Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhanteras 2022: ధన్‌తేరస్‌ రోజున ఈ శుభ సమయంలో షాపింగ్ చేయండి.. ఏడాది మొత్తం మీ ఇంట్లో కనక వర్షమే..

ఇదే రోజును ధంతేరాస్ అని కూడా అంటారు. అందుకే దీపావళికి రెండు రోజుల ముందు వచ్చే ఈ పండుగకు చాలా విశిష్టత ఉంది. అయితే ఈ ఏడాది అక్టోబరు 23 ఆదివారం ధంతేరాస్ వస్తోంది. లక్ష్మి దేవికి ఎంతో ఇష్టమైనవాటిని..

Dhanteras 2022: ధన్‌తేరస్‌ రోజున ఈ శుభ సమయంలో షాపింగ్ చేయండి.. ఏడాది మొత్తం మీ ఇంట్లో కనక వర్షమే..
Dhanteras
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 09, 2022 | 7:48 AM

దీపావళికి రెండు రోజు ముందు వచ్చేదే ధనత్రయోదశి.. ఇదే రోజును ధంతేరాస్ అని కూడా అంటారు. అందుకే దీపావళికి రెండు రోజుల ముందు వచ్చే ఈ పండుగకు చాలా విశిష్టత ఉంది. అయితే ఈ ఏడాది అక్టోబరు 23 ఆదివారం ధంతేరాస్ వస్తోంది. లక్ష్మి దేవికి ఎంతో ఇష్టమైనవాటిని కొనుగోలు చేస్తుంటారు. దీపావళి ఈ సంవత్సరం అక్టోబర్ 24న జరుపుకుంటారు. ఇది ధన్‌తేరస్‌తో ప్రారంభమవుతుంది. ధంతేరస్, చోటి దీపావళి ఈసారి అక్టోబర్ 23న జరుపుకుంటారు. కార్తీక మాసంలోని కృష్ణ పక్షంలోని త్రయోదశి తిథి నాడు ధన్‌తేరస్ జరుపుకుంటారు. ఈ రోజున సముద్ర మథనం సమయంలో భగవంతుడు ధన్వంతరి కనిపించాడని నమ్ముతారు. ధంతేరస్ రోజున షాపింగ్ చేయడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.

ధన్‌తేరస్‌ ఎప్పుడు జరుపుకుంటారంటే..

ఆయుర్వేద విజ్ఞానానికి ధన్వంతరి ఆరాధ్య దైవం. క్షీరసాగర మథనం సమయంలో శ్రీమహా విష్ణువు అంశావతారంగా అమృత కలశహస్తుడై సమస్త ప్రజలకు రోగనివారణ ద్వారా ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ధన్వంతరి ఆవిర్భవించాడు. అందుకే ఈ రోజుకు చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఆరోగ్యానికి, ఔషధాలకి అధిపతి అయిన ధన్వంతరి జయంతి. అలా ధన్వంతరి ఆవిర్భవించిన ఆశ్వయుజ బహుళ త్రయోదశిని హిందువులు ధన త్రయోదశిగా జరుపుకుంటారు.

ధన్‌తేరస్‌ రోజు ఏ సమయంలో ఏం చేస్తే మంచిదంటే..

ఆశ్వయుజ కృష్ణ త్రయోదశి రోజు సూర్యోదయానికి ముందే నదీ స్నానం కాని లేదా సముద్ర స్నానం కాని ఆచరించడం మంచిది. గృహంలో కాని, నదీ లేదా సముద్ర తీరాలలో కాని, వైద్యశాలలో కాని తూర్పు దిక్కుగా కలశ స్థాపన చేసి ధన్వంతరికి ఆవాహన చెయ్యాలని పంచాగ కర్తలు సూచిస్తున్నారు.

ధన్వంతరిని ధ్యానించిన తర్వాత యధాశక్తి షోడశోపచార సహితంగా అర్చన జరపాలి. మత్స్యపురాణాంతర్గతమైన స్తోత్రాన్ని పఠించి, గరుడ పురాణాంతర్గతమైన ధన్వంతరి సార్థవ్రత కథను పారాయణ చేయాలి. వ్రత సమాప్త్యానంతరం ఇతర వైద్యులకి, పెద్దలకి తాంబూలం సమర్పించి, ఘృతయుక్తమైన పెసర పులగం నివేదన చేసి భుజించాలి. ఈ విధంగా వ్రతాన్ని ఆచరిస్తే ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చిరకాలం జీవిస్తారు.

అమ్మ లక్ష్మీ దేవి ఆశీస్సుల కోసం..

ఇక ఆ రోజున షాపింగ్ చేయడం వల్ల ధన్వంతరితో పాటు లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని కొందరు నమ్ముతారు. అయితే, ధన్‌తేరస్ రోజున షాపింగ్ చేయడానికి కూడా మంచి సమయం ఉంటుంది. ధన్‌తేరస్‌లో షాపింగ్ కోసం ఇంటి నుంచి బయలుదేరే ముందు, శుభ సమయం ఎప్పుడు అని తెలుసుకోండి.

  • కార్తీక మాసం కృష్ణ పక్ష త్రయోదశి తిథి ప్రారంభమవుతుంది – 22 అక్టోబర్ 2022, సాయంత్రం 6.02 నుండి..
  • కార్తీక మాసం కృష్ణ పక్ష త్రయోదశి తేదీ ముగుస్తుంది- 23 అక్టోబర్ 2022, సాయంత్రం 6.03..
  • పూజకు అనుకూలమైన సమయం – 23 అక్టోబర్ 2022 – సాయంత్రం 5.44 నుండి 06.05 వరకు.
  • శుభ ముహూర్తపు మొత్తం వ్యవధి – 21 నిమిషాలు.
  • ప్రదోషకాలం: సాయంత్రం 5:44 నుండి 8.16 వరకు.
  • వృషభ కాలం: సాయంత్రం 6:58 నుండి 8:54 వరకు.

ధనత్రయోదశి రోజున బంగారం ఎందుకు కొంటారంటే

ఇవాళ్టి రోజునే బంగారం ఎందుకు కొనుగోలు చేయాలి అనే ప్రశ్నను చాలా మంది వేస్తుంటారు. ఈ సెంటిమెంట్ వెనుకున్న కొన్ని పురాణ కథలు ఉన్నాయి.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మథనం చేస్తుండగా ఇదే రోజున లక్ష్మీదేవి ఆవిర్భవించిందట. అందుకే ఈ రోజు అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుందని విశ్వాసం. ఈ రోజున బంగారం, వెండి, పాత్రలు, వివిధ ఆభరణాలు కొనుగోలు చేయడం శుభ సూచకంగా భావిస్తారు. అందుకే ధంతేరాస్ వచ్చేసరికి బంగారం వెండి ధరలు ఎలా ఉన్నా.. సెంటిమెంట్‌ను కొనసాగిస్తుంటారు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.  నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం