AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Satya Nadella: ఉద్యోగులను కంపెనీలకు రప్పించడానికి మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదేళ్ల ఇచ్చిన సలహా ఏంటంటే..

కరోనా మహమ్మారి 2019 నుంచి యావత్‌ ప్రపంచాన్ని తలకిందులు చేసింది. ప్రస్తుతం కోవిడ్ కాస్త తగ్గుముఖం పట్టినా ఆర్థిక పరిస్థితులు మాత్రం ఇంకా ఒక కొలిక్కిరాలేదు. దీంతో కంపెనీలు తమ ఉత్పాదకతను పెంచుకోవడానికి కొత్త పద్ధతులను అవలంభించవల్సిన అవసరం ఎంతైనా ఉందని..

Satya Nadella: ఉద్యోగులను కంపెనీలకు రప్పించడానికి మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదేళ్ల ఇచ్చిన సలహా ఏంటంటే..
Microsoft CEO Satya Nadella
Srilakshmi C
|

Updated on: Oct 21, 2022 | 1:12 PM

Share

కరోనా మహమ్మారి 2019 నుంచి యావత్‌ ప్రపంచాన్ని తలకిందులు చేసింది. ప్రస్తుతం కోవిడ్ కాస్త తగ్గుముఖం పట్టినా ఆర్థిక పరిస్థితులు మాత్రం ఇంకా ఒక కొలిక్కిరాలేదు. దీంతో కంపెనీలు తమ ఉత్పాదకతను పెంచుకోవడానికి కొత్త పద్ధతులను అవలంభించవల్సిన అవసరం ఎంతైనా ఉందని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల అన్నారు. ఇటీవల పద్మభూషణ్ అవార్డు అందుకున్న మైక్రోసాఫ్ట్ చీఫ్ ఒక ఇంటర్వ్యూలో పని సంస్కృతిని మార్చడం గురించి మాట్లాడారు. వర్క్‌ ఫ్రం హోం నుంచి ఉద్యోగులను తిరిగి కంపెనీలకు రప్పించడానికి ఆయా సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఐతే వస్తున్న మార్పులను కంపెనీల నిర్వహకులు పరిగణనలోకి తీసుకోవాలి. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ వంటి కంపెనీలు వారానికి పరిమిత రోజుల్లో ఉద్యోగులు ఆఫీసులకు వచ్చి పని చేసుకునేలా హైబ్రిడ్ మోడల్‌ వెసులుబాటు కల్పిస్తున్నాయి. ఈ విధానం వల్ల ఖర్చులు తగ్గడం మాత్రమేకాకుండా, ఉద్యోగులు కూడా సౌకర్యవంతంగా పనిచేసుకునేందుకు వీలుంటుందని నాదెళ్ల అన్నారు.

భారతదేశంలో ఉన్న ఉద్యోగుల్లో దాదాపు 80 శాతం మంది కంపెనీల మేనేజర్‌లతో సమావేశాలకు తప్ప, ఆఫీసులకు వెళ్లడం వల్ల ప్రయోజనం ఏముందని, అందుకు ముఖ్య కారణాలను చెప్పాలని అడుగుతున్నారు. తోటి ఉద్యోగుల మధ్య సత్సంబంధాలు బలపడాలంటే ఆఫీసులకు రావాలనే విషయాన్ని వారికి అర్థమయ్యేలా చెప్పగలగాలి. భారత్‌లో 91 శాతం మంది ఉద్యోగులు వర్క్‌ ఫ్రం హోం వల్ల సరిగా పని చేయడం లేదని, దాని ప్రభావం ఉత్పాదకతపై పడుతోందని మేనేజర్లు అంటున్నప్పటికీ రికార్డులు దానికి భిన్నంగా ఉన్నాయి. ఉద్యోగులు గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా పనిచేస్తున్నట్లు సర్వేలో బయటపడిందన్నారు. కాగా మైక్రోసాఫ్ట్‌ ఇటీవల చాలా మంది సీనియర్ ఉద్యోగులను తొలగించడంతో గత కొంతకాలంగా వార్తల్లో నిలిచింది. కంపెనీ ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకుని తదనుగుణంగా నిర్మాణాత్మక మార్పులు చేపడుతున్నట్లు మైక్రోసాఫ్ట్‌ తన చర్యను సమర్ధించుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.