Giloy Benefits: తిప్పతీగ ఆకులతో బోలెడు ప్రయోజనాలు.. రోజూ ఇలా చేస్తే ఆ సమస్యలు మటుమాయమే..!

కరోనా మహమ్మారి ప్రపంచానికి ఎంతో నష్టం కలిగించింది. దీంతోపాటు ప్రజలకు ఆరోగ్యం గురించి మరింత అవగాహన కల్పించింది. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రజలు ఆయుర్వేద నివారణల గురించి తెలుసుకున్నారు.

Giloy Benefits: తిప్పతీగ ఆకులతో బోలెడు ప్రయోజనాలు.. రోజూ ఇలా చేస్తే ఆ సమస్యలు మటుమాయమే..!
Giloy Benefits
Follow us

|

Updated on: Oct 23, 2022 | 11:55 AM

కరోనా మహమ్మారి ప్రపంచానికి ఎంతో నష్టం కలిగించింది. దీంతోపాటు ప్రజలకు ఆరోగ్యం గురించి మరింత అవగాహన కల్పించింది. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రజలు ఆయుర్వేద నివారణల గురించి తెలుసుకున్నారు. దీంతోపాటు దేశీయ మూలికలపై కూడా నమ్మకాన్ని పెంచుకున్నారు. అలాంటి ఆయుర్వేద ఔషధంలో తిప్పతీగ కూడా ఒకటి.. తిప్పతీగ అనేక ఔషధ గుణాల గని. ఇది వేగంగా బరువు తగ్గేలా చేయడంతోపాటు శరీరానికి ఇతర గొప్ప ప్రయోజనాలను కూడా అందిస్తుంది. తిప్పతీగ వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

  1. శరీరంలో పెరిగిన కొవ్వు కరిగిపోతుంది: వేగంగా పెరుగుతున్న బరువుతో ఇబ్బంది పడుతుంటే.. తిప్పతీగతో పుల్ స్టాప్ పెట్టొచ్చు.. బరువును తగ్గించుకోవడానికి ఆహారంలో దీనిని చేర్చుకోవాలి. వాస్తవానికి ఈ ప్రయోజనకరమైన మొక్కలో అడిపోనెక్టిన్, లెప్టిన్ అనే మూలకాలు కనిపిస్తాయి. ఈ మూలకాలు శరీరంలోని అనవసరమైన కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. దీని కారణంగా శరీర ఆకృతి మెరుగుపడుతుంది.
  2. ఒత్తిడిని తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది: మానసిక ఒత్తిడితో బాధపడుతుంటే.. తిప్పతీగతో చెక్ పెట్టొచ్చు. క్రమం తప్పకుండా తిప్పతీగను తీసుకోవడం ద్వారా నిద్ర బాగా రావడమే కాకుండా ఒత్తిడి స్థాయి కూడా చాలా వరకు అదుపులోకి వస్తుంది. దీని ద్వారా మీరు చింత లేకుండా జీవితాన్ని గడపవచ్చు.
  3. రోగనిరోధక శక్తి బలపడుతుంది: శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో తిప్పతీగ అద్భుతంగా పనిచేస్తుంది. తిప్పతీగలోని మూలకాలు శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటమే కాకుండా శరీరం నుంచి ప్రమాదకరమైన టాక్సిక్ యాంటీఆక్సిడెంట్లను తొలగించడానికి కూడా పని చేస్తాయి. దీని వినియోగం శరీరంలోని కణాలను బలపరుస్తుంది. ఇది వ్యాధులతో పోరాడడంలో సహాయపడుతుంది.
  4. మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది: మధుమేహం లేదా బ్లడ్ షుగర్ ఉన్నవారికి తిప్పతీగ వినియోగం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇలాంటి వారు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తిప్పతీగ జ్యూస్ తాగవచ్చు. ఈ జ్యూస్ కొంచెం చేదుగా ఉన్నా షుగర్ లెవెల్ ని చాలా వరకు కంట్రోల్ లోకి తెస్తుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. కడుపు నొప్పి దూరమవుతుంది: కడుపు నొప్పితో బాధపడేవారు కూడా తిప్పతీగ నుంచి ఉపశమనం పొందవచ్చు. అజీర్ణం, అసిడిటీ లేదా కడుపునొప్పితో బాధపడేవారు తిప్పతీగ రసాన్ని తాగితే ఉపశమనం లభిస్తుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్