Police Open House: ప్రకాశం, వరంగల్ జిల్లా పోలీసుల వినూత్న ప్రయోగం.. విద్యార్థుల కోసం ఓపెన్ హౌస్ ప్రదర్శన..
చట్టాలు, ఆయుధాల మీద అవగాహన కోసం ప్రకాశం, వరంగల్ జిల్లా పోలీసుల వినూత్న ప్రయోగం చేశారు. ఓపెన్ హౌస్ ప్రదర్శన ఏర్పాటు చేసి.. విద్యార్ధులకు చక్కటి అవకాశాన్ని..
చట్టాలు, ఆయుధాల మీద అవగాహన కోసం ప్రకాశం, వరంగల్ జిల్లా పోలీసుల వినూత్న ప్రయోగం చేశారు. ఓపెన్ హౌస్ ప్రదర్శన ఏర్పాటు చేసి.. విద్యార్ధులకు చక్కటి అవకాశాన్ని కల్పించారు. వాస్తవానికి శాంతిభద్రతలు కాపాడటం కోసం పోలీస్ డిపార్ట్‌మెంట్ ఎంతో కష్టపడుతుంది. వాళ్లు వేసుకున్న యూనిఫామ్ వాళ్లకు గౌరవం అయితే.. చేతిలో పట్టుకునే ఆయుధమే వాళ్ల బలం. పోలీసులు వాడే ఆయుధాలతో పాటు అనేక పరికరాలు.. ఎలా ఉంటాయి. అవి ఎలా పనిచేస్తాయనేది తెలుసుకోవాలని చాలామందికి ఆసక్తి ఉంటుంది. వారి కోసమే ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లిక గార్గ్ వినూత్నంగా ఆలోచించారు. నగరంలోని పోలీస్ కళ్యాణమండపంలో ఓపెన్ హౌస్ ప్రదర్శన ఏర్పాటు చేశారు. పోలీసులు వాడే ఆయుధాలు, కవచాలు, ఆధునిక సాంకేతిక పరికరాలను ప్రదర్శించారు. వాటిపై విద్యార్ధులకు అవగాహన కల్పించారు.
శాంతిభద్రతల పరిరక్షణతో పాటు కేసుల దర్యాప్తులో.. పోలీసులు ఉపయోగించే ఆయుధాలు, రక్షణ పరికరాలను వివరించారు. ఆయుధాలతో పాటు వాటి విడి భాగాలు, మెటల్ డిటెక్టర్, డ్రాగన్ లైట్, రాకెట్ లాంచర్, బాంబు డిస్పోజల్ పరికరాలు, ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ నెట్‌వర్క్ సిస్టమ్, పోలీస్ కంట్రోల్ రూమ్ పరికరాలు, కమ్యూనికేషన్ మ్యాన్ ప్యాక్ సెట్‌లు, డాగ్ స్క్వాడ్, సెల్ జామర్లతో పాటు దిశ వాహనాలు, దిశ యాప్, ట్రాఫిక్ నియమాల గురించి విద్యార్థులకు వివరించారు.
అటు వరంగల్‌లోనూ ఇలాంటి కార్యక్రమమే చెపట్టారు. మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. పోలీసుల రికార్డులతో పాటు ఖైదీలను బంధించే బందిఖానాలను విద్యార్థులకు చూపించి అవగాహన కల్పించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్&తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..