AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nigeria Floods: నైజీరియాలో జల విలయం.. 600 మంది మృతి.. 13 లక్షల మంది నిరాశ్రయులు..

భారీ స్థాయిలో వరదలు వస్తాయని.. ముందే వాతావరణశాఖ హెచ్చరించినా.. ప్రభుత్వం కనీస ముందు జాగ్రత్త చర్యలు చేపట్టలేదు. ఫలితంగా వందల మంది ప్రాణాలు కోల్పోయారనే ఆరోపణలు కూడా ఉన్నాయి

Nigeria Floods: నైజీరియాలో జల విలయం.. 600 మంది మృతి.. 13 లక్షల మంది నిరాశ్రయులు..
Nigeria Floods
Surya Kala
|

Updated on: Oct 18, 2022 | 7:21 AM

Share

జలవిలయం.. వరద సునామీ.. జల విధ్వంసం.. ఇలాంటి పదాలన్నింటికీ అద్దంపట్టేంత ఘోర పరిస్థితులు ప్రస్తుతం నైజీరియాలో కనిపిన్నాయి. దేశంలో ఎక్కడ చూసినా నీళ్లే.. వందల మందిని వరద మింగేసింది. ఇక ఆశ్రయం కోల్పోయిన వాళ్లు ఎన్నో లక్షల మంది. అక్కడ ఈ స్థాయిలో వరదలు రావడానికి కారణం ఏంటి? ఎటు చూసినా నీరే. ఊరు వాగైంది. ఏరు ఎగబడి.. పల్లె మీదకు దండెత్తింది. మారుమూల పల్లె నుంచి మహా నగరం వరకు అన్ని ప్రాంతాలనూ ముంచెత్తింది. ఇక్కడ చూడండి.. కేవలం ఇళ్ల పైకప్పులు మాత్రమే కనిపిస్తున్నాయి. నైజీరియాలో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి.

దశాబ్ద కాలంలో ఎన్నడూ లేని విధంగా వచ్చిన వరదల కారణంగా ఇప్పటికే 600 మందికి పైగా మరణించారు. 13 లక్షల మందికి పైగా ప్రజలు తమ ఇళ్లను వదిలి పునరావాస కేంద్రాల్లో తలదాచుకోవాల్సి వచ్చింది. వీళ్లందరికీ తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు. వాళ్లను కనీసం పట్టించుకునే నాధుడే లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు ముంపు బాధితులు. ఈ వరదల వలన 82 వేలకు పైగా ఇళ్లు, 2లక్షల 72వేల ఎకరాల్లో పంట తుడిచిపెట్టుకుపోయింది. డెల్టా, రివర్స్, క్రాస్ రివర్, బేల్సా సహా అనంబ్రా వంటి రాష్ట్రాలతో పాటు దక్షిణ ప్రాంతంలోని కొన్ని ప్రావిన్సుల్లో నవంబర్ చివరి వరకు వరదలు కొనసాగవచ్చని నైజీరియా వాతావరణ సంస్థ హెచ్చరించింది.

భారీ స్థాయిలో వరదలు వస్తాయని.. ముందే వాతావరణశాఖ హెచ్చరించినా.. ప్రభుత్వం కనీస ముందు జాగ్రత్త చర్యలు చేపట్టలేదు. ఫలితంగా వందల మంది ప్రాణాలు కోల్పోయారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కనీసం వరదలు విలయం సృష్టించిన తర్వాత కూడా సరిగా స్పందించలేదనీ.. తమను ఆదుకోవడానికి, వరదల నుంచి రక్షించడానికి ఏ ఒక్కరూ రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముంపు బాధితులు.

ఇవి కూడా చదవండి

నైజీరియా.. అట్లాంటిక్ మహాసముద్రాన్ని ఆనుకుని ఉండే ఓ అందమైన దేశం. ఆఫ్రికా ఖండంలో ఉన్న ఈ దేశం 3లక్షల 56 వేల మైళ్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఇక్కడి 15 కోట్ల మంది జనాభా. ప్రస్తుతం వరదలతో విలవిలలాడుతోంది. చరిత్రలో కనీవినీ ఎరుగని వరదలతో అల్లాడిపోతోంది. 36 రాష్ట్రాల్లో ఏకంగా 27 రాష్ట్రాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. నవంబర్ చివరి వరకూ అక్కడ ఇదే పరిస్థితులు ఉంటాయనే హెచ్చరికలు అక్కడి ప్రజల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నాయి.

మరిన్ని అంతర్జాతీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..