్లు పోలీసులు చెప్పారు. దీంతో కారు బోల్తా కొట్టగా, ఒక బుల్లెట్‌ షరీఫ్‌ తలలోకి దూసుకెళ్లింది. అతడి సోదరుడుగాయపడినట్లు పేర్కొన్నారు. అర్షద్ మృతి కి తాము చింతిస్తున్నామని, కారును గుర్తించడంలో జరిగిన పొరపాటు వలనే ఈ దారుణం జరిగిందని చెప్పారు.

షరీఫ్ హత్య తో పాకిస్థాన్ లో అనేక విమర్శలు వినిపిస్తున్నారు. పలు అనుమానాలు వెల్లడిస్తున్నాయి. పాకిస్థాన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన జర్నలిస్టు అర్షద్‌ షరీఫ్‌ ని హత్య చేస్తామని గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు వచ్చాయి. దీంతో అర్షద్‌ షరీఫ్‌ ఆగస్టులో దేశం విడిచి పారిపోయాడు. అతని ఆచూకీ బహిరంగంగా తెలియలేదు. అతను దుబాయ్, లండన్‌లో గడిపాడని కొద్దీ మంది స్నేహితులకు మాత్రమే తెలుసు. గత కొన్ని నెలలుగా కెన్యాలో తన సోదరుడు ఖుర్రంతో కలిసి నివసిస్తున్నాడు.

ఈ క్రమంలో అర్షద్ తన సోదరుడు ఖుర్రం తో కలిసి నైబీరియాలో కారులో వెళ్తుండగా.. నైరోబి శివారులో రోడ్డుని పోలీసులు బ్లాక్ చేశారు.  ఈ క్రమంలో కారును ఆపకుండా వేగంగా కారు ముందుకు వెళ్లడంతో.. తాము కాల్పులు జరిపినట్లు నైరోబి పోలీసులు తెలిపారు. పిల్లల కిడ్నప్ కు చెందిన కారుగా తాము భావించినట్లు పేర్కొన్నారు.

ఈ ఘటనపై కెన్యా అధ్యక్షుడు విలియం రూటోతో పాకిస్థాన్‌ ప్రధాని షెహ్‌బాజ్‌ షరీఫ్‌ మాట్లాడారు. షరీఫ్‌ మృతికి పాక్‌ ప్రధాని సహా పలువురు సంతాపం వ్యక్తం చేశారు. మరోవైపు పాకిస్థాన్‌కు చెందిన పలువురు జర్నలిస్టులు షరీఫ్‌పై కాల్పులకు వ్యతిరేకంగా ఇస్లామాబాద్‌లో ర్యాలీ చేపట్టారు. షరీఫ్‌కు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. షరీఫ్ మరణం వెనుక ఉన్న “మిస్టరీని ఛేదించాలని” కెన్యా ప్రభుత్వాన్ని కోరారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..