AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WHO: సోమరిపోతుతనం పెరిగితే ఈ వ్యాధులు తప్పవంట.. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

ఆధునిక కాలంలో మారుతున్న జీవనశైలి కారణంగా ఎన్నో కొత్త రకాల వ్యాధులు సంభవిస్తున్నాయి. అలాగే మనుషుల్లో బద్ధకం కూడా పెరుగుతోంది. బద్ధకం ఎక్కువ కావడంతో చాలామందిలో సోమరిపోతుతనం..

WHO: సోమరిపోతుతనం పెరిగితే ఈ వ్యాధులు తప్పవంట.. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక
Laziness (Representative image)
Amarnadh Daneti
|

Updated on: Oct 22, 2022 | 4:52 PM

Share

ఆధునిక కాలంలో మారుతున్న జీవనశైలి కారణంగా ఎన్నో కొత్త రకాల వ్యాధులు సంభవిస్తున్నాయి. అలాగే మనుషుల్లో బద్ధకం కూడా పెరుగుతోంది. బద్ధకం ఎక్కువ కావడంతో చాలామందిలో సోమరిపోతుతనం పెరుగుతోంది. సోమరిపోతుతనం పెరుగుతున్న వారి సంఖ్య పెరుగుతుందని, వారిలో ప్రాణంతాక వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ- డబ్ల్యూహెచ్ వో హెచ్చరించింది. వ్యాయామం, సరైన శారీరక శ్రమ లేకపోతే ప్రాణాంతక వ్యాధులు తప్పవని తెలిపింది. సోమరిపోతుతనం రోజు రోజుకి పెరిగిపోతుందని వెల్లడించింది. కనీసం వ్యాయామం చేయనివారు ప్రాణాంతక వ్యాధులకు గురవుతున్నారని.. వారిలో యువత కూడా ఉన్నారని పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ 174 దేశాల్లో నిర్వహించిన సర్వేలో.. ప్రపంచంలో సోమరిపోతు తనం పెరుగుతున్న వారి సంఖ్య వేగంగా పెరుగుతోందని పేర్కొంది. డబ్ల్యూహెచ్ వోనివేదికల ప్రకారం.. 2020 నుంచి 2030 మధ్య 50 మిలియన్లకు పైగా ప్రజలు జీవనశైలి వ్యాధుల బారిన పడనున్నట్లు అంచనా వేసింది. వీరిలో 47 శాతం మంది హైపర్‌టెన్షన్ లేదా హై బీపీతో బాధపడుతుండగా.. 43 శాతం మంది డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు పేర్కొంది.

జీవనశైలి వ్యాధులను నివారించే మార్గాలు

ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం.. ఒక వ్యక్తి ప్రతిరోజూ 21 నిమిషాలు వ్యాయామానికి కేటాయించినట్లయితే.. వారు ఈ వ్యాధులను 20 నుంచి 30 శాతం వరకు నివారించవచ్చని తెలిపింది. ఇది డిప్రెషన్, గుండె జబ్బుల కేసులలో 7 నుంచి 8 శాతం మందిని నిరోధించడంలో కూడా సహాయపడుతుందని తెలిపింది. 74 శాతం మరణాలు జీవనశైలి వ్యాధుల కారణంగానే సంభవిస్తున్నాయని, 70 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 1 కోటి 70 లక్షల మంది ప్రతి సంవత్సరం జీవనశైలి వ్యాధుల కారణంగా మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

ప్రపంచంలోని ధనిక దేశాలలో 36 శాతం మంది సోమరితనంతో ఉంటున్నారని, పేద దేశాల్లో అయితే కేవలం 16 శాతం మంది మాత్రమే సోమరిపోతు తనంతో ఉంటున్నారని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 42 శాతం దేశాలు మాత్రమే నడక లేదా సైక్లింగ్ కోసం విధానాలు, సౌకర్యాలను కలిగి ఉన్నాయని, డ్రంక్ అండ్ డ్రైవ్‌ను అరికట్టేందుకు 26 శాతం దేశాలు మాత్రమే కఠినమైన విధానాలను కలిగి ఉండగా.. 26 శాతం దేశాలు మాత్రమే వేగ పరిమితి నిబంధనలను ఖచ్చితంగా అమలు చేస్తున్నాయని ఈ నివేదిక తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రజలు యోగా, వ్యాయామం వంటివి చేస్తే రోగాల బారిన పడకుండా తమను తాము కాపాడుకోవచ్చని తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..