Andhra Pradesh: దీపావళిని కూడా వదలని పొలిటికల్ లీడర్స్.. కమీషన్ల కోసం కాల్చుకుతింటున్న వైనం..
దీపావళిని కూడా వదలడం లేదు పొలిటికల్ లీడర్స్. షాపుల కేటాయింపులో కమీషన్ల కోసం వ్యాపారుల్ని కాల్చుకుని తింటున్నారు. కర్నూలులో దీపావళి క్రాకర్స్‌కి
దీపావళిని కూడా వదలడం లేదు పొలిటికల్ లీడర్స్. షాపుల కేటాయింపులో కమీషన్ల కోసం వ్యాపారుల్ని కాల్చుకుని తింటున్నారు. కర్నూలులో దీపావళి క్రాకర్స్‌కి రాజకీయ మకిలి అంటుకుంది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య జరుగుతోన్న కమీషన్ ఫైట్‌లో సామాన్య వ్యాపారులు నలిగిపోతున్నారట. దీపావళికి టపాసులు ఏ రేంజ్‌లో పేలతాయో పక్కనబెడితే.. అసలు క్రాకర్స్‌ని అమ్మనిస్తే కదా.. అంటున్నారు వ్యాపారులు. క్రాకర్స్ షాపు పెట్టాలంటే కనీసం నలభై వేల రూపాయలు చెల్లించాల్సిందేనంటూ హుకుం జారీ చేస్తున్నారట ఎమ్మెల్యే అండ్ మాజీ ఎమ్మెల్యే వర్గీయులు.
కర్నూలులో ప్రతి ఏటా ఎస్టీ బీసీ గ్రౌండ్‌లో క్రాకర్స్ దుకాణాలకు అనుమతించేవారు. ఈసారి కూడా అక్కడే ఏర్పాటు చేసుకునేలా నిర్ణయించారు. అయితే, నిర్వహణా అనుమతుల కింద ఒక్కో షాప్‌కి రూ. 47వేల వరకు ఖర్చవుతోంది. దీనికి అదనంగా పొలిటికల్ లీడర్స్‌కి వేల రూపాయలు చెల్లించుకోవాల్సిందే. 27వేలు రూపాయలు చెల్లిస్తే అంతా తామే చూసుకుంటామని మాజీ ఎమ్మెల్యే వర్గీయులు చెబుతుంటే.. రూ. 39వేలు ఇస్తే ట్రేడ్ లైసెన్స్‌తో పాటు దుకాణం ఏర్పాటు వరకు అన్నీ చూసుకుంటామంటోంది ఎమ్మెల్యే వర్గం.
దాంతో, ఇరువర్గాలు గొడవపడే స్థాయికి వెళ్లింది వివాదం. ఎమ్మెల్యే అండ్ మాజీ ఎమ్మెల్యే వర్గీయుల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరడంతో పోలీసులు ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది. చివరికి దుకాణాలన్నీ ఎమ్మెల్యే వర్గం చేతికి వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. ఒక్కో దుకాణానికి రూ. 28,500 ధర నిర్ణయించినట్టు టాక్. ఇలా, సుమారు 31లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్లు చెప్పుకుంటున్నారు. ఇప్పుడీ భారమంతా తమపైనే పడుతుందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు జనం.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..