ప్రపంచ సంక్షోభం వేళ.. పారిస్‌లో ప్రధాని మోదీ-ట్రంప్ మధ్య వ్యూహాత్మక భేటీ!
మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఇరాన్ యుద్ధ మేఘాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా దౌత్యపరమైన కదలికలు వేగం పుంచుకున్నాయి. ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలోనే ముఖాముఖి భేటీ కానున్నారు. వచ్చే నెల జూన్ 15 - 17 మధ్య ఫ్రాన్స్‌లోని ఎవియన్‌లో జరగనున్న జీ-7 శిఖరాగ్ర సదస్సు ఇందుకు వేదిక కానుంది.

మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఇరాన్ యుద్ధ మేఘాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా దౌత్యపరమైన కదలికలు వేగం పుంచుకున్నాయి. ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలోనే ముఖాముఖి భేటీ కానున్నారు. వచ్చే నెల జూన్ 15 – 17 మధ్య ఫ్రాన్స్‌లోని ఎవియన్‌లో జరగనున్న జీ-7 శిఖరాగ్ర సదస్సు ఇందుకు వేదిక కానుంది.
ఆక్సియోస్ కథనం ప్రకారం, ప్రపంచాన్ని కుదిపేస్తున్న చమురు సంక్షోభం, మధ్యప్రాచ్య సంఘర్షణల నడుమ ట్రంప్, మోదీల మధ్య జరగనున్న తొలి సమావేశం ఇదే కావడం విశేషం. ఈ సదస్సులో పాల్గొనేందుకు ఇద్దరు నేతలూ పారిస్ చేరుకోనున్నారు. జీ-7 సదస్సుకు మోదీ హాజరవుతున్నట్లు ఫ్రాన్స్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇప్పటికే అధికారికంగా ధృవీకరించింది. భారతదేశం జీ-7లో పూర్తిస్థాయి సభ్యదేశం కాకపోయినప్పటికీ, ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉన్నందున ఫ్రాన్స్ దీనిని ప్రత్యేక భాగస్వామ్య దేశంగా ఆహ్వానించింది.
ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్ చివరిసారిగా 2025 ఫిబ్రవరిలో వాషింగ్టన్‌లో భేటీ అయ్యారు. దాదాపు 16 నెలల తర్వాత వీరిద్దరూ మళ్లీ కలుస్తున్నారు. గతంలో మోదీ అమెరికా పర్యటన ముగిసిన కొద్దిరోజులకే, రష్యా నుండి చమురు కొనుగోలు చేసినందుకు శిక్షగా భారత్‌పై ట్రంప్ సుంకాలు విధించారు. ఇది ఇరు దేశాల సంబంధాల మధ్య తాత్కాలిక చీలికకు దారితీసింది. అయితే, ఇటీవలే ఇరు దేశాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంతో ఈ విభేదాలు సమసిపోయాయి.
ప్రస్తుత గ్లోబల్ గందరగోళం నడుమ జరగబోయే ఈ భేటీలో ప్రధానంగా కింది అంశాలపై దృష్టి సారించనున్నారు. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి దిగ్బంధనం. ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన ఈ మార్గం మూసుకుపోవడంపై ప్రధాన చర్చలు జరగనున్నాయి. ఇరాన్ ఉద్రిక్తతల వల్ల ముడిచమురు ధరలు పెరగకుండా తీసుకోవాల్సిన చర్యలు, యుద్ధ వాతావరణం వల్ల ఏర్పడుతున్న ఆర్థిక సవాళ్లను అధిగమించడంపై ఇరువురు నేతలు మంతనాలు జరపనున్నారు. ఈ దౌత్యపరమైన పరిణామాలు భారత్-అమెరికా బంధాన్ని బలోపేతం చేయడమే కాకుండా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
