AP Rains: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. తప్పిన తుఫాన్ గండం.. కానీ..

Ravi Kiran

Ravi Kiran |

Updated on: Oct 22, 2022 | 1:39 PM

ఆంధ్రప్రదేశ్‌కు 'సిత్రాంగ్' తుఫాన్ ముప్పు లేదని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. అక్టోబర్ 22 నుంచి 28 వరకు అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

AP Rains: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. తప్పిన తుఫాన్ గండం.. కానీ..
AP Weather Report

ఏపీ ప్రజలకు ముఖ్య అలెర్ట్. ఆగ్నేయ బంగాళాఖాతం, పరిసర ప్రాంతాలలో కొనసాగుతున్న అల్పపీడనం క్రమంగా బలపడి తూర్పు మధ్య బంగాళాఖాతంలో సోమవారం నాటికి తుఫాన్‌గా బలపడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాన్‌కు ‘సిత్రాంగ్’ అని నామకరణం చేసింది వాతావరణ శాఖ. ఇదిలా ఉంటే.. ‘సిత్రాంగ్’ తుఫాన్ మంగళవారం తెల్లవారుజామున తీవ్రతరం అయ్యి(89- 117కిమీ/గం) తూర్పు బంగ్లాదేశ్ తీరాన్ని దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు నైరుతి రుతుపవనాలు ఒడిస్సా, విదర్భా మీదుగా క్రమేపీ ఉపసంహరించుకుంటున్నాయని పేర్కొంది.

ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌కు ‘సిత్రాంగ్’ తుఫాన్ ముప్పు లేదని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. అక్టోబర్ 22 నుంచి 28 వరకు అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే ఈశాన్య రుతుపవనాలు వల్ల నవంబర్ మొదటి వారం నుంచి కోస్తాంద్రాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ‘సిత్రాంగ్’ తుఫాన్ ప్రభావం ఎక్కువగా పశ్చిమ బెంగాల్, ఒరిస్సాలపై ఉంటుందని.. ఆయా రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అయితే వాతావరణ శాఖ తుఫాన్ హెచ్చరికల నేపధ్యంలో ఏపీ అధికారులు ముందుగానే అప్రమత్తమయ్యారు. మత్స్యకారులను బుధవారం వరకు సముద్రంలో వేటకు వెళ్ళకూడదని హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అత్యవసర సహాయార్ధం నిమిత్తం కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu