Indonesia Ship Accident: ఇండోనేసియా సముద్రంలో ఘోర అగ్ని ప్రమాదం.. ఓడలో ప్రయాణిస్తున్న 14 మంది సజీవదహనం..
ఇండోనేసియా సముద్రంలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులు ప్రయాణిస్తున్న ఓడలో మంటలు చెలరేగి 14 మంది సజీవదహనమయ్యారు.
ఇండోనేసియా సముద్రంలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులు ప్రయాణిస్తున్న ఓడలో మంటలు చెలరేగి 14 మంది సజీవదహనమయ్యారు. చుట్టూ నీళ్లు ఉన్నా ప్రాణాలు కాపాడలేకపోయారు. ఈ ప్రమాదంలో చాలామందికి గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. ఓడలో మంటలు చెలరేగిన అనంతరం హుటాహుటిన అధికారులు రెస్కూ చేపట్టారు. సముద్రంలో చిక్కుకున్న మరో 226 మందిని సహాయక సిబ్బంది కాపాడారు. ఈస్ట్ నుసా టెంగర్రా ప్రావిన్స్‌లో కుంపాంగ్ నుంచి కలాబాహి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ఇండినేషియా అధికారులు తెలిపారు.
ఈ ఘటన సమయంలో ఓడలో 230మంది ప్యాసెంజర్లు, 10మంది సిబ్బంది కలిపి మొత్తం 240 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఓడలో అకస్మాతుగా మంటలు ఎందుకు చెలరేగాయనే విషయంపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. కుపాంగ్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ, సమీపంలోని నౌకదళ సిబ్బందితో చొరవతో 226 మంది ప్రాణాలతో బయటపడినట్లు నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది.
కాగా.. ఇండోనేసియాలో పడవ ప్రమాదాలు సర్వ సాధారణమయ్యాయి. ఎలాంటి భద్రత ప్రమాణాలు పాటించకుండా సామర్థ్యానికి మించి ప్రయాణికులను తరలించడం కారణంగా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి.
2018లో కూడా 200 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఓడ మునిగిన ఘటనలో 167 మంది జలసమాధి అయ్యారు. 1999లో జరిగిన మరో ఘటనలో సముద్రం మధ్యలో ఓడ మునిగి 332 మంది చనిపోయారు. 20 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.
మరిన్ని ప్రపంచ వార్తల కోసం..