AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Before Sleeping: మీరు రాత్రి నిద్రించే ముందు ఈ పనులు అస్సలు చేయకూడదు..!

ప్రతి మనిషికి నిద్ర ఎంతో ముఖ్యం. సరైన నిద్ర లేకుంటే ఆనారోగ్య సమస్యలు చుట్టుముడుతాయి. అలాగే నిద్రించే ముందు కొన్నింటికి దూరంగా ఉండటం..

Before Sleeping: మీరు రాత్రి నిద్రించే ముందు ఈ పనులు అస్సలు చేయకూడదు..!
Oversleeping
Subhash Goud
|

Updated on: Oct 22, 2022 | 8:39 AM

Share

ప్రతి మనిషికి నిద్ర ఎంతో ముఖ్యం. సరైన నిద్ర లేకుంటే ఆనారోగ్య సమస్యలు చుట్టుముడుతాయి. అలాగే నిద్రించే ముందు కొన్నింటికి దూరంగా ఉండటం మంచిది. ఈ మధ్య కాలంలో చాలా మందికి నిద్రలేమి సమస్య ఉంటుంది. ముఖ్యంగా యువతల్లో ఎక్కువగా ఉంటుంది. సరైన నిద్ర లేకుంటే జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుంటుంది. అయితే రాత్రి పూట భోజనానికి, నిద్రకు కనీసం 3 గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కొందరు నిద్రించే ముందు భోజనం చేస్తుంటారు. ఇక కొందరు కొవ్వు పదార్థాలు, కారం, మసాలాలు దట్టించిన ఆహారాలను బాగా తిని వెంటనే నిద్రిస్తారు. అలా చేయడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. గ్యాస్‌, అసిడిటీ, తలతిరగడం, అధికంగా బరువు పెరగడం, హార్ట్‌ ఎటాక్‌లు రావడం, డయాబెటిస్‌ వంటి సమస్యలు వస్తాయి. అందుకే నిద్రించే ముందు తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే తిండికి, నిద్రకు మధ్య కనీస వ్యవధి ఉండేలా చూసుకోవాలి. దీంతో నిద్రలేమి సమస్య కూడా తగ్గుతుంది.

అలాగే మద్యం సేవించి నిద్రించడం వల్ల నిద్రలేమి సమస్య బారిన పడాల్సి వస్తుందని పరిశోధకులు చేసిన పలు అధ్యయనాల ద్వారా వెల్లడైంది. అలాగే రాత్రి పూట చక్కగా నిద్ర పట్టాలంటే మద్యానికి దూరంగా ఉండాలి. దగ్గు, జలుబు, అలర్జీల కోసం వేసుకునే మందులు కూడా కొందరిలో నిద్రలేమిని కలిగిస్తాయి. ఆ మందులను డాక్టర్‌ సలహా మేరకు కొంతకాలం పాటు మాత్రమే వాడాలి. అలా కాకుండా ఇష్టం వచ్చినట్లు ఆ మెడిసిన్‌ను వాడితే దీర్ఘకాలికంగా అనేక అనారోగ్య సమస్యలు రావడంతోపాటు నిద్రలేమి సమస్య కూడా వస్తుంది. కనుక నిద్రలేమి నుంచి బయటపడాలంటే ఆ మందులను వేసుకోవడం మానేయాలి.

రాత్రి పూట ఫోన్‌, టీవీ, కంప్యూర్‌ వంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలకు దూరంగా ఉండాలి. లేదంటే నిద్రలేమి సమస్య బారిన పడడమే కాకుండా ఎన్నో ఆనారోగ్య సమస్యలు దరిచేరుతాయని చెబుతున్నారు. మనం ఇలాంటివి చేయడం వల్ల మనకు తెలియకుండానే ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చిపడతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. చాలా మంది నిద్రించే ముందు మొబైల్‌ళ్లు చూడటం, వీడియోలు చూడటం, ల్యాప్‌టాప్‌ వాడటం అలవాటు ఉంటుంది. వీటి వల్ల కూడా నిద్రకు భంగం కలుగుతుంది. మొబైల్‌ స్క్రీన్స్‌ చూడటం వల్ల నిద్రపడ్డదు. దీని వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి