Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: పరిగడుపున ఆల్కహాల్ తాగితే ఏమవుతుందో తెలుసా.. నిపుణులు ఏమంటున్నారంటే..

ఉదయం నిద్రలేవగానే చాలా మందికి ఏదో ఒకటి తినే అలవాటు ఉంటుంది. రాత్రి భోజనం తీసుకున్న తర్వాత నిద్రపోవడం వల్ల రాత్రంతా మన శరీరం ఆ ఆహారం నుంచి వచ్చే శక్తిని వినియోగించుకుంటుంది. అయితే పొద్దు..

Health: పరిగడుపున ఆల్కహాల్ తాగితే ఏమవుతుందో తెలుసా.. నిపుణులు ఏమంటున్నారంటే..
Drinking Alcohol
Follow us
Ganesh Mudavath

|

Updated on: Oct 22, 2022 | 8:58 PM

ఉదయం నిద్రలేవగానే చాలా మందికి ఏదో ఒకటి తినే అలవాటు ఉంటుంది. రాత్రి భోజనం తీసుకున్న తర్వాత నిద్రపోవడం వల్ల రాత్రంతా మన శరీరం ఆ ఆహారం నుంచి వచ్చే శక్తిని వినియోగించుకుంటుంది. అయితే పొద్దు పొద్దునే నిద్ర లేవగానే ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి. కాబట్టి ఆకలిగా అనిపిస్తుంది. మరి కొందరికి మాత్రం బ్రష్ చేసుకోగానే ఆకలిగా అనిపిస్తుంది. అలాంటప్పుడు ఇంట్లో ఏది ఉంటే అది నోట్లో వేసుకుని ఆడించేస్తుంటాం. ప్రాసెస్ చేసిన పదార్థాలు, ఫ్రిజ్ లో ఉండే ఆహారాన్ని లాగించేస్తుంటారు. అయితే ఇలా చేయడం ఏ మాత్రం సరికాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే రాత్రి భోజనం చేసిన తర్వాత మన శరీరం ఆ శక్తిని ఉపయోగించుకుని విధులు నిర్వర్తిస్తుంది. కాబట్టి మార్నింగ్ నిద్ర లేవగానే పొట్ట ఖాళీ అవుతుంది. దీంతో గ్యాస్ ఉత్పత్తవుతుంది. ఇది ఎసిడిటీకి దారి తీస్తుంది. దీంతో పాటు మసాలా, ఘాటు ఉండే పదార్థాలను పరిగడుపున తీసుకుంటే ఈ సమస్య మరింత ప్రమాదకరంగా మారుతుంది.

ఉదయం వేళ కడుపు ఖాళీగా ఉంటుంన్నందున కొన్నిరకాల ఆహారాలను తీసుకోకుండా జాగ్రత్తపడాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలా తీసుకోవడం వల్ల వివిధ ఆరోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడతాయంట. ఉదయం వేళ కడుపు ఖాళీగా ఉండటంతో మనం తీసుకునే కొన్ని రకాల ఆహారాలు కడుపు లోపలి భాగాలపై ప్రభావం చూపుతాయి. ఉదయాన్నే మసాలా లేదా ఫ్రైడ్‌ ఫుడ్స్‌ తినకుండా చూసుకోవాలి. పరిగడుపునే వీటిని తింటే కడుపులో మంట, అజీర్తి సమస్యలు వస్తాయి. అలాగే కడుపు, ఛాతీ బరువుగా అన్పించి ఇబ్బంది కలుగుతుంది. అంతే కాకుండా పీచు పదార్థాలు తక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి.

చాలా మందికి బ్రష్‌ చేసుకోగానే కాఫీ లేదా టీ సిప్‌ చేయాలనిపిస్తుంది. ఉదయం నిద్ర లేవగానే కాఫీ లేదా టీ తాగడం వల్ల ఛాతీలో మంట, డీహైడ్రేషన్‌ వంటి సమస్యలు వస్తాయి. దీనికి బదులుగా గోరువెచ్చటి నీరు తాగడం మంచిది. పరిగడుపున ఆల్కహాల్‌ తీసుకోవడం ప్రమాదకరమైంది. ఇది కాలేయంపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. రక్తంలో ఆల్కహాల్‌ వేగంగా వ్యాపించి రకరకాల ఆరోగ్య సమస్యలు చుట్టుమడతాయి. కాబట్టి ఆరోగ్యకర జీవనాన్ని అలవాటు చేసుకోవాలంటే కొన్ని నియమాలు పాటించక తప్పదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి