Child Health: పిల్లలు అల్లరి చేస్తున్నారని విసుక్కుంటున్నారా.. అందరి ముందు తిట్టేస్తున్నారా.. బీ అలర్ట్..

Ganesh Mudavath

Ganesh Mudavath |

Updated on: Oct 22, 2022 | 2:37 PM

చిన్నారులు సాధారణంగానే అల్లరి చేస్తుంటారు. అల్లరి చేయని బాల్యం ఉండనే ఉండదు. మనమందరం కూడా ఆ దశను దాటి వచ్చిన వాళ్లమే. అయితే ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఎంత సందడిగా ఉంటుందో మాటల్లో...

Child Health: పిల్లలు అల్లరి చేస్తున్నారని విసుక్కుంటున్నారా.. అందరి ముందు తిట్టేస్తున్నారా.. బీ అలర్ట్..
Parents Scolding

చిన్నారులు సాధారణంగానే అల్లరి చేస్తుంటారు. అల్లరి చేయని బాల్యం ఉండనే ఉండదు. మనమందరం కూడా ఆ దశను దాటి వచ్చిన వాళ్లమే. అయితే ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఎంత సందడిగా ఉంటుందో మాటల్లో చెప్పలేం. ఇది ఆనందంతో పాటు మంచి అనుభవాన్నిస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో పిల్లలు చేసే అల్లరి తీవ్రంగా మారుతుంటుంది. దీంతో తల్లిదండ్రులు వారిపై కోపం ప్రదర్శిస్తుంటారు. సమస్యలను కలిగించే, అల్లర్లకు పాల్పడే పిల్లలతో వ్యవహరించేటప్పుడు తల్లిదండ్రులు సహనం కోల్పోతుంటారు. ఈ పరిస్థితిలో పేరెంట్స్ తమ ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి పిల్లలను తిట్టే అవకాశం ఏర్పడుతుంది. కొన్నిసార్లు వారు తమ స్నేహితులు లేదా క్లాస్‌మేట్స్ ముందు పిల్లలపై కోపాన్ని ప్రదర్శిస్తుంటారు. అయితే అలా చేయడం ఏ మాత్రం ప్రయోజనకరం కాదని మానసిక ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రతికూలంగా ప్రభావాన్ని చూపిస్తుందని ఆందోళన చెందుతున్నారు. ఇతరుల ముందు పిల్లలను తిట్టడం లేదా కేకలు వేయడం వల్ల వారికి అనేక మానసిక సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు వారిని యుక్తవయస్సులో కూడా బాధా కలిగించేవిగా మారతాయి. 13 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లల ప్రవర్తనా లక్షణాలపై వారి తల్లిదండ్రులు అరుస్తూ ఉండేలా ఒక అధ్యయనం జరిగింది. ఈ అధ్యయనం ప్రకారం పిల్లల్లో నిస్పృహ లక్షణాల పెరుగుదలను చూపించింది.

పిల్లలను గట్టిగా మందలించడం వల్ల కీళ్లనొప్పులు, తలనొప్పి, వెన్ను, మెడ సమస్యలు వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇది ఒక అధ్యయనం ద్వారా నిర్ధారితమైంది. ఈ అధ్యయనం ప్రకారం.. ప్రతికూల బాల్య అనుభవం బాధాకరమైన వైద్య పరిస్థితులతో దగ్గరి సంబంధాన్ని కలిగి ఉంటుంది. చిన్ననాటి బాధాకరమైన అనుభవాల వల్ల డిప్రెషన్, బైపోలార్ డిజార్డర్, ఒత్తిడి వంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. మందలించడం, ఇతర రకాల కఠినమైన తల్లిదండ్రుల శిక్ష పద్ధతులు పిల్లల మెదడు అభివృద్ధిపై చాలా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి.

13 సంవత్సరాల వయస్సు గల పిల్లలపై వారి తల్లిదండ్రులు అకారణంగా కోప్పడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ కఠినమైన ప్రవర్తన పిల్లలకు క్రమశిక్షణ నేర్పుతుందని కొందరు భావిస్తున్నారు. కానీ అందుకు విరుద్ధంగా ఇది వారి ప్రవర్తనలో మరిన్ని సమస్యలకు దారి తీస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అందుకే పిల్లలకు ఏది మంచి, ఏది చెడు అనే విషయాన్ని చిన్నప్పటి నుంచే నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించాలి గానీ, దండించే విధానం ఏ మాత్రం మంచిది కాదనే విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu