AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dubai Gold: దుబాయ్‌ నుంచి భారత్‌కు బంగారం తెస్తున్నారా..? ఎలాంటి ఛార్జీలు ఉంటాయి.. నిబంధనలేంటి?

బంగారం అంటే అందరికి ఇష్టమే. భారతీయ సాంప్రదాయంలో మహిళలకు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. బంగారు ఆభ‌ర‌ణాల‌ను ధ‌రించాల‌నే కోరిక చాలా మందికి ఉంటుంది..

Dubai Gold: దుబాయ్‌ నుంచి భారత్‌కు బంగారం తెస్తున్నారా..? ఎలాంటి ఛార్జీలు ఉంటాయి.. నిబంధనలేంటి?
Gold
Subhash Goud
|

Updated on: Oct 21, 2022 | 11:37 AM

Share

బంగారం అంటే అందరికి ఇష్టమే. భారతీయ సాంప్రదాయంలో మహిళలకు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. బంగారు ఆభ‌ర‌ణాల‌ను ధ‌రించాల‌నే కోరిక చాలా మందికి ఉంటుంది. కేవ‌లం మ‌హిళ‌లే కాదు.. పురుషులు కూడా బంగారు ఆభ‌ర‌ణాల‌ను ధ‌రించేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు. అయితే మ‌న దేశంలో బంగారం ధ‌ర చాలా ఎక్కువ‌. బంగారాన్ని క‌డ్డీలు, బార్‌ల రూపంలో కొంటే మేకింగ్ ఛార్జీలు ఉండ‌వు. కానీ ఆభ‌ర‌ణాల‌ను కొంటే మేకింగ్ ఛార్జీలు విధిస్తారు. ఇప్పుడు ధన్‌తెరాస్‌ వస్తుండటంతో బంగారానికి డిమాండ్‌ మరింతగా పెరుగుతుంది. పండగ సీజన్‌లో పుత్తడికి డిమాండ్ పెరుగుతుండటంతో చాలా మంది కొనుగోలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే దుబాయ్‌కి వెళ్లేవారు బంగారు ఆభ‌ర‌ణాల‌ను కొని తెస్తుంటారు.

చాలా మంది దీపావళి రోజున తమ సిబ్బందికి బంగారు నాణేలను బహుమతిగా ఇస్తుంటారు. దీంతో బంగారం ధర కూడా భారీగా పెరుగుతుంది. దీని కారణంగా చాలా మంది భారతీయులు దుబాయ్‌ నుంచి బంగారం, అభరణాలను కొనుగోలు చేస్తారు. అక్కడ ఎటువంటి పన్ను విధించరు. కానీ దుబాయ్‌ నుంచి కొంత బంగారాన్ని భారత్‌కు తీసుకువచ్చేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లయితే కొన్ని మార్గదర్శకాల గురించి తెలుసుకోవడం తప్పనిసరి. మీరు దుబాయ్‌ నుంచి బంగారాన్ని తీసుకురాలేరు. దుబామ్‌ నుంచి భారత్‌కు బంగారం తీసుకువచ్చిన తర్వాత లాభంలో విక్రయించలేరు. ప్రభుత్వం సుంకాలు, ఇతర ఛార్జీలను విధిస్తుంది. అక్కడి నుంచి భారత్‌కు తీసుకువచ్చిన తర్వాత వివిధ ఛార్జీల రూపంలో మీకు ఖర్చు మరింతగా పెరిగిపోతుంటుంది.

సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ పరోక్ష పన్నులు అండ్‌ కస్టమ్స్‌ (CBIC) వివరాల ప్రకారం.. భారత పాస్‌పోర్టు వినియోగదారులు, భారత సంతతికి చెందిన వ్యక్తులకు ఆరు నెలల కంటే ఎక్కువ కాలం ఉంటే బంగారానికి 12.5 శాతం+సర్‌చార్జ్‌ 1.25 శాతం వర్తిస్తుంది. ఇతర సందర్భాలలో ఒక వ్యక్తి భారతదేశానికి తీసుకువచ్చిన బంగారంపై 38.5 శాతం కస్టమ్స్‌ సుంకం చెల్లించాల్సి ఉంటుంది. బంగారం బరువు ఒక వ్యక్తికి కిలో కంటే ఎక్కువ ఉండకూడదని కూడా నిబంధనలు చెబుతున్నాయి. మీరు డ్యూటీలో ఆదా చేయాలనుకుంటే మీరు తప్పనిసరిగా డ్యూటీ-ఫ్రీ పరిమితిలో విలువ లేదా మొత్తాన్ని ఉంచాలి. ఒక సంవత్సరానికి పైగా విదేశాలలో నివసిస్తున్న ఒక పురుషుడు 20 గ్రాముల బంగారు ఆభరణాలను, దాని విలువ రూ. 50,000 మించకుండా తీసుకురావచ్చు. మహిళా ప్రయాణికులకు సుంకం రహిత పరిమితి రూ. 1,00,000 గరిష్ట విలువ కలిగిన 40 గ్రాముల బంగారు ఆభరణాలు తీసుకురావచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..
తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?
16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..
ఈ వారంలో నాలుగు రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఈ వారంలో నాలుగు రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..