Leg Muscle Pain: కండరాలు పట్టేస్తున్నాయా.. ఆ నొప్పిని తగ్గించుకునేందుకు ఇలా చేయండి.. అద్భుతమైన ఫలితాలు మీ సొంతం..
అన్ని వయసుల వారిని కండరాల నొప్పి ఇబ్బంది పెడుతుంటుంది. ఇలాంటి సమయంలో కొన్ని జాగ్రత్తలతోపాటు, నొప్పిని తగ్గించే చిట్కాలను కూడా..
కండరాలు పట్టేసినట్లుగా ఉండటం అనేది అన్ని వయసుల వారికి వచ్చే సమస్య. కండరాలలో బెణుకు కారణంగా, ఒత్తిడి కారణంగా ఈ నొప్పి తరచుగా వస్తుంటుంది. కండరాల కణజాలం దెబ్బతినడం, వాటిలో వాపు కారణంగా కూడా ఈ సమస్య వస్తుంటుంది. ఒత్తిడి వంటి అనేక కారణాల వల్ల కండరాల నొప్పి మొదలవుతుంది. వ్యాయామం చేసేటప్పుడు, జారడం, నిద్రలో, తప్పుగా కూర్చోవడం కూడా కండరాలు పట్టేస్తుంటాయి. కాళ్ల కండరాలు బలహీనపడటం వల్ల పాదాలపై నిలబడటం కష్టమవుతుంది. కాలి కండరాల బెణుకును తొలగించడానికి మీరు వివిధ రకాల ఇంటి నివారణలను అనుసరించవచ్చు. పాదాల కండరాల నొప్పి నుంచి మీరు ఎలా ఉపశమనం పొందవచ్చో తెలుసుకుందాం..
కాలి కండరాలలో నొప్పికి కారణాలు ఇవే..
కండరాల నొప్పికి అనేక కారణాలు ఉన్నాయి. విటమిన్ డి, థైరాయిడ్ సమస్య, శరీరంలో ఉప్పు, నీరు లేకపోవడం,స్టెరాయిడ్స్ అధికంగా తీసుకోవడం కండరాల నొప్పికి కారణమవుతుంది. దీనివల్ల కూర్చోవడం కష్టంగా ఉంటుంది. చేతులు, కాళ్ళలో నొప్పి, బలహీనత కూడా ఇందుకు కారణం.
కండరాల నొప్పిని ఇలా వదిలించుకోండి..
మీరు పాదాల కండరాలలో నొప్పితో బాధపడుతున్నట్లయితే.. ఐస్ క్యూబ్‌ను అప్లై చేయండి. తద్వారా కండరాల లోపల నొప్పి, వాపు తగ్గిపోతుంది. ఇలా చేయడం ద్వారా వెంటనే ఉపశమనం లభిస్తుంది. కండరాలపై 15-20 నిమిషాల పాటు ఐస్‌ను అప్లై చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది.
ఆహారంలో అల్లం తీసుకోండి:
కండరాల నొప్పితో బాధపడేవారు ఆహారంలో అల్లం తీసుకోవాలి. ఇందులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అల్లం యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది. ఇది కండరాల తిమ్మిరి, నొప్పి, దృఢత్వాన్ని తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.
మస్టర్డ్ ఆయిల్ తో మసాజ్:
ఆవనూనెతో రోజూ కాలి కండరాలకు మసాజ్ చేయడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. మస్టర్డ్ ఆయిల్ పాదాల నొప్పిని తగ్గిస్తుంది. మసాజ్ చేయడం వల్ల కండరాలు బలపడతాయి. కండరాల ఒత్తిడి తగ్గుతుంది.
వ్యాయామం చేయండి:
మీరు కండరాల నొప్పి, వాపును తొలగించాలనుకుంటే వ్యాయామం చేయండి. వ్యాయామం చేయడం వల్ల కండరాల దృఢత్వం తొలగిపోతుంది. వ్యాయామం చేయడం వల్ల కాళ్లలో మొదలైన నొప్పి నెమ్మదిగా తగ్గుతుంది. అంతే కాదు నెమ్మదిగా కూడా వాపు తగ్గుతుంది. పడుకునే విధానం కూడా కాళ్లలో నొప్పిని కలిగిస్తుంది. మీ పాదాల క్రింద ఒక దిండుతో పడుకోండి. మీరు కండరాల నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం