AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight loss: బరువు తగ్గాలనుకునే వారు ఇవి తినాలంట.. కండీషన్స్ అప్లై..

పోషకాహారం తీసుకోవాలనుకునే వారు ఎక్కువుగా గుడ్లు తీసుకుంటారు. అయితే బరువు తగ్గాలనుకునే వారు కూడా గుడ్లు తినాలని, అయితే తినే విధానం కూడా చాలా ముక్యమంటున్నారు పోషకాహార నిపుణులు. ఊబకాయం అనేది శరీరంలో..

Weight loss: బరువు తగ్గాలనుకునే వారు ఇవి తినాలంట.. కండీషన్స్ అప్లై..
Eggs
Amarnadh Daneti
|

Updated on: Oct 22, 2022 | 5:15 PM

Share

పోషకాహారం తీసుకోవాలనుకునే వారు ఎక్కువుగా గుడ్లు తీసుకుంటారు. అయితే బరువు తగ్గాలనుకునే వారు కూడా గుడ్లు తినాలని, అయితే తినే విధానం కూడా చాలా ముక్యమంటున్నారు పోషకాహార నిపుణులు. ఊబకాయం అనేది శరీరంలో అనేక వ్యాధులకు దారితీసే సమస్య. స్థూలకాయం వల్ల శరీరంలో అనేక వ్యాధులు కూడా వస్తాయి. బరువు పెరుగడం వల్ల మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. మీరు కూడా స్థూలకాయంతో బాధపడుతూ ఉంటే.. బరువు తగ్గడానికి రోజూ గుడ్లు తినాలి అంటున్నారు పోషకాహార నిపుణులు. అయితే ఏ సమయంలో ఎలా తినాలనేది ముఖ్యమంటున్నారు పోషకాహార నిపుణులు. గుడ్డు అనేది ప్రోటీన్లు, విటమిన్లు, ఒమేగా-3 వంటి ఆరోగ్యకరమైన కొవ్వులతో కూడిన మంచి ఆహారం. బరువు తగ్గడానికి ప్రతిరోజూ అల్పాహారంగా గుడ్లు తినాలి. దీని వల్ల శరీరానికి అవసరమైన ప్రొటీన్లు అందుతాయని అంటున్నారు నిపుణులు. అనేక విధాలుగా గుడ్లు తినవచ్చు. ఉడకబెట్టి, ఆమ్లెట్, భుర్జీ, గుడ్డు కూర చేసి తినవచ్చు. గుడ్లు తింటే చాలా సేపు ఆకలిగా అనిపించదు. మీరు త్వరగా బరువు తగ్గాలంటే, గుడ్డులో ఈ 3 పదార్థాలను కలిపి తినాలని సూచిస్తున్నారు.

పోషకాహారానికి మూలం గుడ్డు

గుడ్లు ప్రోటీన్​కు అద్భుతమైన మూలం. గుడ్లు తక్కువ కేలరీలు, అధిక ప్రోటీన్ కలిగి ఉంటాయి. గుడ్లు సరైన నిష్పత్తిలో అన్ని అవసరమైన అమైనో ఆమ్లాలను కలిగి ఉంటాయి. కాబట్టి శరీరాలు వాటిలోని ప్రోటీన్‌ను పూర్తిగా ఉపయోగించుకోవడానికి సహాయం చేస్తాయి. తగినంత ప్రోటీన్ తినడం బరువు తగ్గడానికి, రక్తపోటును తగ్గించడానికి, ఎముక ఆరోగ్యాన్ని ఆప్టిమైజ్ చేయడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

ప్రతిరోజూ ఒక గుడ్డును తినడం మంచిది. అల్పాహారంగా వీటిని తీసుకోవచ్చు. ఇది రోజులో అత్యంత ముఖ్యమైన భోజనం కూడా అవుతుంది. ఖనిజాలు, విటమిన్లలతో కూడిన బ్రేక్​ఫాస్ట్ కచ్చితంగా మెరుగైనదనే చెప్పుకోవాలి. గుడ్లు జీవక్రియను పెంచుతాయి. ఎగ్స్ శరీరానికి అవసరమైన అన్ని ముఖ్యమైన అమైనో ఆమ్లాల మంచి సమతుల్యతను కలిగి ఉంటాయి. అంటే శరీరం గుడ్లలోని ప్రోటీన్‌ను నిర్వహణ, జీవక్రియ కోసం సులభంగా ఉపయోగించవచ్చు. గుడ్లతో రెసిపీలు తయారు చేయడం చాలా సులభం. ఈ సూపర్‌ఫుడ్‌ను వివిధ విధాలుగా తయారు చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..

Follow Us
8 నెలల తర్వాత గుర్తొచ్చిన వాదన.. మీనాక్షికి నష్టం చేసిందెవరు?
8 నెలల తర్వాత గుర్తొచ్చిన వాదన.. మీనాక్షికి నష్టం చేసిందెవరు?
పాము–ఎలుక స్నేహం.. బద్ధ శత్రువులు ఫ్రెండ్స్ ఎలా అయ్యాయి..?
పాము–ఎలుక స్నేహం.. బద్ధ శత్రువులు ఫ్రెండ్స్ ఎలా అయ్యాయి..?
జస్ట్ రూ.10 ఖర్చుతో బాత్రూమ్ టైల్స్, ట్యాప్‌లు మిల మిల మెరుస్తాయ్
జస్ట్ రూ.10 ఖర్చుతో బాత్రూమ్ టైల్స్, ట్యాప్‌లు మిల మిల మెరుస్తాయ్
మెల్లకన్ను ఉన్నవారు ఈ పల్లెటూరి ఆకుల సూప్ తాగితే.. చూపు మరింత
మెల్లకన్ను ఉన్నవారు ఈ పల్లెటూరి ఆకుల సూప్ తాగితే.. చూపు మరింత
‘వర్క్ ఫ్రమ్ బైక్’ యువకుడికి సీపీ స్ట్రాంగ్ వార్నింగ్
‘వర్క్ ఫ్రమ్ బైక్’ యువకుడికి సీపీ స్ట్రాంగ్ వార్నింగ్
ఎంతకు తెగించార్రా..? ఏటీఎం మెషిన్ ఎత్తుకెళ్లేందుకు యత్నం..
ఎంతకు తెగించార్రా..? ఏటీఎం మెషిన్ ఎత్తుకెళ్లేందుకు యత్నం..
అప్పుడు తోపు నటుడు.. ఇప్పుడు వాచ్‌మెన్‌గా..
అప్పుడు తోపు నటుడు.. ఇప్పుడు వాచ్‌మెన్‌గా..
పచ్చి కూరగాయల రోటి పచ్చడి.. పండుగల సమయంలో రైతులకు ఇదే పరమాన్నం
పచ్చి కూరగాయల రోటి పచ్చడి.. పండుగల సమయంలో రైతులకు ఇదే పరమాన్నం
వారెవ్వా.. బిల్డింగ్ పైనుంచి పడిపోతున్న చిన్నారిని గాల్లోనే..
వారెవ్వా.. బిల్డింగ్ పైనుంచి పడిపోతున్న చిన్నారిని గాల్లోనే..
మీరేం మనుషులురా..? అప్పు ఇవ్వలేదని ఫ్రెండ్‌నే చంపేశారు..
మీరేం మనుషులురా..? అప్పు ఇవ్వలేదని ఫ్రెండ్‌నే చంపేశారు..