Rishi Sunak: కుంభమేళాలో తప్పిపోయిన అన్మదమ్ముల్లా ఉన్నారే? రిషి, నెహ్రాలను పోల్చుతూ నెట్టింట పేలుతున్న మీమ్స్

రిషి, నెహ్రా ఇద్దరి హావభావాలు, శరీరం దాదాపు ఒకేలా ఉంటుంది. ఇద్దరూ సన్నగానే ఉంటారు. ఇద్దరి వయస్సు కూడా సమానమే. ఆశిష్ నెహ్రా వయస్సు 43 సంవత్సరాలు కాగా రిషి సునాక్‌ ఏజ్ 42.

Rishi Sunak: కుంభమేళాలో తప్పిపోయిన అన్మదమ్ముల్లా ఉన్నారే? రిషి, నెహ్రాలను పోల్చుతూ నెట్టింట పేలుతున్న మీమ్స్
Rishi Sunak, Ashish Nehra
Follow us
Basha Shek

|

Updated on: Oct 25, 2022 | 9:10 AM

ఈ ప్రపంచంలో మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉంటారంటారు. కలిసి పుట్టుకున్నా ఒకరి రూపంతో మరొకరు ఈ భూమ్మీద ఎక్కడో ఓ చోట ఉంటారనేది దీనర్థం. ముఖ్యంగా సినిమా రంగంలో ఇలాంటి డోపెల్‌ గ్యాంగర్స్‌ను బాగా చూడవచ్చు. పలువురు సినిమా తారలు, సెలబ్రిటీలను పోలిన వారు మనకు బాగా కనిపిస్తుంటారు. ఇదిలా ఉంటే బ్రిటన్‌ ప్రధానిగా భారత సంతతి వ్యక్తి రిషి సునాక్‌ ఏకగ్రీవంగా ఎన్నికై ఈ ఘనత సాధించిన మొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. ఆర్థిక మాంద్యం తదితర పరిస్థితులతో లిజ్‌ ట్రస్‌ ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో రిషి ప్రధాని పీఠం అధిరోహించనున్నారు. ఈనేపథ్యంలో ప్రధాని మోడీతో సహా పలువురు ప్రముఖులు నెటిజన్లు సోషల్‌ మీడియా వేదికగా రిషికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈనేపథ్యంలో రిషి పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది. అయితే ఆయనతో పాటు టీమిండియా మాజీ క్రికెటర్‌, లెఫ్టార్మ్‌ సీమర్‌ ఆశిష్‌ నెహ్రా పేరు కూడా ట్రెండ్‌ అవుతోంది. దీనికి కారణం.. వీరిద్దరూ అచ్చుగుద్దినట్లు ఒకేలా ఉండడం. రిషి, నెహ్రా ఇద్దరి హావభావాలు, శరీరం దాదాపు ఒకేలా ఉంటుంది. ఇద్దరూ సన్నగానే ఉంటారు. ఇద్దరి వయస్సు కూడా సమానమే. ఆశిష్ నెహ్రా వయస్సు 43 సంవత్సరాలు కాగా రిషి సునాక్‌ ఏజ్ 42. ఈనేపథ్యంలో మీరిద్దరూ సోదరులా ఏంటి అంటూ నెహ్రా, రిషిల ఫొటోలతో నెట్టింట మీమ్స్‌ వెల్లువలా వస్తున్నాయి.

గతంలోనూ..

నెహ్రాతో పాటు కోహినూర్ డైమండ్ పేరు సైతం ఈ సందర్భంగా బాగా ట్రెండ్ అవుతోంది. రిషి సునాక్‌ను కిడ్నాప్ చేసి, ఆయన స్థానంలో నెహ్రాను బ్రిటన్ ప్రధానమంత్రిగా నియమించాలని, కోహినూర్ డైమండ్‌ను మళ్లీ భారత్‌కు అప్పగించేలా బిల్ పాస్ చేయించాలంటూ నెటిజన్లు సరదా కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. మరోక నెటిజన్ అయితే.. రిషి సునక్, ఆశిష్ నెహ్రా ఇద్దరూ కుంభమేళా పుష్కరాల్లో తప్పిపోయి విడిపోయిన అన్నదమ్ముల్లా ఉంటారని కామెంట్ చేశాడు. కాగా నెహ్రా ఇలా ట్రెండ్‌ అవడం ఇదేమి మొదటిసారి కాదు. ఆగస్టులో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ జావెలియన్ త్రో విభాగంలో స్వర్ణం సాధించాడు. ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన భారత బల్లెం వీరుడు నీరజ్ చోప్రాకు కూడా సాధ్యం కాని రీతిలో అతడు 90 మీటర్ల దూరం జావెలిన్ విసిరాడు. ఇదే విషయంపై ట్వీట్‌ చేసిన ఓ పాక్‌ పొలిటికల్‌ అనలిస్ట్‌ నీరజ్ చోప్రా బదులు ఆశిష్ నెహ్రా అని తన ట్వీట్లో పేర్కొన్నాడు. దీంతో ‘చిచా.. ఆశిష్ నెహ్రా ప్రస్తుతం యూకే ప్రధాని ఎన్నికల కోసం సన్నద్ధం అవుతున్నాడు’ అంటూ సెహ్వాగ్‌ ట్రోల్ చేశారు. మరి నెహ్రా, రిషిలను పోల్చుతూ నెట్టింట పేలుతున్న మీమ్స్‌పై ఓ లుక్కేద్దాం రండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..