Airplane Windows: విమానంలోని కిటికీలు స్క్వేర్‌గా కాంకుండా రౌండుగానే ఎందుకుంటాయో తెలుసా.. ఇందులో సైన్స్ ఉంది..

విమానం కిటికీలు గుండ్రంగా ఎందుకు ఉన్నాయి..? చతురస్రాకారపు విండోలు ఎందుకుండవు..? ఇలాంటి చాలా ప్రశ్నలు మనకు విమానంను చూసినప్పుడు వచ్చే డౌట్స్. అయితే ఇలాంటి ప్రశ్నలకు మా వద్ద సమాధానం ఉంది. ఎందుకుంటాయో ఇక్కడ తెలుసుకోండి..

Airplane Windows: విమానంలోని కిటికీలు స్క్వేర్‌గా కాంకుండా రౌండుగానే ఎందుకుంటాయో తెలుసా.. ఇందులో సైన్స్ ఉంది..
Airplane Windows
Follow us

|

Updated on: Oct 21, 2022 | 8:48 PM

వ్యాపారం, విహారం, వేడుక.. సందర్భం ఏదైతేనేం విమానాల్లో విహరించడం ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయింది. అనుకూల సమయానికితోడు ప్రైవసీ ఉంటుందన్నది ప్రయాణికులు చాలా మంది అనుకుంటున్నారు. అంతేకాదు ప్రయాణ ఖర్చులూ ఒక్కటే కొంత ఇబ్బందిగా ఉన్నా.. విమాన ప్రయణం ఓ రేంజ్‌ అని ఫీలవుతారు సమాన్య విమాన ప్రయాణికులు. ఈ మధ్యకాలంలో ఒక్క క్లిక్‌తో ప్రత్యేక విమానంలో దూసుకెళ్తున్నారు విమాన ప్రయాణికులు. అయితే మీరు విమానంలో ప్రయాణించినప్పుడల్లా విండో సీజ్ కోసం ట్రై చేస్తుంటారు. ఎందుకంటే విమానంలో ప్రయాణిస్తూ ఆ విండోల నుంచి చూస్తే కనిపించే ప్రపంచం మరోలా ఉంటుందని ప్రయాణికుల ఫీల్. అయితే విమానంలో మీరు ప్రయాణిస్తున్నప్పుడు కానీ విమనంలో లోపలి చిత్రాలను చూస్తున్నపుుడ గమనించి ఉంటారు. విమానంలోపలి కిటికీలు ఎందుకు గుండ్రంగా ఉన్నాయో మీరు గమనించారా..? అవి గుండ్రంగా ఉండటానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం-

అందుకే విమానం కిటికీ గుండ్రంగా ఉంటాయి..

విమానంలో ఉపయోగించే కిటికీ పూర్తిగా గుండ్రంగా ఉండదు కానీ చాలా వరకు అదే ఆకారంలో ఉంటాయి. దీనికి కారణం చతురస్రాకారపు విండో గాలి పీడనాన్ని తట్టుకోలేక పోతాయి. అలా ఉంటే అది పగుళ్లు ఏర్పడుతాయి. దీని వెనుక పెద్ద సైన్స్ దాగి ఉంది. గాలి ఒత్తిడే ఇందుకు కారణం. అయితే రౌండ్ విండో గాలి ఒత్తిడిని తట్టుకోగలదు. విండో వక్రత కారణంగా పీడనం సమానంగా ఉంటుంది. పగుళ్లు కూడా వచ్చే ఛాన్స్ ఉండదు.  

విమానం ఆకాశంలో ఉన్నప్పుడు.. అప్పుడు గాలి పీడనం విమానం లోపల, వెలుపల ఉంటుంది. ఈ ఒత్తిడి కూడా మారుతూ ఉంటుంది. కాబట్టి విమానంలో గుండ్రని కిటికీలు ఏర్పాటు చేస్తారు. రౌండ్ విండో కారణంగా విమానం ఎత్తు,  వేగం ఎక్కువగా ఉంటే విమానం విరిగిపోయే అవకాశం తక్కువగా ఉంటుంది.

గతంలో విమానాల కిటికీలు గుండ్రంగా కాకుండా..

మొదట్లో విమానాల కిటికీలు గుండ్రగా కాకుండా చతుర్రస్రాకంలో ఉండేవి. దీంతో విమానల వేగం కూడా చాలా తక్కువగా ఉండేది.. అంతేకాదు విమానలు తక్కువ ఎత్తులో ప్రయాణించేవి. ఇందనం కూడా ఎక్కవగా వినియోగించాల్సి వచ్చేది. విమానంలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య పెరగడం మొదలవడంతో విమానం వేగాన్ని పెంచాల్సిన అవసరం కూడా ఏర్పండి. అందుకని కంపెనీలు విమానంలో వేగం పెంచడం వల్ల విమానం కిటికీని కూడా చతురస్రాకారంలోంచి గుండ్రంగా మార్చాల్సి వచ్చింది, వేగం ఎక్కువగా ఉన్నప్పుడు గాలి ఒత్తిడిని తట్టుకునేలా ప్లాన్ చేశారు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం