AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Electric Planes: ఆకాశంలో ఎగరనున్న ఎలక్ట్రిక్ విమానాలు.. అయితే, ఇంకొంతకాలం వెయిట్ చేయాల్సిందే..

ఆకాశంలో విహరించాలనే మానవుని స్వప్నం 1907లో ఫలించింది. రైట్‌ బ్రదర్స్‌ ఆవిష్కరించిన విమానం ప్రస్తుత రూపాన్ని సంతరించుకునేందుకు కొన్నేళ్ల సమయం..

Electric Planes: ఆకాశంలో ఎగరనున్న ఎలక్ట్రిక్ విమానాలు.. అయితే, ఇంకొంతకాలం వెయిట్ చేయాల్సిందే..
Electric Planes
Shiva Prajapati
|

Updated on: Oct 20, 2022 | 10:25 PM

Share

ఆకాశంలో విహరించాలనే మానవుని స్వప్నం 1907లో ఫలించింది. రైట్‌ బ్రదర్స్‌ ఆవిష్కరించిన విమానం ప్రస్తుత రూపాన్ని సంతరించుకునేందుకు కొన్నేళ్ల సమయం పట్టింది. దేశీయంగా, అంతర్జాతీయంగా వేలాది విమానాలు ప్రతినిత్యం ప్రయాణీకులను చేరవేస్తున్నాయి. ఇందు కోసం ఉపయోగిస్తున్న ఎయిర్‌ ఫ్యూయల్‌తో వాతావరణ కాలుష్య సమస్యలు కూడా పెరిగిపోతున్నాయి. పెరిగిపోతున్న కర్బణ ఉద్గారాలను తగ్గించే దిశగా ఇప్పటికే విద్యుత్‌తో నడిచే రైళ్లు, బైక్స్‌, కార్లు, బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ఈ దశలో విద్యుత్‌ విమానాలను కూడా తేగలమా అనే ప్రశ్నకు అవుననే సమాధానం ఇచ్చింది బ్రిటన్‌కు చెందిన వర్టికల్ ఏరోస్పేస్‌.

2016లో వెర్టికల్ ఏరోస్పేస్ ఎలక్ట్రిక్ ఏవియేషన్‌ను స్టీఫెన్ ఫిట్జ్‌ప్యాట్రిక్ ప్రారంభించారు. ఈ సంస్థ విద్యుత్‌తో నడిచే విమానం ఆవిష్కరణపై జరుపుతున్న ప్రయోగాలు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఎలక్ట్రిక్ VX4 ప్రోటోటైప్ పేరుతో మొట్టమొదటి ఎయిర్‌బోర్న్ పరీక్షను విజయవతంగా నిర్వహించింది. వర్టికల్ ఏరోస్పేస్ గత 20 ఏళ్లలో కొత్త ఎయిర్‌క్రాఫ్ట్‌తో బయలుదేరిన మొదటి బ్రిటిష్ కంపెనీగా అవతరించిందని తెలిపారు స్టీఫెన్ ఫిట్జ్‌పాట్రిక్. తాను రూపొందిస్తున్న విమానం పూర్తిగా కార్బన్ రహిత విమానం అని తెలిపారు. 2050 సంవత్సరం నాటికి కాలుష్య రహిత విమానయానం జరగాలని గతంలో ఐక్యరాజ్య సమితి లక్ష్యంగా ప్రకటించింది.. దీన్ని తాము నిజం చేస్తామని ప్రకటించింది వర్టికల్ ఏరోస్పేస్‌.. బ్రిటన్‌ సివిల్‌ ఏవియేషన్‌ సివిల్ ఏవియేషన్ అథారిటీ 2025లో తమ VX4 విమానం ‘ప్లై టు పర్మిట్’ అనుమతి పొందుతుందని భావిస్తోంది ఈ కంపెనీ.

ఇవి కూడా చదవండి

మరిన్ని సైన్స్&టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..