AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bharat Jodo Yatra: 375 కిలోమీటర్లు.. 13 రోజులు.. తెలంగాణలోకి రాహుల్ భారత్ జోడో యాత్ర ఎంట్రీ..

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మరికాసేపట్లో తెలంగాణలోకి ప్రవేశించనుంది. మక్తల్ గుడి బెల్లూరు నుంచి రాహుల్ పాదయాత్ర ప్రారంభించనున్నారు.

Bharat Jodo Yatra: 375 కిలోమీటర్లు.. 13 రోజులు.. తెలంగాణలోకి రాహుల్ భారత్ జోడో యాత్ర ఎంట్రీ..
Rahul Gandhi
Shaik Madar Saheb
|

Updated on: Oct 23, 2022 | 8:09 AM

Share

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మరికాసేపట్లో తెలంగాణలోకి ప్రవేశించనుంది. మక్తల్ గుడి బెల్లూరు నుంచి రాహుల్ పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఆదివారం ఉదయం కర్ణాటకలోని రాయచూర్ ఎర్మాసూర్ నుంచి రాహుల్ పాదయాత్ర ప్రారంభించారు. అనంతరం కృష్ణా నదిపైనున్న బ్రిడ్జి నుంచి తెలంగాణలోకి ప్రవేశించనున్నారు. తెలంగాణలో తొలిరోజు 5 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగనుంది. గుడి బెల్లూరులో పాదయాత్ర ప్రారంభించడంతోపాటు.. రాహుల్ 10గంటలకు సభలో ప్రసంగించనున్నారు. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింభించేలా రాహుల్‌ను స్వాగతించనున్నారు. ముందుగా తెలంగాణలోకి ప్రవేశించేముందు.. రాహుల్ గాంధీకి జాతీయ జెండాను అందించి కాంగ్రెస్ శ్రేణులు.. స్వాగతం పలకనున్నారు. ఇప్పటికే.. భారీగా చేరుకున్నారు. ఈ మేరకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

కాగా.. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని.. భారత్ జోడో యాత్రకు మూడురోజులపాటు విరామం ఇవ్వనున్నారు. తెలంగాణలో తొలిరోజు యాత్ర అనంతరం రాహుల్ ఢిల్లీకి పయనం కానున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే 26 ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కూడా రాహుల్ హాజరుకున్నారు. 24, 25, 26 విరామం అనంతరం.. 27 నుంచి రాహుల్ గాంధీ తెలంగాణలో పాదయాత్ర చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

బ్రేక్ అనంతరం రాహుల్ భారత్ జోడో యాత్ర 27 నుంచి తెలంగాణలో కొనసాగనుంది. దీనికోసం ఇప్పటికే రూట్ మ్యాప్ కూడా ఖరారైంది. మొత్తం 13 రోజుల పాటు 375 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. ఈ పాదయాత్ర.. మక్తల్‌ నుంచి హైదరాబాద్ మీదుగా మద్నూర్ వరకు కొనసాగనుంది. నవంబర్ 7 వరకు పాదయాత్ర కొనసాగనుంది.

తెలంగాణ వార్తల కోసం..

ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?
బుమ్రా లేని లోటు తీర్చడానికి బాస్ వస్తున్నాడు
బుమ్రా లేని లోటు తీర్చడానికి బాస్ వస్తున్నాడు