AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

13 గంటల రిహార్సిల్.. అది కూడా నాలుగునెలల గర్భంతో.. కట్ చేస్తే ఇండియన్ షేక్ చేసిన సాంగ్

కొన్ని సాంగ్ సినిమాలకు మించి హిట్స్ అవుతుంటాయి. ఒకొక్కసారి సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ సాంగ్స్ మాత్రం సూపర్ హిట్ అవుతుంటాయి. ఇక ఓ సాంగ్ ఇండస్ట్రీలో ఆల్ టైం సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పటికీ అక్కడడక్కడ ఈ సాంగ్ వినిపిస్తూనే ఉంటుంది.

13 గంటల రిహార్సిల్.. అది కూడా నాలుగునెలల గర్భంతో.. కట్ చేస్తే ఇండియన్ షేక్ చేసిన సాంగ్
Actress
Rajeev Rayala
|

Updated on: May 20, 2026 | 11:01 AM

Share

సినిమాల్లో హీరోలు ఎంతగా కష్టపడతారో హీరోయిన్స్ కూడా అదే రేంజ్ లో కష్టపడుతూ ఉంటారు. కొంతమంది ముద్దుగుమ్మలు సినిమాల్లో పాత్ర  కోసం ఎలాంటి సాహసం చేయడానికైనా సిద్దపడుతుంటారు. కొందరు డీ గ్లామర్ లుక్ లో కూడా మెరుస్తూ ఉంటారు. మరికొంతమంది రొమాంటిక్ సీన్స్ లోనూ రెచ్చిపోతుంటారు. అయితే కొంతమంది హీరోయిన్స్ పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో రాణించారు.  పిల్లలు పుట్టిన తర్వాత కూడా  కొంతమంది హీరోయిన్స్ సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ ఏకంగా నాలుగు నెలల గర్భంతో ఓ సాంగ్ లో డాన్స్ చేసి అదరగొట్టింది. ఏకంగా 13 గంటలపాటు ఆ సాంగ్ కోసం రిహార్సిల్ చేసిందట ఆమె.. అంతే కాదు ఆ సాంగ్ విడుదలై ఇండస్ట్రీని షేక్ చేసింది. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.?

ఇది కూడా చదవండి : మూడు పెళ్లిళ్లు చేసుకొని తప్పు చేశా.. టైం అంతా వేస్ట్.. ఇప్పుడు బుద్దొచ్చింది

ఇండస్ట్రీలో ఎంతో మంది భామలు అందం, అభినయంతోపాటు డాన్స్ తోనూ మెప్పిస్తున్నారు. వారిలో మాధురి దీక్షిత్ ఒకరు. ఒకప్పుడు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ ఆమె. బాలీవుడ్ లో ఈ అమ్మడు ఓ సెన్సేషన్. ఆమె అందానికి బాలీవుడ్ ప్రేక్షకులే కాదు యావత్ ఇండియా మొత్తం ఫిదా అయ్యింది.  ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి విజయాలను అందుకున్నారు మాధురి. ఇక ఆమె డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటిగానే కాదు మంచి డాన్సర్ గానూ పేరు తెచ్చుకుంది ఈ గ్లామరస్ క్వీన్. ఇప్పటికీ తరగని అందంతో కట్టిపడేస్తుంది మాధురి దీక్షిత్.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :RK Roja: ఒక్కహీరో కూడా నాకు లవ్ ప్రపోజ్ చేయలేదు.. కారణం ఏంటో చెప్పిన రోజా

కాగా మాధురి దీక్షిత్ ఓ సాంగ్ కోసం ఏకంగా 13గంటలు రిహార్సిల్స్ చేశారట.. అది కూడా నాలుగు నెలల గర్భంతో ఆ సాంగ్ మరేదో కాదు డోలా రా డోలా.. ఈ సాంగ్ లో మాధురి అందం ఎక్స్ ప్రెషన్స్ అద్భుతంగా ఉంటాయి. అలాగే ఆమె స్టెప్స్ ఆకట్టుకుంటాయి. ఈ సాంగ్ లో మధురితో పాటు ఐశ్వర్య రాయ్ కూడా స్టెప్పులేస్తోంది. కాగా ఈ సాంగ్ రిహార్సిల్ సమయంలో మాధురి నాలుగు నెలల గర్భంతో ఉన్నారట. ఈ సాంగ్ దేవదాస్’ సినిమాలోది. ఈ సినిమాకు సంజయ్ లీల బన్సాలీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా అంత పెద్ద హిట్టు కొట్టడానికి మేయిన్ రీజన్‌లో ఈ సాంగ్ కూడా ఒకటి.

ఇది కూడా చదవండి :భర్తను దర్శకుడిని చేద్దాం అనుకుంది.. కానీ బెడిసికొట్టింది.. సంపాదించిందంతా పోగొట్టుకొని చివరకు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..
దేశంలోనే నెం.1.. విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డ్..
దేశంలోనే నెం.1.. విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డ్..
స్టవ్ లేకుండా ఎంతో రుచిగా చిటికెలో చేసుకునే పొలం పచ్చడి
స్టవ్ లేకుండా ఎంతో రుచిగా చిటికెలో చేసుకునే పొలం పచ్చడి
ఫిఫాలో ఈ వింత ఆచారాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..?
ఫిఫాలో ఈ వింత ఆచారాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..?
ఇంత ఓపిక ఎలా ఉందిరా నాయనా.. ఒకే కుటుంబంలో 200 మంది..
ఇంత ఓపిక ఎలా ఉందిరా నాయనా.. ఒకే కుటుంబంలో 200 మంది..
అటుకుల బియ్యం పాయసం.. అమృతమే తింటున్నంత కమ్మగా..
అటుకుల బియ్యం పాయసం.. అమృతమే తింటున్నంత కమ్మగా..
ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీ అసలు ధర తెలిస్తే మూర్ఛపోవాల్సిందే..?
ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీ అసలు ధర తెలిస్తే మూర్ఛపోవాల్సిందే..?
అత్యంత చౌకైన EV కారుపై రూ.80 వేలు తగ్గింపు.. 230 కి.మీ రేంజ్‌..!
అత్యంత చౌకైన EV కారుపై రూ.80 వేలు తగ్గింపు.. 230 కి.మీ రేంజ్‌..!
మహిళలకు మంచి రోజులు.. భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు..!
మహిళలకు మంచి రోజులు.. భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు..!