NEET Counselling 2022: నీట్ యూజీ-2022 మొదటి రౌండ్ ఫలితాల ప్రకటన నేడే.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి..
నీట్ యూజీ - 2022 రౌండ్ 1 కౌన్సెలింగ్ తుది ఫలితాలను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ శుక్రవారం (అక్టోబర్ 21) విడుదల చేయనుంది. కౌన్సెలింగ్‌లో పాల్గొన్న విద్యార్ధులు..
నీట్ యూజీ – 2022 రౌండ్ 1 కౌన్సెలింగ్ తుది ఫలితాలను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ శుక్రవారం (అక్టోబర్ 21) విడుదల చేయనుంది. కౌన్సెలింగ్‌లో పాల్గొన్న విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. కాగా రౌండ్ 1కు సంబంధించి ప్రొవిజినల్ రిజల్ట్స్ ఎమ్‌సీసీ గురువారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఫైనల్ రిజల్ట్స్ నేడు విడుదలవ్వనున్నాయి. ఎంబీబీఎస్/బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు మొదటి రౌండ్‌లో సీటు పొందిన విద్యార్ధులు అక్టోబర్ 22 నుంచి 28వ తేదీలోపు ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేయవల్సి ఉంటుంది. నీట్ యూజీ 2022 రెండో రౌండ్ కౌన్సెలింగ్‌కు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబర్ 2 నుంచి ప్రారంభమవుతుంది. సీట్ల కేటాయింపు ఫలితాలు నవంబర్ 11న ప్రకటిస్తారు. ఇతర వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
NEET UG Counselling 2022 సీటు అలాట్‌మెంట్ ఫలితాలను ఇలా చేసుకోండి..
- మొదట ఎమ్‌సీసీ అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసుకోవాలి.
- హోమ్ పేజీలో కనిపించే నీట్ యూజీ కౌన్సెలింగ్ 2022 రౌండ్ 1 అలాట్మెంట్ రిజల్ట్స్ లింక్‌పై క్లిక్ చెయ్యాలి.
- అనంతరం లాగిన్ వివరాలను నమోదు చేసి, సబ్‌మిట్‌పై క్లిక్ చేయాలి.
- రిజల్ట్స్ స్క్రీన్‌పై కనిపిస్తాయి.
- ఫలితాలను చెక్ చేసుకుని, హార్డ్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.