Whatsapp: దీపావళి నుండి ఈ మొబైల్‌లలో వాట్సాప్ పని చేయదు.. ఎందుకంటే..
ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌ల ప్రపంచంలో వాట్సాప్ కు ప్రత్యేక స్థానముంది. ఇది ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ల నెలవారీ క్రియాశీల వినియోగదారులను కలిగి ఉంది..
ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌ల ప్రపంచంలో వాట్సాప్ కు ప్రత్యేక స్థానముంది. ఇది ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ల నెలవారీ క్రియాశీల వినియోగదారులను కలిగి ఉంది. భారతదేశంలో 500 మిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్నారు. ఇప్పుడు దీపావళి రాబోతుంది. పండగ ఆనందంలో చాలా మంది ఒకరి నుంచి ఒకరికి వాట్సాప్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తుంటారు. ఫోటోలు, వీడియోలను పంచుకుంటారు. అయితే దీపావళి నుంచి అందరికీ ఈ సదుపాయం లభించదు. ఐఫోన్, ఆండ్రాయిడ్ కొన్ని పాత వెర్షన్లలో WhatsApp పని చేయదు. కేవలం దీపావళి రోజున అంటే అక్టోబర్ 24న WhatsApp పాత iOS, Android ఆపరేటింగ్ సిస్టమ్‌లను సపోర్ట్ చేయదు. అందువల్ల అలాంటి ఫోన్లు ఉన్నవారికి వాట్సాప్ సేవ లభించదు.
ఈ ఫోన్‌లో వాట్సాప్ పనిచేయదు
ఐఓఎస్ 10, ఐఓఎస్ 11లో పనిచేసే ఐఫోన్‌లకు వాట్సాప్ తన మద్దతును ఉపసంహరించుకుంది. అంటే ఈ తరహా ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న ఐఫోన్‌లో వాట్సాప్ పనిచేయదు. దీనితో పాటు, iPhone 5, iPhone 5C వినియోగదారులు కూడా వాట్సాప్ సేవను పొందలేరు. దీనికి సంబంధించి భవిష్యత్తులో అలాంటి ఫోన్‌లలో పనిచేయని కొన్ని అప్‌డేట్‌లు రాబోతున్నందున తన సేవను నిలిపివేస్తున్నట్లు వాట్సాప్ తెలిపింది.
వాట్సాప్ ప్రస్తుతం iOS 12 లేదా కొత్త వెర్షన్‌ను అమలు చేస్తున్న అదే iPhoneలో రన్ అవుతుంది. కొత్త ఫీచర్లు అందుబాటులోకి రావడానికి, ఈ యాప్ స్మార్ట్‌ఫోన్‌లో సజావుగా రన్ అయ్యేలా కొత్త వెర్షన్‌ను స్వీకరించాలని వాట్సాప్ ఎల్లప్పుడూ తన వినియోగదారులకు సలహా ఇస్తుంది.
ఐఫోన్ లాగా కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు. ఆండ్రాయిడ్ 4.1 లేదా అంతకంటే పాత వెర్షన్‌తో పనిచేసే ఆండ్రాయిడ్ ఫోన్‌లకు వాట్సాప్ సర్వీస్ ప్రయోజనం ఉండదని కంపెనీ తెలిపింది. అంటే, అలాంటి ఫోన్‌ల నుండి సందేశాలు పంపడం లేదా కాల్‌లు చేయడం లేదా వీడియో కాల్‌లు చేయడం వంటివి చేయలేరు. దీని కోసం వినియోగదారు తన ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను నవీకరించాలి. ఈ పని కష్టం అయినప్పటికీ దాని కంటే మెరుగైన కొత్త ఫోన్ కొనుగోలు చేసే ఆప్షన్ బెటర్.
ప్రజలు ఇప్పటికీ కొన్ని పాత పరికరాలు, తక్కువగా ఉన్న సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగిస్తున్నారు. ఈ పాత ఫోన్‌లు లేటెస్ట్ సెక్యూరిటీ అప్‌డేట్‌లతో రావు. అలాగే, అటువంటి ఫోన్‌లు అప్‌డేట్ చేయబడిన వాట్సాప్‌కు మద్దతు ఇవ్వవు. అందుకే సర్వీసును నిలిపివేస్తున్నారు. వాట్సాప్‌ను ఆఫ్ చేయాల్సిన ఫోన్‌లో, సమయానికి వినియోగదారుకు సందేశం పంపబడుతుందని కంపెనీ తెలిపింది. ఫోన్‌లో నడుస్తున్న ఆపరేటింగ్ సిస్టమ్‌కు వాట్సాప్ సపోర్ట్ చేసేలా యూజర్‌లు తమ ఫోన్‌లను అప్‌గ్రేడ్ చేయమని గుర్తుచేస్తారు. WhatsApp kaiOS 2.5.0, కొత్త వెర్షన్లలో పనిచేస్తుంది. ఈ రకమైన ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న ఫోన్‌లలో జియో ఫోన్, జియో ఫోన్ 2 ఉన్నాయి.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ కోసం