Health Tips: శీతాకాలంలో ముల్లంగిని ఇలా వండుకుని తింటే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు..

మంచి ఆహారం మంచి ఆరోగ్యాన్ని పెంపోందిస్తుంది. మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్దేశిస్తుంది. అందుకే ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని..

Health Tips: శీతాకాలంలో ముల్లంగిని ఇలా వండుకుని తింటే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు..
Radish Recipes
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 21, 2022 | 4:52 PM

మంచి ఆహారం మంచి ఆరోగ్యాన్ని పెంపోందిస్తుంది. మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్దేశిస్తుంది. అందుకే ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తుంటారు వైద్యులు, ఆరోగ్య నిపుణులు. కాదని రుచి కోసం వెంపర్లాడితే ఆస్పత్రులకు బిల్లులు కట్టాల్సి వస్తుందని అంటున్నారు. సాధారణంగా ప్రజలను సీజనల్ వ్యాధులు వేధిస్తుంటాయి. ఆ వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవడం తప్పనిసరి. కొన్ని ఆహార పదార్థాలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాంటి వాటిలో ముల్లంగి ఒకటి.

ముల్లంగిలో అవసరమైన విటమన్లు, ఖనిజాలు, పోషక సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. చలికాలంలో ముల్లంగిని తీసుకోవడం వలన ఆరోగ్యం మరింత పెరుగుతుందని చెబుతున్నారు వైద్యులు. ఆయుర్వేదం ప్రకారం ముల్లంగి అనేక అనారోగ్యాలను నయం చేస్తుంది. ముల్లంగిని 5 రకాలుగా, రుచికరమైన వంటకాలను చేసుకుని ఆహారంలో తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ వంటకాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ముల్లంగి పరోటా..

గోధుమ పిండి, నెయ్యి కలపాలి. మరో గిన్నెలో తురిమిన ముల్లంగి, కొత్తిమీర తరుగు, తరిగిన అల్లం, పచ్చిమిర్చి, నిమ్మరసం, ఉప్పు వేసి కలపాలి. పిండిని దీపం కుందులు మాదిరిగా చేయాలి. ఒక్కోదాంట్లో ముల్లంగి మిశ్రమాన్ని వేసి, క్లోజ్ చేయాలి. ఆ స్టఫ్డ్ బాల్‌లను చపాతీ ఆకారంలో రోల్ చేయాలి. ఆ పరోటాలను నెయ్యి అద్ది తవాలో గోధుమ రంగు వచ్చే వరకు కాల్చి, పెరుగుతో వేడి వేడిగా తింటే టేస్టీకి టేస్టీ, ఆరోగ్యానికి ఆరోగ్యం సొంతమవుతుంది.

ఇవి కూడా చదవండి

ముల్లంగి కూర..

శనగపిండి, కొత్తిమీర, జీలకర్ర పొడి, ఎర్ర మిరప పొడి, పసుపు పొడి, ఉప్పు, నూనె కలపాలి. ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత నూనెలో ఆవాలు వేయించాలి. ఆ తరువాత ఇంగువ, తరిగిన ముల్లంగి వేసి బాగా వేయించాలి. ముల్లంగి ఆకులు వేసి మళ్లీ వేయించాలి. అప్పుడప్పుడు కలుపుతూ రెండు నిమిషాల పాటు మూతపెట్టి ఉడికించాలి. కాసేపటి తరువాత బేసన్ మిశ్రమాన్ని వేసి మూత పెట్టాలి. అప్పుడప్పుడు కలుపుతూ మరో రెండు నిమిషాల పాటు ఉడికించాలి. ముల్లంగి కూర రెడీ అవుతుంది. ఈ కూరను రోటీలు, పరాటాలతో కలిపి తింటే అద్భుతంగా ఉంటుంది. ముల్లంగి కూర, పరోటాతో తింటే శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. చలికాలంలో దీనిని తింటే మరిన్ని ప్రయోజనాలు ఉంటాయి.

ముల్లంగి, పప్పు కూర..

ప్రెజర్ కుక్కర్‌లో తరిగిన ముల్లంగి, పప్పు, ఉప్పు, పసుపు పొడి, నీటిని కలపాలి. మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. జీలకర్ర, బే ఆకు, లవంగాలను నెయ్యిలో కొన్ని సెకన్ల పాటు వేయించాలి. పచ్చిమిర్చి, అల్లం, ఎర్ర మిరపకాయ, ఇంగువ, ఉడికించిన ముల్లంగి మిశ్రమం, నీరు వేసి, అప్పుడప్పుడు కలుపుతూ రెండు-మూడు నిమిషాలు ఉడికించాలి. తరిగిన కొత్తిమీర వేసి బాగా కలపాలి. ముల్లంగి పప్పు రెడీ. వేడి వేడిగా, కాస్త నెయ్యి వేసుకుని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది.

ముల్లంగి ఖీర్..

తురిమిన ముల్లంగిని వేడి నీటిలో ఉడకబెట్టి, వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్‌లో పాలు పోసి మరిగించాలి. అందులో ఏలకుల పొడి, బే ఆకులు వేసి ఉడికించాలి. ముల్లంగిని నెయ్యిలో వేసి వేయించాలి. ఆ తరువాత పాలలో వేసి బాగా కలపాలి. కుంకుమ పువ్వు, పాల మిశ్రమం వేసి మరిగించాలి. నెయ్యిలో వేయించిన జీడిపప్పు, ఎండుద్రాక్ష, బాదం, తురిమిన కొబ్బరి వేసి, కొన్ని నిమిషాలపాటు ఉడికించాలి. ఇందులో బెల్లం పొడి, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపాలి. వేడి వేడి ముల్లంగి ఖీర్ రెడీ అయినట్లే. టేస్టీ, హెల్తీ ఖీర్‌ను గుటకలు వేసుకుంటూ తినేయొచ్చు. ఈ ఖీర్, శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది.

ముల్లంగి సూప్..

ముల్లంగి ముక్కలను ఒక పాన్‌లో వేసి వేయించాలి. గరం మసాలా పొడి, నీళ్లతో కలిపి ముల్లంగి ముక్కలు మెత్తగా మారే వరకు బాగా ఉడికించాలి. ఉడికిన ముల్లంగి ముక్కలను గుజ్జుగా కలపాలి. ఆ తరువాత వడకట్టాలి. వడకట్టిన ముల్లంగి ద్రవంలో నీరు, మిరియాల పొడి కాలపాలి. ఈ సూప్‌ను మళ్లీ 5 నిమిషాలు ఉడికించాలి. తరిగిన కొత్తిమీర ఆకులు, ముల్లంగి ముక్కలతో ఆ సూప్‌ను అలంకరించాలి. శీతాకాలంలో రాత్రి వేళ వేడి వేడిగా తాగితే మంచి ప్రయోజనాలు ఉంటాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

పుష్ప వైల్డ్ ఫైర్‌.. మేనియా మామూలుగా లేదుగా.! షేక్.. అవ్వాల్సిందే
పుష్ప వైల్డ్ ఫైర్‌.. మేనియా మామూలుగా లేదుగా.! షేక్.. అవ్వాల్సిందే
మీరు బంగారంపై రుణం తీసుకుంటున్నారా? ఇక EMIలో చెల్లింపులు!
మీరు బంగారంపై రుణం తీసుకుంటున్నారా? ఇక EMIలో చెల్లింపులు!
ఓర్నాయనో.. మార్కెట్‌లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంటున్నారా..?
ఓర్నాయనో.. మార్కెట్‌లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంటున్నారా..?
విశ్వక్ సేన్ వీరంగం రాకీకి హెల్ప్ అవుతుందా? కాంట్రవర్శీ అవుతుందా?
విశ్వక్ సేన్ వీరంగం రాకీకి హెల్ప్ అవుతుందా? కాంట్రవర్శీ అవుతుందా?
ఒక్క అరటిపండు రూ.8 కోట్లు.. వేలంలో రికార్డు ధర స్పెషాలిటీ ఏమిటంటే
ఒక్క అరటిపండు రూ.8 కోట్లు.. వేలంలో రికార్డు ధర స్పెషాలిటీ ఏమిటంటే
ఓరుగల్లు గడ్డపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శపథం..!
ఓరుగల్లు గడ్డపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శపథం..!
నయన్ గురించి షాకింగ్ విషయం చెప్పిన ధనుష్
నయన్ గురించి షాకింగ్ విషయం చెప్పిన ధనుష్
ఈ ప్రదేశాలు ప్రకృతి అందాలతో కనుల విందు.. ఒక్కసారైనా చూడాల్సిందే..
ఈ ప్రదేశాలు ప్రకృతి అందాలతో కనుల విందు.. ఒక్కసారైనా చూడాల్సిందే..
చేతులు కాలక ఆకులు పట్టుకున్నట్టుగా ఉంది భారతీయుడు 2 మేకర్స్ పరిస్
చేతులు కాలక ఆకులు పట్టుకున్నట్టుగా ఉంది భారతీయుడు 2 మేకర్స్ పరిస్
రిసార్ట్ స్విమ్మింగ్‌పూల్‌లో ఈతకెళ్లిన ముగ్గురు యువతుల.. చివరకు
రిసార్ట్ స్విమ్మింగ్‌పూల్‌లో ఈతకెళ్లిన ముగ్గురు యువతుల.. చివరకు
ఓరుగల్లు గడ్డపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శపథం..!
ఓరుగల్లు గడ్డపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శపథం..!
కుంభకర్ణుడిది అతి నిద్ర కాదట! పురాణ కథపై కొత్త ట్విస్ట్!
కుంభకర్ణుడిది అతి నిద్ర కాదట! పురాణ కథపై కొత్త ట్విస్ట్!
ఓట్లు వేయమని ఎంపీ ముఖం మీదే చెప్పిన మహిళ ..!
ఓట్లు వేయమని ఎంపీ ముఖం మీదే చెప్పిన మహిళ ..!
కాలరెగరేస్తున్న డాలర్.. మరి రూపాయి పరిస్థితి ఏంటి.?
కాలరెగరేస్తున్న డాలర్.. మరి రూపాయి పరిస్థితి ఏంటి.?
ఆమె మళ్లీ వచ్చింది .. పార్లమెంట్‌ దద్దరిల్లింది.! ఎంపీ డాన్స్
ఆమె మళ్లీ వచ్చింది .. పార్లమెంట్‌ దద్దరిల్లింది.! ఎంపీ డాన్స్
నిద్ర లేవగానే సెల్‌ఫోన్‌ చూస్తున్నారా.? నిపుణులు చెప్పినవి వింటే
నిద్ర లేవగానే సెల్‌ఫోన్‌ చూస్తున్నారా.? నిపుణులు చెప్పినవి వింటే
ఆ 4 వేల మందిని గనిలోనే సమాధి చేస్తారా.? మూసిన బంగారు గనిలో చిక్కు
ఆ 4 వేల మందిని గనిలోనే సమాధి చేస్తారా.? మూసిన బంగారు గనిలో చిక్కు
శివుడు కనిపిస్తాడని వెళ్తే.. ఎలుగుబంట్లు భయపెట్టాయి.! వీడియో..
శివుడు కనిపిస్తాడని వెళ్తే.. ఎలుగుబంట్లు భయపెట్టాయి.! వీడియో..
ఆ పులి.. ఈ పులేనా.? వైరల్‌ అవుతున్న పెద్దపులి వీడియో..
ఆ పులి.. ఈ పులేనా.? వైరల్‌ అవుతున్న పెద్దపులి వీడియో..
మంచుకొండపై మండుతున్న లావా.! ఐస్ ల్యాండ్ లో అగ్ని పర్వతం బ్లాస్ట్!
మంచుకొండపై మండుతున్న లావా.! ఐస్ ల్యాండ్ లో అగ్ని పర్వతం బ్లాస్ట్!