Gold: పండక్కి బంగారం కొంటున్నారా.. ఈ లెక్కలు తెలియకుంటే నష్టపోతారు..

Gold Rate: బంగారంపై పెట్టుబడిని ఫిజికల్ గోల్డ్, డిజిటల్ గోల్డ్, పేపర్ గోల్డ్‌గా విభజించారని తెలిపారు. నగలు లేదా నాణేలు వంటి భౌతిక బంగారంపై పన్ను అనేది హోల్డింగ్ వ్యవధిపై ఆధారపడి ఉంటుంది.

Gold: పండక్కి బంగారం కొంటున్నారా.. ఈ లెక్కలు తెలియకుంటే నష్టపోతారు..
Gold Price
Follow us

|

Updated on: Oct 20, 2022 | 4:04 PM

బంగారం అత్యంత పురాతనమైన, అత్యంత విశ్వసనీయమైన ఇన్వెస్ట్మెంట్ అని చెప్పవచ్చు. పెళ్లిళ్లు, పండుగలు.. ఇతర సమయాల్లో బంగారం కొనుక్కోవడం తప్పనిసరిగా మారింది. ముఖ్యంగా మహిళలు బంగారాన్ని పెట్టుబడికి ఉత్తమ మార్గంగా భావిస్తుంటారు. ధన్‌తేరస్, దీపావళి వంటి పండుగలలో బంగారం అమ్మకం పెరుగుతుంది. అలాగే అక్షయ తృతీయ కూడా బంగారం కొనుగోళ్లకు మంచిదని అందరూ భావిస్తారు. ఇప్పుడు బంగారంలో పెట్టుబడి పెట్టడానికి 3 మార్గాలు ఉన్నాయి. మీరు నగలు లేదా నాణేలు కొనవచ్చు. లేదా పేపర్ గోల్డ్ తీసుకోవచ్చు. అలాగే డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేయవచ్చు. ఆభరణాలు, నాణేలు బంగారంలో పెట్టుబడి పెట్టడానికి సాంప్రదాయ మార్గాలు. అదేవిధంగా పేపర్ గోల్డ్, డిజిటల్ గోల్డ్ కొత్త తరహా ఇన్వెస్ట్మెంట్ సాధనాలుగా ఉన్నాయి. ధన్‌తేరాస్‌ వంటి పండుగలు దగ్గరకు వచ్చాయి. గత 2 ఏళ్ల మాదిరిగా ఎలాంటి పరిమితి లేకపోవడంతో ఈ ఏడాది మంచి అమ్మకాలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్, అక్టోబర్ 7న పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,770 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,520. ఇది ఈ మధ్యకాలంలో కనిష్ట స్థాయి అని చెప్పవచ్చు.

ధన్‌తేరస్‌లో 2021లో బంగారం అమ్మకాలు ఎలా జరిగాయి అనేది పరిశీలిస్తే.. అప్పుడు 50 టన్నుల బంగారం అమ్మకాలు జరిగాయి. ఇది 2020 సంవత్సరం కంటే దాదాపు 20 టన్నులు ఎక్కువ. ఈసారి ఈ సంఖ్య మరింత పెరగవచ్చు అనే అంచనాలు ఉన్నాయి.

బంగారంపై పన్ను ఎలా విధిస్తారు అనే అంశాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మిత్ కన్సల్టెన్సీ వ్యవస్థాపకుడు CA నితేష్ బుద్ధదేవ్ మాట్లాడుతూ.. బంగారంపై పెట్టుబడిని ఫిజికల్ గోల్డ్, డిజిటల్ గోల్డ్, పేపర్ గోల్డ్‌గా విభజించారని తెలిపారు. నగలు లేదా నాణేలు వంటి భౌతిక బంగారంపై పన్ను అనేది హోల్డింగ్ వ్యవధిపై ఆధారపడి ఉంటుందని, బంగారు ఆభరణాలను కొన్న 3 సంవత్సరాలలో విక్రయిస్తే.. ఇది స్వల్పకాలిక మూలధన లాభంగా పరిగణనలోకి వస్తుంది. ఈ స్వల్పకాలిక మూలధన లాభం మీ మొత్తం పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయానికి కలుపుతారు. దీనిపై టాక్స్ స్లాబ్ ప్రకారం పన్ను విధిస్తారు. అయితే, దానిని 3 సంవత్సరాల తర్వాత అమ్మినట్లయితే అప్పుడు ఇండెక్సేషన్ ప్రయోజనంతో పాటు దానిపై 20 శాతం టాక్స్ వసూలు చేస్తారు.

ఇవి కూడా చదవండి

డిజిటల్ బంగారంపై టాక్స్ నియమాలు..

డిజిటల్ బంగారం అమ్మకంపై ఫిజికల్ గోల్డ్ పై ఏవిధంగా అయితే టాక్స్ విధిస్తారో అదేవిధంగా పన్ను విధిస్తారు. అంటే 3 సంవత్సరాలలోపు విక్రయిస్తే స్వల్పకాలిక మూలధన లాభాల పన్నులు.. అలాగే 3 సంవత్సరాల తర్వాత విక్రయిస్తే ఇండెక్సేషన్‌తో కూడిన దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి వస్తుంది.

ఇండెక్సేషన్ వల్ల ఎంత ప్రయోజనం ఉంటుందనే విషయాన్ని పరిశీలిద్దాం. మీరు 2019లో గ్రాముకు రూ. 1000 చొప్పున బంగారాన్ని కొనుగోలు చేసి, 2022లో గ్రాము రూ.1,500కి విక్రయించారని అనుకుందాం… ఈ కోణంలో రూ. 500 లాభం ఉంటుంది. కానీ, మూలధన లాభాలను లెక్కించేటప్పుడు టాక్స్ విధించే గోల్డ్ గా పరిగణించరు. ఇప్పుడు మనం ఇండెక్సేషన్ గురించి అంటే ఈ 3 సంవత్సరాలలో ద్రవ్యోల్బణం కారణంగా రూపాయి కొనుగోలు శక్తి క్షీణత వైపు నుంచి చూసినట్లయితే, అప్పుడు ప్రస్తుత ద్రవ్యోల్బణం రేటు ప్రకారం, రూ. 1500లతో విక్రయిస్తే.. అది దాదాపు రూ. 1200 ఉంటుంది. అంటే మీ అసలు మూలధన లాభం రూ. 500 కాదని గుర్తుంచుకోవాలి. అంటే మీ లాభం కేవలం రూ. 200గా ఉంటుంది. మీరు దానిపై పన్ను చెల్లించాలసి ఉంటుంది.

పేపర్ గోల్డ్ పై పన్ను బాధ్యత ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. పేపర్ గోల్డ్‌లో గోల్డ్ ఇటీఎఫ్‌లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్‌లు ఉంటాయి. సావరిన్ గోల్డ్ బాండ్‌లు (ఎస్‌జీబీ) ఉంటాయి. గోల్డ్ ఇటీఎఫ్‌లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్ల విషయంలో ఫిజికల్ గోల్డ్ మాదిరిగానే పన్ను పరిధిలోకి వస్తాయి. అయితే, సావరిన్ గోల్డ్ బాండ్‌లకు పన్ను నిబంధనలు భిన్నంగా ఉంటాయి.

ఇప్పుడు సావరిన్ గోల్డ్ బాండ్ (SGB)పై పన్నునిబంధనలు చూద్దాం. సావరిన్ గోల్డ్ బాండ్‌లు సంవత్సరానికి 2.5 శాతం వడ్డీని పొందుతాయి. ఇది పెట్టుబడిదారుడి పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయానికి కలిపి, స్లాబ్ ప్రకారం పన్ను విధిస్తారు. గోల్డ్ బాండ్‌లకు 8 సంవత్సరాల మెచ్యూరిటీ వ్యవధి ఉంటుంది. మెచ్యూరిటీ తరువాత విక్రయిస్తే, అప్పుడు ఎలాంటి పన్ను ఉండదు.

పెట్టుబడిదారులు 5 సంవత్సరాల తర్వాత గోల్డ్ బాండ్‌ను ప్రీ-మెచ్యూర్ రీడీమ్ చేసుకోవచ్చు. బాండ్‌ను 5 నుంచి 8 సంవత్సరాల మధ్య విక్రయిస్తే, లాభాన్ని దీర్ఘకాలిక మూలధన లాభంగా పరిగణిస్తారు. ఇండెక్సేషన్ ప్రయోజనంతో 20 శాతం పన్ను విధిస్తారు.

సావరిన్ గోల్డ్ బాండ్లను స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో కొనుగోలు చేయవచ్చు, అమ్మవచ్చు. అప్పుడు పన్ను స్లాబ్ ప్రకారం పన్ను విధిస్తారు. ఒక వ్యక్తి 2020 సంవత్సరంలో బాండ్‌ని కొనుగోలు చేసి 2022 సంవత్సరంలో విక్రయిస్తే, అది స్వల్పకాలిక మూలధన లాభం పరిధిలోకి వస్తుంది . పన్ను స్లాబ్ ప్రకారం పన్ను విధిస్తారు. అయితే 2028లో రీడీమ్ చేసుకుంటే, ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో