AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

America: పాక్‌ అణ్వాయుధాల అంశంపై మాకు నమ్మకం ఉంది.. పాకిస్థాన్ విషయంలో అమెరికా యూ టర్న్

ప్రపంచంలో ప్రమాదకరమైన దేశాల్లో పాకిస్థాన్‌ ఒకటని, బాధ్యతలేని ఈ దేశం వద్ద అణు ఆయుధాలు ఉన్నాయని రెండు రోజుల కిందట కీలక వ్యాఖ్యలు చేసిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌..

America: పాక్‌ అణ్వాయుధాల అంశంపై మాకు నమ్మకం ఉంది.. పాకిస్థాన్ విషయంలో అమెరికా యూ టర్న్
Joe Biden
Subhash Goud
|

Updated on: Oct 18, 2022 | 11:31 AM

Share

ప్రపంచంలో ప్రమాదకరమైన దేశాల్లో పాకిస్థాన్‌ ఒకటని, బాధ్యతలేని ఈ దేశం వద్ద అణు ఆయుధాలు ఉన్నాయని రెండు రోజుల కిందట కీలక వ్యాఖ్యలు చేసిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వ్యాఖ్యలను ఇప్పుడు సర్ది చెప్పుకొనే ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి వేదాంత్‌ పటేల్‌ జో బైడెన్‌ వ్యాఖ్యలపై స్పందించారు. ఆణు ఆయుధాల విషయంలో పాకిస్థాన్‌ నిబద్దత, సామర్థ్యంపై మాకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు. సురక్షిత పాకిస్థాన్‌.. అమెరికా ప్రయోజనాలకు చాలా కీలకమని ఆయన చెప్పుకొచ్చారు. ఎంతో కాలంగా అమెరికా పాక్‌తో ఉన్న సహకారాన్ని గౌరవిస్తున్నామని పేర్కొన్నారు. సురక్షితమైన, సంపన్నమైన పాక్‌ను అమెరికా ఎప్పుడు కూడా అమెరికా ప్రయోజనాలకు కీలకమైనదిగా పేర్కొన్నారు.

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్‌కు పాకిస్తాన్ మద్దతు ఇవ్వడం, అలాగే పాక్‌ గడ్డపై పెద్ద సంఖ్యలో జిహాదీ మిలిటెంట్లు ఉండటం వల్ల యుఎస్- పాకిస్తాన్ మధ్య గతంలో స్నేహపూర్వక సంబంధాలు దెబ్బతిన్నాయని అన్నారు. 2011లో అల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ పాక్‌లో ఉన్నట్లు గుర్తించి హతమార్చిన తర్వాత 2011 నుండి అమెరికన్లు పాకిస్థాన్ పట్ల చాలా కలత చెందారన్నారు. కొన్ని సంవత్సరాల విరామం తర్వాత, పాకిస్థాన్‌, అమెరికాల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొందని అన్నారు.

ఇవి కూడా చదవండి

కాగా, అమెరికా పార్లమెంట్‌కు మధ్యంతర ఎన్నిక కోసం నిధుల సేకరణకు గురువారం రాత్రి డెమోక్రటిక్ పార్టీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న అధ్యక్షుడు జో బైడెన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బైడెన్‌ పాకిస్తాన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. బైడెన్‌ వ్యా్‌ఖ్యలపై పాకిస్థాన్‌ నుంచి ఘాటుగా స్పందనలు వచ్చాయి. పాక్‌ ఆణ్వాయుధ దేశంగా మారిన తర్వాత ప్రపంచంపై తన దూకుడు వైఖరీని ఎప్పుడు ప్రదర్శించిందో చెప్పాలంటూ పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ప్రశ్నించారు. బైడెన్‌, అమెరికాను లక్ష్యంగా చేసుకుని ఘాటుగా స్పందించారు. తమకు అత్యంత సురక్షితమైన న్యూక్లియర్‌ కమాండ్‌ ఉందని, అమెరికా లాగ తాము ఆయుధాల్లో మునిగిపోలేదని ట్వీట్‌ చేశారు. పాక్‌ అంత్యంత బాధ్యతగల దేశమని తెలిపారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి