Heart Disease: ఈ ఐదు లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. అవి గుండెపోటుకు సంకేతం కావొచ్చు..!

భారతదేశంతో సహా ప్రపంచంలో హృద్రోగుల సంఖ్య భారీగా పెరుగుతోంది. నేటి కాలంలో చాలామంది గుండె సమసమస్యతో బాధపడుతున్నారు. దీనికి ముఖ్య కారణం మన పేలవమైన జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు..

Heart Disease: ఈ ఐదు లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. అవి గుండెపోటుకు సంకేతం కావొచ్చు..!
Heart disease symptoms
Follow us

|

Updated on: Oct 24, 2022 | 10:57 AM

భారతదేశంతో సహా ప్రపంచంలో హృద్రోగుల సంఖ్య భారీగా పెరుగుతోంది. నేటి కాలంలో చాలామంది గుండె సమసమస్యతో బాధపడుతున్నారు. దీనికి ముఖ్య కారణం మన పేలవమైన జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు.. అయితే చాలాసార్లు ప్రజలు ఫిట్‌గా కనిపించినప్పటికీ ఇలాంటి సమస్యల బారిన పడుతున్నారు. ఇటీవలి కాలంలో నటుడు సిద్ధార్థ్ శుక్లా, కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్, గాయకుడు కెకె, రాజు శ్రీవాస్తవ సహా చాలా మంది ప్రముఖులు గుండెపోటుతో మరణించారు. గుండె జబ్బుల లక్షణాలను సకాలంలో గుర్తించడం చాలా ముఖ్యం. లేకపోతే మీరు కూడా ప్రాణాపాయానికి గురవుతారు. మీ గుండె బలహీనపడటం ప్రారంభించిందో లేదో..? ఎలా తెలుసుకోవాలి..? గుండెపోటు సహా గుండె సమస్యలు ప్రారంభమయ్యే ముందు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకోండి..

గుండె వైఫల్యం లక్షణాలు

  1. ఛాతి నొప్పి: మీకు తరచుగా ఛాతీ నొప్పి లేదా బరువుగా అనిపిస్తే.. శరీరంలోని గుండె సరిగ్గా లేదని అర్థం చేసుకోండి. అటువంటి పరిస్థితిలో వెంటనే వైద్యుడిని సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోండి. మీకు గుండె జబ్బులు ఉండే అవకాశం ఉంది. సకాలంలో చికిత్స పొందడం ముఖ్యం.
  2. వాంతులు: చాలా సార్లు ఛాతీ నొప్పి తర్వాత వాంతులు మొదలవుతాయి. ఇది గుండె జబ్బుల వైపు సూచించే ప్రమాదకరమైన లక్షణం. అటువంటి పరిస్థితిలో కొంచెం నిర్లక్ష్యం ఉన్నా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
  3. ఇవి కూడా చదవండి
  4. కడుపునొప్పి: కడుపునొప్పి అనేక కారణాల వల్ల వచ్చినప్పటికీ.. గుండె జబ్బుల హెచ్చరిక కూడా కావచ్చు. దీన్ని తేలికగా తీసుకోకండి. సరైన కారణాలను కనుగొనేందుకు వైద్యులను సంప్రదించడం మంచిది.
  5. దవడల్లో నొప్పి: మీరు తరచుగా దవడలో నొప్పిని కలిగి ఉంటే అప్పుడు అది గుండె జబ్బులకు సంబంధించినది కావచ్చు. దీని కోసం వెంటనే పరీక్ష చేయించుకోవడం అవసరం. లేకుంటే ప్రాణాపాయం ఉండవచ్చు.
  6. ఆకస్మికంగా చెమటలు పట్టడం: వేసవి రోజుల్లో లేదా జిమ్‌లో వర్కవుట్ చేస్తున్నప్పుడు ఆకస్మికంగా చెమటలు పట్టడం సాధారణం. అయితే ఏసీ గదిలో కానీ.. ఎటువంటి శ్రమ లేకుండా చెమటలు పడితే అది గుండెపోటుకు సంకేతం కావొచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..