Heart Attack: వామ్మో.. హఠాత్తుగా చెమటలు పట్టడంతోపాటు ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? గుండెపోటు కావొచ్చు జాగ్రత్త..!

ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం గణనీయంగా పెరుగుతోంది. కరోనా తర్వాత గుండెపోటు కేసులు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా యువతలో కూడా గుండెపోటు కేసులు వేగంగా పెరుగుతున్నాయి.

Heart Attack: వామ్మో.. హఠాత్తుగా చెమటలు పట్టడంతోపాటు ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? గుండెపోటు కావొచ్చు జాగ్రత్త..!
Heart disease symptoms
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 23, 2022 | 8:36 AM

ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం గణనీయంగా పెరుగుతోంది. కరోనా తర్వాత గుండెపోటు కేసులు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా యువతలో కూడా గుండెపోటు కేసులు వేగంగా పెరుగుతున్నాయి. చాలా సార్లు ప్రజలు గుండెపోటు సంకేతాలను సరిగ్గా గుర్తించరు. గుండెపోటుకు ముందు ఎక్కువగా చెమటలు పట్టడం కూడా ఒక లక్షణం. వేసవిలో, ప్రతి ఒక్కరూ చెమటలు పడతాయి. కానీ శీతాకాలంలో లేదా హఠాత్తుగా అధిక చెమట పట్టడం గుండెపోటుకు సంకేతం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుండెపోటు లక్షణాలు, గుండెపోటు వచ్చే ముందు ఎందుకు చెమటలు పడతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

గుండెపోటుకు ముందు చెమటలు ఎందుకు పడతాయంటే..?

గుండెపోటుకు ముందు చెమటలు పట్టడం అనేది.. వాస్తవానికి కరోనరీ అంటే రక్తనాళాలు గుండెకు రక్తాన్ని అందించడం కష్టంగా ఉన్నప్పుడు చెమట మొదలవుతుంది. ఈ కరోనరీలో కొలెస్ట్రాల్ చేరడం అడ్డుపడటానికి కారణమవుతుంది. అటువంటి పరిస్థితిలో గుండెకు రక్త సరఫరా తగ్గిపోతుంది. రక్తాన్ని పంప్ చేయడానికి గుండె చాలా కష్టపడాలి. అటువంటి పరిస్థితిలో, గుండెపై ఒత్తిడి ఉన్నప్పుడు, శరీరం సాధారణ ఉష్ణోగ్రతను ఉంచడానికి ప్రయత్నిస్తుంది. శరీరం మరింత వేగంగా చెమట పట్టడం ప్రారంభిస్తుంది. విపరీతమైన చెమటలు గుండెపోటు లక్షణం కావచ్చు.

ఇవి కూడా చదవండి

గుండెపోటు లక్షణాలు

  • ఛాతీ నొప్పి లేదా మంట
  • అసాధారణ అనుభూతి – అసౌకర్యం
  • అలసట – మైకము
  • శ్వాస ఆడకపోవడం వేగవంతమైన లేదా తక్కువ హృదయ స్పందన
  • చేయి లేదా భుజం నొప్పి
  • దవడ లేదా పంటి నొప్పి
  • తలనొప్పి

గుండెపోటుకు కారణాలు..

  • గుండెపోటుకు అనేక కారణాలు ఉండవచ్చు, అందులో నేటి జీవనశైలి అతిపెద్ద కారణం.
  • ఎక్కువ మందులు లేదా మత్తు పదార్థాలు తీసుకోవడం కూడా ఒక కారణం. ఇది మెదడు – గుండెపై కూడా ప్రభావం చూపుతుంది.
  • కాలుష్యం కూడా గుండెపోటుకు కారణం. విషపూరితమైన గాలి కణాలు ఊపిరితిత్తులు, గుండె సంబంధిత వ్యాధులకు దారితీస్తాయి.
  • ఊబకాయం కూడా గుండెపోటుకు కారణం. అధిక బరువు ఉన్నవారికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది.
  • మధుమేహం లేదా మూత్రపిండ వ్యాధి కలిగి ఉండటం కూడా గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.
  • అధిక కొలెస్ట్రాల్ గుండెపోటుకు ప్రధాన కారణం. కాబట్టి ఆహారం కూడా గుండెపోటుకు కారణం కావచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..