Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Metabolism: డైట్‌లో ఈ ఆహారాలు తప్పనిసరి.. జీర్ణక్రియ మెరుగుపడటంతోపాటు ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు..

చాలా సార్లు శరీరంలో అలసట, బద్ధకంగా అనిపిస్తుంది. దీని వల్ల ఏ పని కూడా తొందరగా జరగదు.. చేద్దామనుకున్నా శరీరం సహకరించదు. బలహీనత, అలసట ఏకాగ్రతను దెబ్బతీస్తుంది.

Metabolism: డైట్‌లో ఈ ఆహారాలు తప్పనిసరి.. జీర్ణక్రియ మెరుగుపడటంతోపాటు ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
Metabolism - Health Tips
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 24, 2022 | 1:24 PM

చాలా సార్లు శరీరంలో అలసట, బద్ధకంగా అనిపిస్తుంది. దీని వల్ల ఏ పని కూడా తొందరగా జరగదు.. చేద్దామనుకున్నా శరీరం సహకరించదు. బలహీనత, అలసట ఏకాగ్రతను దెబ్బతీస్తుంది. అయితే.. శరీరానికి శక్తి అందకపోవడంతోనే ఇలా జరుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు జీవక్రియ బలహీనంగా ఉండడం వల్ల చాలా సార్లు ఆహారం సరిగా జీర్ణం కాక శరీరానికి శక్తి అందదు. శరీరం జీవక్రియ బాగా ఉంటే, మీరు రోజంతా చురుకుగా ఉంటారు. అటువంటి పరిస్థితిలో ప్రతిరోజూ ఎలాంటి ఆహారం తీసుకుంటే.. ఎనర్జిటిక్‌గా ఉంటాం.. శరీరంలోని జీవక్రియ పెరుగుతుంది అనే విషయాల గురించి తప్పనిసరిగా తెలుసుకోవడం మంచిది. కావున జీవక్రియ పెరిగేందుకు ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..

జీవక్రియను పెంచడానికి ఈ ఆహారాలను తినండి

అల్లం: అల్లం శరీరానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ గుణాలు బాడీ పెయిన్‌ని తొలగించడంతో పాటు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అంతే కాకుండా దీన్ని రోజూ తీసుకోవడం వల్ల మీకు పొట్ట సంబంధిత సమస్యలు కూడా దరిచేరవు. మీ మెటబాలిజం కూడా బూస్ట్ అవుతుంది.

ఆకుకూరలు – కూరగాయలు: ఆకుపచ్చని కూరగాయలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిని తినడం వల్ల మెటబాలిజం స్ట్రాంగ్ గా మారి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. దీనితో శరీరం ఎన్నో ప్రయోజనాలను పొందుతుంది. ఆహారంలో పచ్చి కూరగాయలను తప్పనిసరిగా చేర్చుకోవాలి. ఎందుకంటే ఐరన్, క్యాల్షియం, పొటాషియం, బి విటమిన్లు ఆకుపచ్చని కూరగాయలలో ఉంటాయి. వాటిని తీసుకోవడం ద్వారా అనేక వ్యాధుల నుంచి బయటపడొచ్చు.

కాఫీ: కాఫీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని తాగడం వల్ల శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. కాఫీ తాగడం వల్ల శరీరంలోని నీరసం, అలసట తొలగిపోతాయి. అంతే కాదు, కాఫీ తాగడం వల్ల శరీరంలోని జీవక్రియలు బలపడతాయి.

కొబ్బరి నూనె: కొబ్బరి నూనె శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. కొబ్బరి నూనెను రోజూ తీసుకోవడం వల్ల శరీరంలోని కొవ్వు కూడా తగ్గుతుంది. కొబ్బరి నూనెలో కొవ్వును కరిగించే గుణాలు ఉన్నాయి. కావున శరీరాన్ని స్లిమ్‌గా ఉంచడం కోసం కొబ్బరి నూనెతో చేసిన ఆహారం తీసుకోవడం మంచిది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..