Vijayawada: బెజవాడలో రెచ్చిపోయిన లోకల్ లీడర్.. ఓ కంపెనీ సిబ్బందిపై దౌర్జన్యం..

బెజవాడలో లోకల్‌ లీడర్‌ రెచ్చిపోయాడు. ఓ కంపెనీ సిబ్బందిపై దౌర్జన్యానికి దిగాడు. తనను కాదని కాంట్రాక్ట్‌ ఎలా చేస్తారంటూ వీరంగం ఆడాడు చోటా లీడర్‌.

Vijayawada: బెజవాడలో రెచ్చిపోయిన లోకల్ లీడర్.. ఓ కంపెనీ సిబ్బందిపై దౌర్జన్యం..
Vijayawada Contractor Attack
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 22, 2022 | 10:43 PM

బెజవాడలో లోకల్‌ లీడర్‌ రెచ్చిపోయాడు. ఓ కంపెనీ సిబ్బందిపై దౌర్జన్యానికి దిగాడు. తనను కాదని కాంట్రాక్ట్‌ ఎలా చేస్తారంటూ వీరంగం ఆడాడు చోటా లీడర్‌. అవును, విజయవాడలో ఓ కాంట్రాక్టర్‌ రెచ్చిపోయాడు. తానుండగా మీరెలా కాంట్రాక్ట్‌ చేస్తారంటూ ఓ కంపెనీ సిబ్బంది రౌడీయిజానికి దిగాడు. ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఈ ఇన్సిడెంట్‌ జరిగింది. విజయవాడ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో మరమ్మతు పనులు చేస్తోంది విశ్వాస్‌ ఇంజనీరింగ్‌ కంపెనీ. స్టేజ్‌-3లో బాయిలర్‌ రిపేర్‌ వర్క్‌ చేస్తోన్న ఉద్యోగులపై దౌర్జన్యానికి దిగాడు లోకల్‌ లీడర్‌ అండ్ కాంట్రాక్టర్.

విశ్వాస్‌ ఇంజనీరింగ్‌ కంపెనీ వాహనంపై ఎటాక్‌ చేయడంతోపాటు గూండాగిరికి దిగాడు. దాంతో, ఉద్యోగులంతా భయాందోళనలకు గురయ్యారు. వాహనాన్ని అక్కడే వదిలేసి తలోవైపు పరుగులు తీశారు విశ్వాస్‌ ఇంజనీరింగ్‌ కంపెనీ సిబ్బంది. ఉద్యోగులు పారిపోవడంతో కంపెనీ వెహికల్‌ని ఎత్తుకెళ్లిపోయాడు కాంట్రాక్టర్‌. అనంతరం, ఆ కాంట్రాక్టర్‌పై ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్ చేశారు బాధితులు. తమపై దాడిచేసి బెదిరించాడని ఫిర్యాదు చేశారు.

లోకల్‌గా తానుండగా, మీ కంపెనీ ఎలా ఇక్కడికొచ్చి పనులు చేస్తుందంటూ భయపెట్టాడని కంప్లైంట్‌లో తెలిపారు. విశ్వాస్‌ ఇంజనీరింగ్‌ కంపెనీ సిబ్బంది కంప్లైంట్‌తో దర్యాప్తు మొదలుపెట్టారు పోలీసులు. దాడి చేసిన వ్యక్తి ఎవరనే తేల్చే పనిలో పడ్డారు. అయితే, ఈ ఇన్సిడెంట్‌, విజయవాడ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో కలకలం రేపింది. కాంట్రాక్ట్‌ దక్కించుకున్న కంపెనీ సిబ్బందిపై దాడి చేయడమేంటని చర్చించుకుంటున్నారు ఉద్యోగులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!