Gold Price Today: పండగ వేళ మహిళలకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
దేశంలో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. రోజురోజుకు పెరుగుతున్న పసిడి ధరలు.. దీపావళికి ముందు పరుగులు పెడుతోంది. మహిళలు అత్యంత ఇష్టపడి బంగారం..
దేశంలో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. రోజురోజుకు పెరుగుతున్న పసిడి ధరలు.. దీపావళికి ముందు పరుగులు పెడుతోంది. మహిళలు అత్యంత ఇష్టపడి బంగారం ఇప్పుడు మరింత ప్రియమైంది. పండగ సీజన్‌లో బంగారం షాపులన్ని కస్టమర్లతో కిటకిటలాడుతుంటాయి. ఇక తాజాగా అక్టోబర్ 23న దేశీయంగా బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా రూ.750 పెరుగగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.830 పెరిగింది. ఇక వెండి కూడా అదే బాటలో పరుగులు పెడుతోంది. కిలో వెండిపై ఏకంగా రూ.1550 ఏగబాకింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో ఏ సమయంలోనైనా పెరగవచ్చు. తగ్గవచ్చు. మీరు బంగారం కొనుగోలు చేసే సమయానికి ముందు ధరలు తెలుసుకోవడం ముఖ్యం.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,400 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,710 వద్ద నమోదైంది.
ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల తులం ధర రూ.51,280 వద్ద ఉంది.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ.47,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,440 ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280 ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.47,050 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,330 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280 వద్ద కొనసాగుతోంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,280 వద్ద కొనసాగుతోంది.
విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280 ఉంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధర:
చెన్నైలో కిలో వెండి ధర రూ.63,200, ముంబైలో రూ.57,700, ఢిల్లీలో రూ.57,700, కోల్‌కతాలో కిలో వెండి రూ.57,700, బెంగళూరులో రూ.63,200, హైదరాబాద్‌లో రూ.63,200, విశాఖలో రూ.63,200 వద్ద ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి