Alert: రేషన్‌ కార్డుదారులకు ముఖ్య గమనిక.. ఉచిత బియ్యం పొందాలంటే.. ఇకపై ఇలా చేయాల్సిందే..

మీరు రేషన్ కార్డుదారుడు అయిండి.. ప్రభుత్వ రేషన్ పధకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నట్లయితే..? ఈ ముఖ్య గమనిక మీకోసమే.

Alert: రేషన్‌ కార్డుదారులకు ముఖ్య గమనిక.. ఉచిత బియ్యం పొందాలంటే.. ఇకపై ఇలా చేయాల్సిందే..
Ration Card
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 22, 2022 | 2:08 PM

మీరు రేషన్ కార్డుదారుడు అయిండి.. ప్రభుత్వ రేషన్ పధకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నట్లయితే..? ఈ ముఖ్య గమనిక మీకోసమే. ప్రజాపంపిణీ వ్యవస్థ కింద సామాన్యులకు ఇచ్చే రేషన్‌ నిబంధనల్లో ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది. ఇప్పుడు రేషన్ పొందేందుకు లబ్ధిదారులు ఒకసారి కాదు రెండు సార్లు బొటన వేలి ముద్ర వేయాల్సి ఉంది. ఈ నిబంధనను తాజాగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చింది.

దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రతి వ్యక్తికి కేంద్రం, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు ఐదేసి కిలోల చొప్పున నిత్యావసర వస్తువులు ఇస్తున్నాయి. దీంతో ఈ సదుపాయాన్ని పొందే లబ్దిదారులు.. ఇకపై తన బొటనవేలు ముద్రలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పేరుతో రెండుసార్లు వేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం, లబ్ధిదారుడు తన బొటనవేలు ముద్రను నమోదు చేసిన తర్వాత సంబంధిత రేషన్ కేంద్రాల్లో నిత్యావసర వస్తువులు పొందుతున్నాడు. అయితే అక్టోబర్‌ నుంచి ఈ విధానంలో పలు మార్పులు చేసింది మధ్యప్రదేశ్ సర్కార్. మరోవైపు ఈ నిర్ణయంపై ఆ రాష్ట్ర ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

కాగా, ఈ నిర్ణయం పట్ల ప్రభుత్వం వివరణ ఇలా ఉంది. టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్(TPDS) పారదర్శకతను మెరుగుపరచడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA) ప్రకారం, దేశంలోని దాదాపు 80 కోట్ల మంది ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి ఐదు కిలోల గోధుమలు, బియ్యం(ఆహారధాన్యాలు) కిలోకు వరుసగా రూ. 2-3 చొప్పున సబ్సిడీపై అందజేస్తోన్న విషయం విదితమే.

ఓరుగల్లు గడ్డపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శపథం..!
ఓరుగల్లు గడ్డపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శపథం..!
కుంభకర్ణుడిది అతి నిద్ర కాదట! పురాణ కథపై కొత్త ట్విస్ట్!
కుంభకర్ణుడిది అతి నిద్ర కాదట! పురాణ కథపై కొత్త ట్విస్ట్!
ఓట్లు వేయమని ఎంపీ ముఖం మీదే చెప్పిన మహిళ ..!
ఓట్లు వేయమని ఎంపీ ముఖం మీదే చెప్పిన మహిళ ..!
కాలరెగరేస్తున్న డాలర్.. మరి రూపాయి పరిస్థితి ఏంటి.?
కాలరెగరేస్తున్న డాలర్.. మరి రూపాయి పరిస్థితి ఏంటి.?
ఆమె మళ్లీ వచ్చింది .. పార్లమెంట్‌ దద్దరిల్లింది.! ఎంపీ డాన్స్
ఆమె మళ్లీ వచ్చింది .. పార్లమెంట్‌ దద్దరిల్లింది.! ఎంపీ డాన్స్
నిద్ర లేవగానే సెల్‌ఫోన్‌ చూస్తున్నారా.? నిపుణులు చెప్పినవి వింటే
నిద్ర లేవగానే సెల్‌ఫోన్‌ చూస్తున్నారా.? నిపుణులు చెప్పినవి వింటే
ఆ 4 వేల మందిని గనిలోనే సమాధి చేస్తారా.? మూసిన బంగారు గనిలో చిక్కు
ఆ 4 వేల మందిని గనిలోనే సమాధి చేస్తారా.? మూసిన బంగారు గనిలో చిక్కు
శివుడు కనిపిస్తాడని వెళ్తే.. ఎలుగుబంట్లు భయపెట్టాయి.! వీడియో..
శివుడు కనిపిస్తాడని వెళ్తే.. ఎలుగుబంట్లు భయపెట్టాయి.! వీడియో..
ఆ పులి.. ఈ పులేనా.? వైరల్‌ అవుతున్న పెద్దపులి వీడియో..
ఆ పులి.. ఈ పులేనా.? వైరల్‌ అవుతున్న పెద్దపులి వీడియో..
మంచుకొండపై మండుతున్న లావా.! ఐస్ ల్యాండ్ లో అగ్ని పర్వతం బ్లాస్ట్!
మంచుకొండపై మండుతున్న లావా.! ఐస్ ల్యాండ్ లో అగ్ని పర్వతం బ్లాస్ట్!