Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women Brain: పురుషుల కంటే మహిళల మెదడు చురుకు.. 50 ఏళ్ల క్రితం మాటలను కూడా గుర్తించుకునే నైజం వీరి సొంతం..

పరిశోధన కోసం ఈ బృందం పురుషులు, మహిళల మానసిక నైపుణ్యం తెలుసుకోవడం కోసం గత కొన్ని సంవత్సరాల నుండి డేటాను సేకరించింది. ఆ డేటాను విశ్లేషించింది. ఈ మెటా విశ్లేషణలో దాదాపు 3.50 లక్షల మంది డేటాను తీసుకున్నారు

Women Brain: పురుషుల కంటే మహిళల మెదడు చురుకు.. 50 ఏళ్ల క్రితం మాటలను కూడా గుర్తించుకునే నైజం వీరి సొంతం..
Women Brain
Follow us
Surya Kala

|

Updated on: Oct 18, 2022 | 10:03 AM

స్త్రీ, పురుషుల మధ్య తెలివి తేటలు, జ్ఞాపక శక్తి మీద ఎప్పుడు వాదోపవాదనలు జరుగుతూనే ఉంటాయి. అంతేకాదు.. పురుషుడు శారీరకంగా బలవంతుడు అయితే.. స్త్రీ మానసికంగా శక్తివంతురాలు అని అంటారు కూడా.. ఏదైనా విషయం ఆలోచించడంలో కూడా పురుషుల కంటే ఆడవారి ఒక అడుగు ముందుంటారన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆడవారి జ్ఞాపకశక్తి మీద చేసిన ఒక పరిశోధనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పురుషుల్లో కంటే మహిళల మెదడు వేగంగా, చురుకుగా ఉంటుందని నార్వేకు చెందిన పరిశోధకులు తేల్చారు. అంతేకాదు మహిళలు 50 ఏళ్ల క్రితం నాటి పదాలను గుర్తుంచుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారని శాస్త్రజ్ఞులు చెప్పారు. నార్వేలోని బెర్గెన్ యూనివర్సిటీలో నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. పరిశోధన కోసం ఈ బృందం పురుషులు, మహిళల మానసిక నైపుణ్యం తెలుసుకోవడం కోసం గత కొన్ని సంవత్సరాల నుండి డేటాను సేకరించింది. ఆ డేటాను విశ్లేషించింది. ఈ మెటా విశ్లేషణలో దాదాపు 3.50 లక్షల మంది డేటాను తీసుకున్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన డేటా  రీసెర్చ్‌లో మహిళలకు అనర్గళంగా మాట్లాడే నైపుణ్యాలు ఎక్కువగా ఉన్నాయని తేలింది.

మేధో నైపుణ్యాల్లో స్త్రీ పురుషుల మధ్య తేడా: స్త్రీలు కూడా పురుషుల కంటే మెరుగైన జ్ఞాపకశక్తిని కలిగి ఉంటారు. ఒక నిర్దిష్ట అక్షరం లేదా వర్గంతో ప్రారంభమయ్యే పేర్లు, పదాలను కనుగొనడంలో లేదా గుర్తుంచుకోవడంలో మహిళలు మెరుగైన స్థానంలో ఉన్నారు. మేధో నైపుణ్యాల విషయంలో స్త్రీ, పురుషుల మధ్య ఎలాంటి తేడా లేదని పరిశోధకుడు మార్కో హిర్‌స్టెయిన్ అభిప్రాయపడ్డారు. మహిళల్లో మెదడులోని కార్టెక్స్ , లింబిక్ వ్యవస్థలో ఎక్కువ రక్త ప్రవాహం ఉంటుంది.. దీనివలన పురుషుల మెదడు కంటే స్త్రీల మెదడు చురుకుగా ఉంటుందని పరిశోధకులు తేల్చారు.  అంతేకాదు వాసనలు గుర్తుపెట్టుకోవడం వంటి ఇంద్రియ శక్తి కూడా మహిళల్లో అధికమని అధ్యయనం పేర్కొంది.

స్త్రీల ముఖాలను గుర్తుంచుకునే నేర్పు: స్వీడన్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌కి చెందిన మరో పరిశోధన ప్రకారం, మహిళలు ముఖాలను గుర్తుంచుకోవడంలో మెరుగ్గా ఉంటారు. అయినప్పటికీ.. ఇది నిద్ర లేకపోవడం, నిరాశ లేదా వృద్ధాప్యం ఇతర కారణాలు కూడా జ్ఞాపక శక్తిపై ప్రభావం చుపిస్తాయని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..