AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

High Cholesterol: వీటితో అధిక కొలెస్ట్రాల్‌, గుండెపోటు ప్రమాదం తగ్గించుకోవచ్చు..!

మనిషికి కొలెస్ట్రాల్‌ పెరిగిపోవడం వల్ల గుండె జబ్బులు వెంటాడుతున్నాయి. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ జీవనశైలిలో మార్పులు చేసుకుంటే జీవితం సాఫిగా కొనసాగుతుంటుంది..

High Cholesterol: వీటితో అధిక కొలెస్ట్రాల్‌, గుండెపోటు ప్రమాదం తగ్గించుకోవచ్చు..!
High Cholesterol
Subhash Goud
|

Updated on: Oct 23, 2022 | 9:02 AM

Share

మనిషికి కొలెస్ట్రాల్‌ పెరిగిపోవడం వల్ల గుండె జబ్బులు వెంటాడుతున్నాయి. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ జీవనశైలిలో మార్పులు చేసుకుంటే జీవితం సాఫిగా కొనసాగుతుంటుంది. మన ధమనుల పని గుండె నుండి మొత్తం శరీరానికి రక్తాన్ని రవాణా చేసి తిరిగి గుండెకు పంపుతుంది. అయితే రక్త నాళాలలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతే అప్పుడు రక్త పీడనం పెరగడానికి ముందు బ్లాక్ ఏర్పడుతుంది. ఆపై కరోనరీ ఆర్టరీ వ్యాధి సంభవించవచ్చు. ముఖ్యంగా గుండెపోటు ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇది ఊబకాయం, మధుమేహానికి మరింత ప్రమాదం ఏర్పడుతుంది. భారతదేశంలోని ప్రముఖ పోషకాహార నిపుణుడు నిఖిల్ వాట్స్ మాట్లాడుతూ.. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి కొన్ని ఆయుర్వేద చిట్కాలను పాటించాలన్నారు.

కొలెస్ట్రాల్ తగ్గించే ఆయుర్వేద ఆహారాలు:

  1. వెల్లుల్లి: మీరు ఉదయాన్నే వెల్లుల్లి రెబ్బలను నమిలితే, ధమనులలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం చాలా వరకు తగ్గుతుందని తెలిపారు. ఒక టీస్పూన్ అల్లం వెల్లుల్లిని ఒక టీస్పూన్ గ్రౌండ్‌లో కలపండి. ప్రతిరోజూ తినడం వల్ల కొన్ని రోజుల్లోనే ఫలితం కనిపిస్తుంది.
  2. కొత్తిమీర: ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్ ఇందులో ఉంటాయి. కొత్తిమీర నీరు తాగడం వల్ల రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గడమే కాకుండా శరీరం డిటాక్సిఫై అవుతుంది.
  3. మెంతి: గింజలు మనం సాధారణంగా ఆహారం రుచిని పెంచడానికి మెంతి గింజలను ఉపయోగిస్తాము. అయితే ఇది మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మెంతి గింజల వల్ల అధిక కొలెస్ట్రాల్‌ను అరికట్టవచ్చు. మెంతులను వివిధ వంటకాల్లో ఉపయోగించుకుంటారు. కానీ ఎక్కువ ప్రయోజనం పొందాలనుకుంటే రాత్రిపూట మెంతులను ఒక గ్లాస్‌లో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగాలి.
  4. తేనె: తేనె సహజసిద్ధమైన, ఆరోగ్యకరమైనది. మీరు దానిని నిమ్మకాయ, నీటిలో కలిపి తాగితే కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండడమే కాకుండా నడుము, పొట్ట కొవ్వును కూడా తగ్గుతుంది. మీరు ఈ ఆయుర్వేద నివారణను కొన్ని రోజులు నిరంతరం ప్రయత్నిస్తే, దాని ప్రభావం కనిపిస్తుంది.
  5. ఇవి కూడా చదవండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..